X

వాస్తవ తనిఖీ: ఒక లింక్ పై క్లిక్ చేయడము ద్వారా పోటీలో పాల్గొంటే టాటా మోటార్స్ వారు టాటా సఫారీని అందిస్తున్నారు అని క్లెయిమ్ చేసే పోస్ట్ ఒక స్కాం

టాటా మోటర్స్ ఒక లింక్ పై క్లిక్ చేసి పోటీలో పాల్గొంటే టాటా సఫారీని అందిస్తోంది అని క్లెయిమ్ చేసే ఒక పోస్ట్ ఒక స్కాం. ఈ పోస్ట్ లో ఇవ్వబడిన లింక్ మోసపూరితమైనది మరియు రీడర్స్ ఇటువంటి లింక్స్ పై క్లిక్ చేయకూడదు.

  • By Vishvas News
  • Updated: June 29, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): టాటా మోటర్స్ వారు ఉత్తమ బ్రాండ్ షేరింగ్ ఈవెంట్ అవార్డును నిర్వహిస్తోంది అని మరియు టాటా సఫారీని గెలుచుకునే ఒక అవకాశాన్ని అందిస్తోందని క్లెయిమ్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోస్ట్ వెంబడి, ఒక లింక్ షేర్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ విచారణ జరిపి ఈ వైరల్ పోస్ట్ ఒక స్కాం అని కనుగొనింది. ఈ అనుమానాస్పద లింక్ రీడర్స్ ను తమ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసేలాగా ప్రోత్సహిస్తుంది. ఇటువంటి లింక్ పై క్లిక్ చేయకూడదని రీడర్స్ కు సూచించబడుతోంది, ఇది ఒక మోసపూరితమైన పోస్ట్.

క్లెయిమ్

టాటా మోటర్స్ వారు ఉత్తమ బ్రాండ్ షేరింగ్ ఈవెంట్ అవార్డును నిర్వహిస్తున్నారని మరియు టాటా సఫారీని గెలుచుకునే ఒక అవకాశాన్ని అందిస్తున్నారని క్లెయిమ్ చేస్తున్న ఒక వైరల్ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. పోస్ట్ వెంబడి, ఒక లింక్ షేర్ చేయబడింది.

విచారణ

టాటా మోటర్స్ వాళ్ళు ఇటీవల నిర్వహించిన పోటీల కొరకు సెర్చ్ చేస్తూ విశ్వాస్ న్యూస్ తన విచారణను ప్రారంభించింది. వారి అధికారిక వెబ్సైట్ పై ఇటువంటి పోటీలు ఏవి మాకు కనిపించలేదు. ఇంకా మేము ఇటువంటి పోటీ గురించి ప్రస్తావించిన వార్తా వ్యాసాలను కూడా సెర్చ్ చేశాము, ఇటువంటి పోటీని ఉదహరిస్తూ ఎలాంటి వార్తా వ్యాసాలు ఇటీవల ప్రచురించబడలేదు.

మేము మరింత సెర్చ్ చేసి టాటా మోటర్స్ కార్స్ అధికారిక ఫేస్‎బుక్ మరియు ట్విట్టర్ ఖాతాల నుండి పోస్ట్స్ కనుగొన్నాము, వాటిల్లో ఇలా ఉంది, ‘లింక్స్ ఓపెన్ చేసిన వారి డేటా దొంగతనము మరియు వ్యక్తిగత సమాచారము యొక్క చోరీ చేసే మోసపూరిత ఉద్దేశముతో సోషల్ మీడియాలో టాటా మొటర్స్ నుండి పోటీలు మరియు ఉచిత సరుకు అనే పేరుతో కొన్ని పోస్ట్ లు మా దృష్టికి వచ్చాయి…’

అప్పుడు మేము వైరల్ పోస్ట్ లో ఇవ్వబడిన లింక్ ను పరీక్షించాము. వైరల్ పోస్ట్ లో ఉన్న లింక్ http://virginitycompassion.top/Tatamotorsasy/tb.php?pfdpvrmy1654529988090 టాటా మోటర్స్ యొక్క అధికారిక వెబ్సైట్ లింక్ tatamotors.com కు భిన్నమైనది. ఈ లింక్ అనేక సర్వే ప్రశ్నలను అడుగుతుంది మరియు వాట్సాప్ పై మరింతమంది స్నేహితులకు షేర్ చేయాలని రీడర్స్ ను ప్రోత్సహిస్తుంది.

అలాగే ఫేస్‎బుక్ పై ఒక పోస్ట్ కూడా మాకు లభించింది, ఇందులో ఒక యూజర్ టాటా మోటర్స్ ను ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ మోసపూరితమైనదిగా అనిపిస్తోంది అని పేర్కొన్నారు. దీనికి స్పందనగా టాటా మోటర్స్ వారు ఇలా సమాధానము ఇచ్చారు: ‘మమ్మల్ని చేరుకున్నందుకు ధన్యవాదములు. టాటా మోటర్స్ ఇటువంటి పోటీ ఏదీ ప్రకటించలేదు మరియు ఇటువంటి పథకాలతో మాకు సంబంధము ఉందని చెప్పడాన్ని మేము ఖండిస్తున్నాము. సోషల్ మీడియాపై ఇటువంటి మోసపూరిత సందేశాలను వ్యాప్తి చేయకూడదు అని మేము ధృఢంగా సూచిస్తున్నాము. దయచేసి ఇటువంటి లీంక్స్/సందేశాలపై క్లిక్ చేయడము లేదా ఎంగేజ్ చేయవద్దు..”

విశ్వాస్ న్యూస్ టాటా మోటర్స్ యొక్క కస్టమర్ సర్వీస్ విభాగము నుండి శాంతను గారిని సంప్రదించాము. ఆయన ఈ వైరల్ పోస్ట్ నకిలీది అని మరియు ఈ లింక్ అనుమానాస్పదమైనది అని చెప్పారు. టాటా మోటర్స్ ఇటువంటి పోటీని ప్రకటించలేదు మరియు ఇటువంటి పథకాలతో మాకు సంబంధము ఉందని చెప్పడాన్ని మేము ఖండిస్తున్నాము.

निष्कर्ष: టాటా మోటర్స్ ఒక లింక్ పై క్లిక్ చేసి పోటీలో పాల్గొంటే టాటా సఫారీని అందిస్తోంది అని క్లెయిమ్ చేసే ఒక పోస్ట్ ఒక స్కాం. ఈ పోస్ట్ లో ఇవ్వబడిన లింక్ మోసపూరితమైనది మరియు రీడర్స్ ఇటువంటి లింక్స్ పై క్లిక్ చేయకూడదు.

  • Claim Review : టాటా మోటర్స్ ఒక లింక్ పై క్లిక్ చేసి పోటీలో పాల్గొంటే టాటా సఫారీఇ అందిస్తోంది.
  • Claimed By : వాట్సాప్ యూజర్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later