Fact Check: వైరల్ అయిన తమ కూతురు దువా తో రణ్‌వీర్‌సింగ్ మరియు దీపిక పదుకోనె ఫోటోలు AI-ఉత్పన్నం చేయబడినవి
తన దర్యాప్తులో, విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. సోషల్ మీడియా పై వైరల్ అయిన రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకోనెతో ఉన్న దువా ఫోటో నిజం కాదు; అది ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) టూల్ సహాయముతో సృష్టించబడింది. ఇది నిజమని భావించి కొంతమంది దీనిని షేర్ చేస్తున్నారు.
- By: Jyoti Kumari
- Published: Dec 26, 2024 at 05:58 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకోనె చిత్రాలు రెండు సోషల్ మీడియాపై వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో వారు ఒక బిడ్డతో ఉండడం చూడవచ్చు. కొంతమంది ఫోటోలో దీపిక పదుకోనె మరియు రణ్వీర్ సింగ్ తో ఉన్న ఆడపిల్ల వారి కూతురు దువా అని క్లెయిమ్ చేస్తూ ఈ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు
తన దర్యాప్తులో, విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. సోషల్ మీడియా పై వైరల్ అయిన రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకోనెతో ఉన్న దువా ఫోటో నిజం కాదు; అది ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) టూల్ సహాయముతో సృష్టించబడింది. ఇది నిజమని భావించి కొంతమంది దీనిని షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ పేజ్ ‘రణబీర్ కపూర్ ఫ్యాన్ క్లబ్’ వైరల్ చిత్రాలను షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “దువాతో దీపికా పదుకోనె & రణ్వీర్ సింగ్ మొదటి చిత్రము”.
వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు

దర్యాప్తు
వైరల్ చిత్రాల ప్రామాణికత గురించి దర్యాప్తు చేయుటకు మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ నిర్వహించాము మరియు వాటిని దీపికఇన్ఫినిటి’. అనే ఇన్స్టాగ్రాం హ్యాండిల్ పై కనుగొన్నాము. డిసెంబర్ 12, 2024 నాటి ఒక పోస్ట్ లో ఈ చిత్రము AI-ఉత్పన్నం చేయబడినది అని తెలుపబడింది.

మాకు ఈ వైరల్ ఫోటోలు డైరెక్ట్బాలీవుడ్ఇన్ఫో’ అనే ఇన్స్టాగ్రాం హ్యాండిల్ పై కూడా లభించాయి. డిసెంబరు 13, 2024 తేదీ పోస్ట్ లో చిత్రము ఎడిట్ చేయబడింది అని వివరించబడింది.
దర్యాప్తును ముందుకు తీసుకెళ్తూ, మేము AI డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి ఫోటోను విశ్లేషించాము. హైవ్ మాడరేషన్ సహాయముతో, ఈ ఫోటో 95.5% AI-ఉత్పన్నం చేయబడిందని గుర్తించబడింది.

రెండవ ఫోటోను మేము decopy.ai టూల్ ఉపయోగించి సెర్చ్ చేశాము, ఇది ఫోటో AI-ఉత్పన్నం చేయబడిందని 91.59% సంభావ్యతను సూచించింది.

పోస్ట్ ను మేము AI లో నిపుణుడు అయిన పరిశోధకుడు అజర్ మాక్వే తో షేర్ చేశాము, ఆయన ఈ చిత్రాలు AI-ఉత్పన్నం చేయబడినవి అని ధృవీకరించారు.
చివరిగా, మేము పోస్ట్ ను షేర్ చేసిన పేజ్ ను స్కాన్ చేశాము మరియు దీనికి 1.09 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారని కనుగొన్నాము.
ముగింపు: రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకోనెలు తమ కూతురు దువాతో ఉన్నట్లు క్లెయిమ్ చేస్తున్న ఒక పోస్ట్ వైరల్ అయింది. అయితే మా దర్యాప్తులో ఆ చిత్రాలు AI టూల్స్ ఉపయోగించి సృష్టించబడ్డాయని వెల్లడి అయింది.
- Claim Review : దువాతో దీపిక పదుకోనె మరియు రణ్వీర్ సింగ్ యొక్క మొదటి చిత్రము.
- Claimed By : ఫేస్బుక్ పేజ్ ‘రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్ క్లబ్’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











