X
X

Fact Check: లక్షల ధరకు 786 నంబరు నోట్లు కొనడము గురించి మోసపూరిత క్లెయిమ్స్, ఆర్‎బిఐ హెచ్చరిక జారీ చేసింది

నిర్దిష్టమైన క్రమ సంఖ్య కలిగిన నోట్లను పెద్ద మొత్తాలకు కొనవచ్చునని మరియు అమ్మవచ్చునని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాపై అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). నిర్దిష్టమైన క్రమ సంఖ్య కలిగిన నోట్లను పెద్ద మొత్తాలకు కొనవచ్చునని మరియు అమ్మవచ్చునని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాపై అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి క్లెయిమ్స్ లో ఒకటి క్రమ సంఖ్య 786 ఉన్న నోటుకు 12.8 లక్షలు అందుకోవచ్చునని సూచించింది. ఒక ఇన్స్టాగ్రాం హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడిన ఈ పోస్టులలో తరచూ ఒక సంప్రదింపు నంబరు కూడా ఉంటుంది.

ఈ విషయము గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఇది ఒక మోసము అని కనుగొనింది. మోసగాళ్ళు పెద్ద మొత్తము వాగ్ధానం చేసి ప్రజలను ఆకర్షిస్తారు మరియు ఆర్‎బిఐ అనుమతి లేఖ కొరకు ఫీజు రూపములో రూ 750 కోరుతున్నారు. అయితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‎బిఐ) ఇలాంటి ఫీజు ఏదీ తాము విధించమని లేదా పాత బ్యాంకు నోట్లు మరియు నాణాలకు సంబంధించిన లావాదేవీలకు కమిషన్ ఇవ్వమని స్పష్టం చేసింది. ఇటువంటి స్మామ్స్ పట్ల జాగురూకతతో ఉండాలని ఆర్‎బిఐ ఒక హెచ్చరికను జారీ చేసింది.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఇన్స్టాగ్రాం యూజర్ 786_ note_shop_786 జనవరి 20, 2025 నాడు “786 క్రమ సంఖ్య ధర రూ. 12 లక్షల 80 వేలు” అనే ఒక శీర్షికతో ఒక పోస్ట్ (ఆర్కైవ్ లింక్) షేర్ చేసింది. మొబైల్ నంబరు కూడా పేర్కొనబడింది. 

జనవరి 20, 2025 నాడు వేరొక పోస్ట్ లో అదే అకౌంట్ నుండి ఇలాంటి క్లెయిమ్  చేయబడింది, కాని వేరొక మొబైల్ నంబరు పేర్కొనబడింది.

దర్యాప్తు

వైరల్ క్లెయిమ్ యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము ముందుగా పోస్ట్ ను పరీక్షించాము మరియు దీనిని కొంతమంది యూజర్లు నకిలీది అని పేర్కొన్నట్లు కనుగొన్నాము.

పోస్ట్ లో పేర్కొనబడిన నంబరుకు మేము కాల్ చేశాము. ముందుగా, 786 క్రమ సంఖ్య ఉన్న నోట్ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా షేర్ చేయాలని మమ్మల్ని కోరారు. ఫోటో పంపిన తరువాత, అవతలి వైపు ఉన్న వ్యక్తి మా పేరు, పూర్తి చిరునామా, పాస్పోర్ట్-సైజ్ ఫోటో మరియు ప్రభుత్వ అనుమతి రుసుముగా రూ. 750 పంపించాలని కోరారు. దీని తరువాత, నోటును తీసుకొని దాని ధరను చెల్లించుటకు 24-48 గంటల లోపు ఒక బృందము మా ఇంటికి వస్తుందని వాళ్ళు చెప్పారు.

మరింత సమాచారము కొరకు, మేము ఇవ్వబడిన నంబరుకు మళ్ళీ కాల్ చేసి ప్రభుత్వ అనుమతి గురించి సమాచారం అడిగాము. అవతలివైపు వ్యక్తి తనను తాను జితేష్ గా పరిచయం చేసుకున్నాడు. అతను ఇలా అన్నాడు, “ఇటువంటి నోట్లు అంగీకరించుటకు, ఆర్‎బిఐ నుండి అనుమతి తీసుకోవాలి. వాళ్ళు ఒక లేఖ ఇస్తారు, దీని కోసం రూ. 750 ఫీజు చెల్లించాలి. ఇది లేకుండా, వారి బృందము నోట్లను అంగీకరించలేదు. దీని కొరకు డబ్బు కూడా ప్రభుత్వము ఇస్తుంది. అతను ఒక ఏజెంట్ మాత్రమే. కంపెనీ ఆమోద లేఖ ఇస్తుంది. దీని అనుమతి ఆర్‎బిఐ రికార్డ్స్ లో నమోదు అవుతుంది. ఆ తరువాత నోట్లతో వ్యవహరించుటకు అనుమతి లేఖను కంపెనీ మీకు ఇస్తుంది”.

