X
X

Fact Check: మస్కట్ విమానాశ్రయములో మంటలు ఎగసిన ఎయిర్ ఇండియా విమానము యొక్క పాత వీడియో తప్పు క్లెయిమ్స్ తో ముందుకు వచ్చింది

ఢిల్లీ విమానాశ్రయములో ఎయిర్ ఇండియా విమానము యొక్క సహాయక శక్తి యూనిట్ లో అగ్నిప్రమాదం జరిగింది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఢిల్లీ విమానాశ్రయములో ఎయిర్ ఇండియా విమానము యొక్క సహాయక శక్తి యూనిట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదము విమానము ల్యాండింగ్ సమయములో జరిగింది. ప్రయాణీకులు అరియు సిబ్బంది అందరు సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి, సోషల్ మీడియాపై విమానము యొక్క ముందు భాగము నుండి పొగరావడాన్ని చూపుతున్న ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఫోటోలో దాని దగ్గర నిలబడిన కొంతమందిని కూడా చూడవచ్చు. ఈ ఫోటో ఇటీవల జరిగిన ప్రమదానికి సంబంధించినదని మరియు ఢిల్లీలో జరిగిన AI315 విమాన అగ్నిప్రమాదాన్ని చూపుతుందని యూజర్స్ క్లెయిమ్ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, ఈ వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. ఈ చిత్రము 2022లో మస్కట్ విమానాశ్రయములో కొచ్చి వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ విమానములో ఇంజన్ లో జరిగిన అగ్నిప్రమాదము జరిగినప్పుడు తీసినది. ఇదే పాత చిత్రము ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయములో తీసినది అని షేర్ చేయబడుతోంది.

ఏది వైరల్ అవుతోంది?

ఫేస్‎బుక్ యూజర్ ‘సాహిబ్ సంధు భదౌర్’ జులై 22, 2025 నాడు ఒక వైరల్ పోస్ట్ ను పోస్ట్ చేస్తూ, “ఎయిర్ ఇండియా విమానము AI 315 ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నప్పుడు అగ్నిప్రమాదానికి గురైయింది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.”

సోషల్ మీడియాపై చాలామంది యూజర్స్ ఈ ఫోటోను ఇటీవలి కాలానికి చెందినదని క్లెయిమ్ చేస్తూ షేర్ చేశారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ లింక్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు

వైరల్ చిత్రాన్ని దర్యాప్తు చేయటానికి మేము గూగ్ల్ లెన్స్ టూల్ ను ఉపయోగించాము మరియు వెబ్సైట్ freepressjournal.in, పై సెప్టెంబరు 15, 2022 నాడు ప్రచురించబడిన సంబంధిత రిపోర్ట్ ను కనుగొన్నాము. ఈ రిపోర్ట్ ఇలా తెలిపింది, “మస్కట్ నుండి కొచ్చి వెళ్ళే విమానము IX 442, 141 ప్రయాణీకులు మరియు ఆరుమంది సిబ్బంది సభ్యులతో టేక్ ఆఫ్ కు సిద్ధంగా ఉంది, అప్పుడు టాక్సివే పై ఉన్న మరొక పైలట్ పొగ గురించి తెలియజేశారు. బోయింగ్ 737 నుండి ఖాళీ చేయించే సమయములో సుమారు 14మంది ప్రయాణీకులకు ‘చిన్న చిన్న గాయాలు’ అయ్యాయి”

చిత్రానికి సంబంధించిన వార్త మాకు ఓటివి న్యూస్ ఇంగ్లీష్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై లభించింది. సెప్టెంబరు 14, 2022 నాడు అప్లోడ్ చేయబడిన వీడియో వెంట ఇవ్వబడిన వివరాల ప్రకారం, “ఒక ఎయిర్ ఇండియా విమానములో మస్కట్ విమానాశ్రయములో ఇంజన్ కు అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రయాణీకులు సురక్షితంగా బయటికి తీసుకొనిరాబడ్డారు.”

ఈ చిత్రము దైనిక్ జాగరణ్ ద్వారా సెప్టెంబరు 14, 2022 నాడు ప్రచురించబడిన ఒక వార్తా నివేదికలో ప్రస్తావించబడింది. నివేదిక ప్రకారము, “మస్కట్ విమానాశ్రయములో ఒక భారీ ప్రమాదము తప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ విమానము ఇంజన్ లో మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదము తరువాత విమానము రద్దు చేయబడింది. ఈ విమానము కొచ్చి నుండి వస్తోంది.”

సెర్చ్ సమయములో, వైరల్ చిత్రానికి సంబంధించిన అనేక వార్తలు మాకు లభించాయి.

మేము వైరల్ చిత్రాన్ని ఢిల్లీ విమానాశ్రయాన్ని కవర్ చేసే దైనిక్ జాగరణ్ లో సీనియర్ కరెస్పాండెంట్ అయిన మనీష్ మిశ్రాతో షేర్ చేశాము. ఈ చిత్రము ఇటీవల ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానానికి జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించినది కాదని ఆయన ధృవీకరించారు. ఇక్కడి ఫోటోలో చూపించిన విధంగా కాకుండా ఎయిర్‎క్రాఫ్ట్స్ ఎలెక్ట్రికల్ యూనిట్ (ఏపియూ) టెయిల్ వింగ్ వద్ద ఇటీవల మంటలు చెలరేగాయి.

మా దర్యాప్తును కొనసాగిస్తూ, మేము ఢిల్లీ విమానాశ్రయము లో జరిగిన ఇటీవలి ప్రమాదము కొరకు సెర్చ్ చేశాము మరియు జులై 22, 2025 నాడు ప్రచురించబడిన వార్తా నివేదికను కనుగొన్నాము. ఇందులో, “జులై 22, 2025 నాడు, హాంగ్ కాంగ్ నుండి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానము AI 315 యొక్క ఎయిర్‎క్రాఫ్ట్స్ ఎలెక్ట్రికల్ యూనిట్ (ఏపియూ) లో ల్యాండింగ్ తరువాత మంటలు చెలరేగాయి. ప్రయాణీకులు దిగుతుండగా ఈ ప్రమాదము జరిగింది. ఈ ప్రమాదములో విమానానికి చిన్న చిన్న నష్టాలు జరిగాయి, కాని ప్రయాణీకులు సిబ్బంది అందరు సురక్షితంగా ఉన్నారు.”

చివరిగా, మేము పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క ఫేస్‎బుక్ ప్రొఫైల్ ను స్కాన్ చేసి, ఆ యూజర్ కు 21000 ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.

ముగింపు: ఈ వైరల్ ఫోటో ఇటీవలి కాలానికి సంబంధించినది కాదని, ఇంతకుపూర్వం జరిగినదని తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొనింది. చిత్రములో మస్కట్ విమానాశ్రయములో కొచ్చి వెళ్ళవలసిన ఒక ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ విమానము యొక్క ఇంజన్ లో మంటలు చెలరేగాయని చూపుతుంది. అయితే, ఇది ఇటీవలి కాలములో ఢిల్లీ విమానాశ్రయములో జరిగిన ఎయిర్ ఇండియా విమానము అగ్నిప్రమాద సంఘటనగా తప్పుగా షేర్ చేయబడింది.

  • Claim Review : ఎయిర్ ఇండియా విమానము AI 315 ఢిల్లీలో ల్యాండ్ అయినప్పుడు మంటలు చెలరేగాయి, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ‘సాహిబ్ సంధు భదౌర్’
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later