X

వాస్తవ తనిఖి: ఏప్రిల్ 15 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబడుతుందని తెలిపే వైరల్ పోస్ట్ నకిలీది.

  • By Vishvas News
  • Updated: May 6, 2021

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): ఏప్రిల్ 15 నుండి 30 వరకు భారతదేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించబడుతుందని తెలుపుతున్న ఒక వార్తా ఛానల్ యొక్క స్క్రీన్షాట్ తో సోషల్ మీడియాపై ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ పోస్ట్ నకిలీది అని కనుగొనింది. ఈ నకిలీ పోస్ట్ టీవి9 భారత్వర్ష్ యొక్క లోగో మరియు స్క్రీన్షాట్ ఉపయోగించి తయారు చేయబడింది.

క్లెయిం

సందీప్ సింగ్ అనే ఒక ఫేస్బుక్ యూజర్ భారతదేశములో ఏప్రిల్ 15 నుండి 30 వరకు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించబడిందని తెలుపుతూ ఏప్రిల్ 14న ఒక నకిలీ స్క్రీన్షాట్ ను పోస్ట్ చేశారు.

ఫేస్బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ వీక్షించండి.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ ఆ స్క్రీన్షాట్ ను జాగ్రత్తగా పరిశీలించింది. అందులో ఇలా వ్రాయబడింది: “వైరస్ నుండి ఎవరు రక్షించబడాలి…….ఇప్పుడు లాక్డౌన్ పరిష్కారమా” ఈ పోస్ట్ టీవి9 భారత్వర్ష్ లోగో ఉపయోగించి ఒక స్క్రీన్షాట్ రూపములో ప్రచారం చేయబడింది. మేము దర్యాప్తు చేసి ఏప్రిల్ 12, 2021 నాటి ఈ నివేదికలో ఒక వాక్యాన్ని కనుగొన్నాము. ఈ వాక్యాన్ని వార్తలలో మొదటి కొన్ని క్షణాల వరకు ఉపయోగించబడింది. దానిని మీరు ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు సమయములో, స్క్రీన్షాట్ మార్ఫింగ్ చేయబడిందని తెలుసుకున్నాము, ఎందుకంటే టీవి9 భారత్వర్ష్ ఛానల్ లో ఉపయోగించబడే వ్రాత శైలి భిన్నంగా ఉంది.

అలాగే మేము రియల్ ఎడ్యుకేషన్ అన్ ఒక యూట్యూబ్ ఛానల్ పేరు కనుగొన్నాము. ఒక వార్తా ఛానల్ యొక్క మార్ఫింగ్ చేయబడిన స్క్రీన్షాట్ ఏప్రిల్ 13, 2021 నాడు ఈ ఛానల్ పై ఉపయోగించబడింది. దాని వెంబడి అనేక నివేదికలు జతచేసి ఒక వీడియో తయారు చేయబడింది. రియల్ ఎడ్యుకేషన్ అనే ఈ ఛానల్ పై అనేక తప్పుదోవపట్టించే వీడియోలను మేము కనుగొన్నాము.

టీవి9 భారత్వర్ష్ యొక్క సంపాదకుడిని సంప్రదించి మేము మరింత విచారణ జరిపాము. ఆయన ఇది పూర్తిగా నకిలీది అని తెలిపారు. ఛానల్ పై ఇటువంటి వార్తలు చూపించబడవు అని తెలిపారు.

రాత్రిపూట కర్ఫ్యూ కాకుండా, దేశములో అనేక రాష్ట్రాలలో వారాంతపు కర్ఫ్యూ కూడా విధించబడింది.

విశ్వాస్ న్యూస్ ఈ నకిలీ స్క్రీన్షాట్ పోస్ట్ చేసిన ఫేస్బుక్ యూజర్ సందీప్ సింగ్ యొక్క సోషల్ స్క్రీనింగ్ చేసింది. ఈ యూజర్ రెవారి నివాసి అని కనుగొన్నాము. అతనికి 900 స్నేహితులు ఉన్నారు.

निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఏప్రిల్ 15 నుండి 30 వరకు దేశవ్యాప్త లాక్డౌన్ విధించబడింది అని తెలిపే పోస్ట్ నకిలీది అని కనుగొనింది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later