“క్రమ సంఖ్య 786 ఉన్న నోటును తీసుకున్న తరువాత, వాళ్ళు డబ్బును యూజర్ కోరిన విధంగా, నగదు లేదా ఆన్లైన్ లేదా చెక్ ద్వారా చెల్లిస్తారు. కంపెనీ పేరు ఓల్డ్ కాయిన్ ముంబై, ఇది కండివలిలో ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు.

మేము గూగుల్ పై ఓల్డ్ కాయిన్ కంపెనీ ముంబై కొరకు సెర్చ్ చేశాము మరియు దానిని చాలామంది మోసపూరితమైనదిగా సమీక్షించారు  అని కనుగొన్నాము.

ఆగస్ట్ 4, 2021 నాడు ఆర్‎బిఐ ద్వారా జారీ చేయబడిన పత్రికా ప్రకటన ప్రకారము, “కొంతమంది మోసం చేయటానికి ఆర్‎బిఐ పేరు వాడుకుంటున్నారు. వివిధ ఆన్లైన్/ఆఫ్‎లైన్ ప్లాట్ఫార్మ్స్ పై, మోసగాళ్ళు పాత బ్యాంకు నోట్లు లేదా నాణాల కొనుగోలు మరియు అమ్మకము కొరకు ఆర్‎బిఐ పేరు మీద ఫీజు కోరుతున్నారు. ఆర్‎బిఐ ఇలాంటి వ్యవహారం ఏదీ నిర్వహించదు లేదా ఇటువంటి ఫీజు కోరదు. ఇటువంటి లావాదేవీలలో ఫీజు వసూలు హేయుటకు సంస్థ తరఫున ఎవరికి అధికారం ఇవ్వలేదు.”

ఇదివరకు, ఒక క్లెయిమ్ వైరల్ అయింది. ఇందులో కేంద్ర ప్రభుత్వము పాత నోట్లు మరియు నాణాలు కొనుగోలు చేయుటకు ప్రణాళికలు ప్రకటించిందని ఆరోపించబడింది. తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్  ఈ క్లెయిమ్ నకిలీది అని కనుగొనింది. ఆ సమయములో, విశ్వాస్ న్యూస్ ఆర్‎బిఐ విలేఖరితో మాట్లాడింది. ఆయన పాత నోట్లు లేదా నాణాల కొనుగోలు లేదా అమ్మకం కొరకు ఆర్‎బిఐ ఏ వ్యక్తికి లేదా సంస్థకు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇటువంటి స్కామ్స్ గురించి ప్రజలను ఇదివరకే హెచ్చరించింది.

786 నంబరు ఉన్న నోటు కొనుగోలు గురించి పోస్ట్ షేర్ చేసిన యూజర్ ఇలాంటి అనేక పోస్టులను షేర్ చేశారు.

ముగింపు: క్రమ సంఖ్య 786 ఉన్న నోట్లను అమ్మే పేరుతో మోసగాళ్ళు, ఆర్‎బిఐ అనుమతి లేఖ కొరకు ఫీజు డిమాండ్ చేస్తూ స్కామ్స్ చెస్తున్నారు. అయితే, ఆర్‎బిఐ ఇదివరకే ఇటువంటి మోసాల గురించి హెచ్చరికలు జారీ చేసి, ఇటువంటి లావాదేవీల కొరకు తాను ఏ వ్యక్తికి లేదా సంస్థకు అధికారం ఇవ్వలేదని మరియు దాని కొరకు ఎలాంటి ఫీజు వసూలు చేయదని స్పష్టం చేసింది.

  • Claim Review : క్రమ సంఖ్య 786 ఉన్న నోటు మార్పిడిపై మీరు 12 లక్షల 80 వేల రూపాయలు పొందవచ్చు.
  • Claimed By : ఇన్స్టాగ్రాం యూజర్ 786_note_shop_786
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later