X

వాస్తవ తనిఖీ: ఢిల్లీలో ఒక ట్యాంకర్ నుండి ప్రజలు నీరు నింపుకుంటున్న వైరల్ చిత్రం నకిలీది.

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని కనుగొన్నారు. 2009లోని వైరల్ చిత్రము ఇటీవల తీసినదిగా పేర్కొనబడింది.

  • By Vishvas News
  • Updated: July 9, 2021

కొత్త ఢిల్లీ (కొత్త ఢిల్లీ): సామాజిక మాధ్యమములో ఒక చిత్రం వైరల్ అవుతోంది, ప్రజలు ఒక ట్యాంకర్ నుండి నీరు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రము ఢిల్లీలోని నీటి పరిస్థితి గురించి చెప్తోంది అని యూజర్స్ పేర్కొంటున్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేదిగా ఉందని కనుగొనింది. ఈ వైరల్ చిత్రము 2009 లో తీసినది మరియు ఇటీవల తీసినదిగా క్లెయిం చేయబడుతోంది.

క్లెయిం

ఫేస్బుక్ పేజ్ బెస్ట్ హింది న్యూస్ జూన్ 19 నాడు ఇటీవలి పరిస్థితిగా వివరిస్తూ ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆ క్లెయిం ఈ విధంగ ఉంది: ‘ఢిల్లీలో నీటి పరిస్థితి’

ఆ చిత్రము ఇటీవల తీసినది అని పరిగణిస్తూ ఇతర యూజర్స్ కూడా దానిని షేర్ చేశారు మరియు దానిని వైరల్ చేశారు. ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి వైరల్ చిత్రాన్ని వెతకడం ప్రారంభించింది. ప్రారంభ దశలోనే, మాకు అలామి ఫోటో ఏజెన్సీలో ఈ చిత్రము  కనిపించింది. క్యాప్షన్ ప్రకారము, ఈ చిత్రము జూన్ 30, 2009లో సంజయ్ కాలనీ, ఢిల్లీలో తీయబడింది. ఆ సమయములో ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఉన్నారు. ఈ చిత్రాన్ని ర్యూటర్స్ కొరకు అద్నాన్ అబీది తీశారు.

విశ్వాస్ న్యూస్ అద్నాన్ అబీదిని సంప్రదించారు. సామాజిక మాధ్యమములో వైరల్ అవుతున్న ఈ చిత్రము 2009లో తీసినది అని ఆయన చెప్పారు.

మేము ఆ పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్బుక్ పేజ్ బెస్ట్ హింది న్యూస్ ను స్కాన్ చేశాము మరియు ఆ పేజ్ ను రెండు లక్షల కంటే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు అని తెలుసుకున్నాము.

निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని కనుగొన్నారు. 2009లోని వైరల్ చిత్రము ఇటీవల తీసినదిగా పేర్కొనబడింది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later