
హైదరాబాద్
(విశ్వాస్
న్యూస్) : సోషల్ మీడియాలో నాలుగు రోజులుగా ఒక వీడియో వైరల్ అవుతోంది, చిరుతపులి రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీస్తున్న వీడియో అది. చిరుత పులి రోడ్డుమీద జనసంచార ప్రదేశంలో తిరుగుతున్న
వీడియో కావడంతో చాలా మంది ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ చిరుతపులి ఢిల్లీ రహదారిపై నడుస్తున్నట్లు వైరల్ పోస్టులో పేర్కొన్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వీడియో వాస్తవానికి హైదరాబాద్‌లో రికార్డు చేసినదని, ఢిల్లీలో కాదని వాస్తవ తనిఖీలో తేలింది.
వైరల్ అయినది ఏంటి ?
వైరల్ వీడియోలో, చిరుతపులి రోడ్డుమీద తిరుగుతున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. చాలా మంది ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. “ద్వారకా విమానాశ్రయం అండర్ పాస్ దగ్గర ఇప్పుడే కనిపించిన దృశ్యం” అని వైరల్ పోస్ఖ్‌లో క్లెయిమ్ చేసుకున్నారు.
ఈ పోస్ట్‌కు సంబంధించిన ఫేస్‌బుక్ లింక్:
(కానీ, విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తప్పుడు సమాచారం అని నిర్ధారించిన తర్వాత ఈ లింక్ తీసేశారు.)
దీనికి సంబంధించిన అర్కైవ్ లింక్
దర్యాప్తు :
ఈ వైరల్ పోస్ట్‌ను పరిశోధించడానికి, మేము ఈ వీడియోను ఇన్‌విడ్ వీడియో వెరిఫికేషన్ టూల్ ద్వారా వెతికాము. ఈ వీడియోకు సంబంధించిన కీలక ఫ్రేమ్‌లను సేకరించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్స్‌లో శోధించాము. ఫలితంగా మే 14వ తేదీన ANI అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. ‘’హైదరాబాద్‌లో రహదారిపై విశ్రాంతి తీసుకుంటున్న చిరుత’’ అనే శీర్షికతో ఆ వీడియో ఉంది.
ఈ వీడియోను టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా కవర్ చేసింది. ఆ కథనం ప్రకారం, వీడియో హైదరాబాద్ లోని మేలార్‌దేవ్‌పల్లిలో రికార్డ్ చేశారు.
ఈ అంశానికి సంబంధించి మేము ఇంకా శోధిస్తుండగా.. మే 14వ తేదీన భారతీయ అటవీ సేవా అధికారి సుశాంత్ నందా చేసిన ట్వీట్ కూడా మాకు దొరికింది. ఈ వీడియో హైదరాబాద్లోని మేలార్‌దేవ్‌పల్లికి చెందినదని నందా ఈ ట్వీట్‌లో స్పష్టం చేశారు.
ఫ్యాక్ట్ చెక్ శోధనలో భాగంగా మరింత ధృవీకరణ కోసం అటవీ అధికారి సుశాంత్ నందాను మేము సంప్రదించాము. “వీడియోలో చూపిన చిరుతపులి హైదరాబాద్ రోడ్డుపై కనిపించింది. ‘’ అని నందా చెప్పారు.
ఈ పోస్ట్‌ను మే 16 వ తేదీన ‘కుందన్ కుమార్’ అనే ఫేస్‌బుక్ యూజర్ షేర్ చేశారు. బీహార్లోని భోజ్‌పూర్‌కు చెందిన కుందన్ కుమార్.. ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడు. యూజర్‌కు ఫేస్‌బుక్‌లో 4,579 మంది స్నేహితులు ఉన్నారు.
निष्कर्ष: మా పరిశోధనలో, ఈ చిరుతపులి వాస్తవానికి హైదరాబాద్లో రోడ్డుపై తిరుగుతోందని కనుగొన్నాము. ఈ వీడియో ఢిల్లీలో రికార్డు చేసింది కాదు.. హైదరాబాద్‌లో జరిగిన సంఘటన అని గుర్తించాము.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.