
కరోనావైరస్ ను ఎదుర్కొనుటకు పసుపు మరియు నిమ్మకాయలు సహాయపడతాయని సామాజిక మాధ్యమములో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ దీని గురించి పరిశోధించింది మరియు ఈ వైరల్ పోస్ట్ తప్పు అని కనుగొనింది. నిపుణుల ప్రకారం పసుపు మరియు నిమ్మకాయలు కరోనావైరస్ ను ఎదుర్కొనుటలో సహాయపడతాయని చెప్పుటకు ఎలాంటి రుజువులు లేవు.
సావన్ సింఘ్ అనే యూజర్ సామాజిక మాధ్యమముపై షేర్ చేసిన ఒక పోస్ట్ ఈ విధంగా చెబుతోంది: “#కరోనావైరస్ ను ఎదుర్కొనుటకు మీరు ఉపయోగించదగిన రెండు సులభమైన, చవకైన మరియు విరివిగా దొరికే వస్తువులు పసుపు మరియు నిమ్మకాయ. ఇంట్లో చేసిన రసం కూడా ఉపయోగకరమైనదే” పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ వారు ఆయుష్ మంత్రిత్వశాఖలో సీసీఆర్ఎస్ లో పనిచేసే ఫార్మాకోవిజిలెన్స్ అధికారి డా. విమల్ ఎన్ గారితో మాట్లాడారు. ఆయన పసుపు మరియు నిమ్మకాయ ఆరోగ్యానికి మంచివే కాని అవి కరోనావైరస్ ను ఎదుర్కొనటానికి సహాయపడతాయి అనేందుకు ఎలాంటి రుజువు లేదు అని అన్నారు.
“పసుపులో యాంటివైరల్ గుణాలు ఉన్నాయి మరియు నిమ్మకాయలో చాలా విటమిన్లు ఉన్నాయి. రెండు వ్యాధినిరోధకశక్తిని పెంచుటకు సహాయపడతాయి. కాని ఇవి కరోనావైరస్ ను ఎదుర్కొనుటకు సహాయపడతాయి అనేందుకు రుజువు లేదు.”
కరోనావైరస్ కు నివారణగా రసం గురించి అడిగినప్పుడు డా. విమల్ ఇలా అన్నారు, “రసంలో అన్ని మసాలాలు ఉన్నాయి, ఇవి దగ్గు మరియు శ్వాసకోశ సమస్యలను నివారించు సహాయపడతాయి. కాని ఇది కరోనావైరస్ కు చికిత్సగా సహాయపడుతుంది అనటానికి ఎలాంటి రుజువు లేదు.”
డబ్ల్యూహెచ్ఓ అధికారుల ప్రకారము, “నిమ్మకాయ లేదా పసుపు లేదా రసం కోవిడ్-19 ను నివారిస్తాయి అనటానికి రుజువులు లేవు. అయినప్పటికీ, సాధారణంగా, డబ్ల్యూహెచ్ఓ వారు ఆరోగ్యకరమైన భోజనములో భాగంగా తగినన్ని పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు”
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ప్రస్తుతము 2019-nCoV ఇన్ఫెక్షన్ ను నివారించుటకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు.
निष्कर्ष: ముగింపు: పసుపు మరియు నిమ్మకాయ కరోనావైరస్ ను ఎదుర్కొనుటకు సహాయపడతాయి అనుటకు ఎలాంటి రుజువు లేదు. ఈ వైరల్ పోస్ట్ అసత్యం.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.