X
X

Fact Check: అజిక్ పవార్ విమాన ప్రమాద వైరల్ వీడియో తప్పుదోవపట్టించేది; సంఘటన వెనెజుయెలాలో జరిగిందిగా గుర్తించబడింది

ఒక విమాన దుర్ఘటన తాలూకు భయంగొలిపే వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది, ఇందులో ఒక చిన్న విమానము రన్‎వే మీది నుండి పైకిలేచే ప్రయత్నములో కూలిపోవడం చూడవచ్చు.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఒక విమాన దుర్ఘటన తాలూకు భయంగొలిపే వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది, ఇందులో ఒక చిన్న విమానము రన్‎వే మీది నుండి పైకిలేచే ప్రయత్నములో కూలిపోవడం చూడవచ్చు. యూజర్లు ఈ వీడియో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించినదిగా క్లెయిమ్ చేస్తూ దీనిని షేర్ చేస్తున్నారు. విశ్వాస్ న్యూస్, తన దర్యప్తులో, ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. వైరల్ వీడియో ఇండియాకు చెందినది కాదు, ఇది వెనెజుయెలాలో అక్టోబరు 2025 లో జరిగిన సంఘటనకు సంబంధించినది. ఇటీవల బారామతిలో ల్యాండ్ అయ్యే సమయములో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మరో అయిదుమందితో కలిసి ప్రయాణిస్తున్న విమానము నేల కూలడముతో ఆయన మరణించారు అనేది వాస్తవమే అయినా, ఈ వీడియో ఆ దుర్ఘటనకు సంబంధించినది కాదు.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

ఫేస్‎బుక్ యూజర్ ‘సర్కారి జీజాజి’ (ఆర్కైవ్) ఈ వైరల్ వీడియోను జనవరి 28, 2026 నాడు దీనిని అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించినదిగా పేర్కొంటూ షేర్ చేశారు. అయితే ఈ యూజర్ వీడియో యొక్క ప్రామాణికతను ధృవీకరించలేము అని తెలుపుతూ ఒక డిస్‎క్లెయిమర్ చేర్చారు. శీర్షిక ఇలా ఉంది: “ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రామాణికమైనదా కాదా అనేది మేము ధృవీకరించలేము.” 

దర్యాప్తు

దర్యాప్తు ప్రారంభించటానికి మేము, సంబంధిత కీవర్డ్స్ మరియు కీఫ్రేమ్స్ ఉపయోగించి గూగుల్ లెన్స్ సెర్చ్ నిర్వహించాము. ఈ సెర్చ్ లో మాకు  ‘ది మిర్రర్‘, ‘ఇండియా టుడే‘, మరియు ‘మనీకంట్రోల్‘ నుండి, ఇదే వైరల్ ఫుటేజ్ ఉన్న, అక్టోబర్ 2025 నాటి వీడియో ఒకటి లభించింది. ఈ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సంఘటన ‘పారమిల్లో విమానాశ్రయము’, టచీరా, వెనెజుయెలా లో జరిగింది. అక్టోబరు 23, 2025 నాడు ఒక ప్రైవేట్ పైపర్ చెయెన్నే విమానం టేక్‎ఆఫ్ సమయములో కూలిపోయింది, అందులో ఇద్దరు క్రూ సిబ్బంది సభ్యులు మరణించారు.

అజిత్ పవార్ విమానానికి ఏం జరిగింది?

బుధవారం, జనవరి 28, 2026 ఉదయం, సుమారు 8:45 గంటల సమయములో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదములో మరణించారు. ఆయన ముంబై నుండి బారామతికి వెళ్తుండగా, ఆయన ఎక్కిన విమానము (లీర్‎జెట్ 45, రిజిస్ట్రేషన్ VT-SSK) బారామతి విమానాశ్రయములో ల్యాండ్ అయ్యే సమయములో కూలిపోయింది. DGCA  మరియు పోలీసు రిపోర్ట్స్ ప్రకారం, ఈ ప్రమాదములో అజిత్ పవార్, ఆయన పిఎస్‎ఓ విదీప్ జాదవ్, అటెండర్ పింకి మాలి, మరియు ఇద్దరు పైలెట్లతో కలిపి మొత్తం అయిదుమంది చనిపోయారు.

వైరల్ వీడియో మరియు బారామతి ప్రమాదాల మధ్య గణనీయమైన జనాభా వ్యత్యాసాలు ఉన్నాయి. వైరల్ వీడియోలో, ఎత్తైన మరియు దట్టమైన పర్వతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, కాని బారామతి విమానాశ్రయము పరిసర ప్రాంతాలలో పర్వతాలు లేవు.

వైరల్ వీడియోలో టేక్‎ఆఫ్ సమయములో విమానం కూలిపోవడం చూడవచ్చు, అయితే పవార్ ఎక్కిన విమానము దట్టమైన మంచులో ల్యాండింగ్ సమయములో కూలిపోయింది.

దీనికి సంబంధించి మేము మిడ్-డే, ముంబై కొరకు సీనియర్ కరెస్పాండెంట్ అయిన సమివుల్లా ఖాన్ ను సంప్రదించాము. ఆయన ఈ విధంగా ధృవీకరించారు, “అజిత్ పవార్ విమాన దుర్ఘటన అని క్లెయిమ్ చేయబడూతూ, సోషల్ మీడియా పై ప్రచారం చేయబడుతున్న వీడియో పూర్తిగా తప్పుదోవపట్టించేది. ఆ ఫుటేజ్ బారామతి నుండి కాదు. బారామతిలో జరిగిన ప్రమాదము ల్యాండింగ్ సమయములో జరిగింది, కాని వైరల్ వీడియో టేక్‎ఆఫ్ సమయములో జరిగిన విమాన ప్రమాదాన్ని చూపిస్తుంది.”

వైరల్ పోస్ట్ షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ “సర్కారి జీజాజి” కు 4000 పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన అని ఆపాదించబడుతున్న వైరల్ వీడియో నిజానికి వెనెజుయెలాలో జరిగింది. బారామతిలో జనవరి 28, 2026 నాడు ఒక విమాన ప్రమాదములో పవార్ మరణించారు అనేది ఒక విషాద వాస్తవం అయినప్పటికీ, సోషల్ మీడియా పై చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో టచీర, వెనెజుయెలాలో అక్టోబరు 2025లో జరిగిన సంఘటనకు సంబంధించినది.

  • Claim Review : అజిత్ పవార్ విమాన ప్రమాదము యొక్క వీడియో
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ‘సర్కారి జీజాజి’
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later