Fact Check: కరీనా కపూర్ మరియు కృతి సనన్ తో దిల్జీత్ దోసాంజి మాట్లాడిన వీడియో కాల్ కు సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతోంది
దిల్జీత్ దోసాంజి చిత్రము ‘సర్దార్ జి3’ పై వివాదం కొనసాగుతున్న వేళ, ఒక వీడియో వైరల్ అవుతోంది.
- By: Jyoti Kumari
- Published: Jul 9, 2025 at 05:52 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). దిల్జీత్ దోసాంజి చిత్రము ‘సర్దార్ జి3’ పై వివాదం కొనసాగుతున్న వేళ, ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన కరీనా కపూర్, కృతి సనన్ మరియు రియా కపూర్ లతో వీడియో కాల్ మాట్లాడుతూ కనిపిస్తారు. ఇది ఇటీవలి క్లిప్ అని క్లెయిమ్ చేస్తూ యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. దోసాంజికి సంబంధించిన ఈ వీడియో 2024లో ఆయన ‘క్యూ’ చిత్రము విడుదలకు ముందు అందులో నటించిన నటీనటులతో ఇన్స్టాగ్రాం పై లైవ్‌లోకి వచ్చినప్పటిది. ఈ పాత వీడియోను ఇటీవల వీడియో అని క్లెయిమ్ చేస్తూ యూజర్లు దీనిని షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ పేజ్ ‘ఆల్ ఇండియా న్యూస్ లైవ్’ జులై 3, 2025 నాడు ‘దోసాంజి ఆల ని తల్లా! #పంజాబ్ #ఢిల్లీ #అప్డేట్” అని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.
ఈ వీడియో వెంట ఉన్న శీర్షిక: “స్పియర్ ఆఫ్ రెభాన్ కదలదు! ఇప్పుడు కరీనా కపూర్ వీడియో కాల్ కు రియా కపూర్ మరియు కృతి సనన్ ను చేర్చింది’
వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
వైరల్ వీడియో గురించి దర్యాప్తు చేయటానికి మేము ఒక కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము. దీని వలన మాకు punjabi.abplive.com అనే వెబ్సైట్ పై వీడియోకు సంబంధించి మార్చ్ 28, 2024 నాడు ప్రచురించబడిన రిపోర్ట్ ఒకటి లభించింది. ఈ రిపోర్ట్ లో, “దిల్జీత్ దోసాంజి చిత్రం ‘క్రూ’ విడుదలకు ముందు, బాలీవుడ్ నటిమణులు కరీనా కపూర్, కృతి సనన్ మరియు చిత్ర దర్శకురాలు రియా కపూర్ కలిసి ఇన్స్టాగ్రాం పై లైవ్‌లోకి వచ్చి సరదాగా గడిపారు.
మాకు ‘సవేరా స్టార్ టాక్స్’ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై మార్చ్ 28, 2024 నాడు అప్లోడ్ చేయబడిన ఇదే వీడియో లభించింది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారము ప్రకారం, ఈ వీడియో ‘క్రూ’ చిత్రము నుండి తీసుకోబడింది.
ఈ వీడియోను దోసాంజి తన ఇన్స్టాగ్రాం హ్యాండిల్ పై మార్చ్ 27, 2024 నాడు షేర్ చేశారు.
ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని పోస్ట్స్ ను ఇక్కడ చూడండి.
పాకిస్తాని నటి హనియా ఆమీర్ కూడా ఈ చిత్రములో అతనితో కలిసి నటించిన కారణంగా దోసాంజి తన చిత్రము ‘సర్దార్ జి 3 కొరకు విమర్శలు ఎదుర్కొంటున్నారు’
ఈ వీడియోను మేము ముంబైలో దైనిక్ జాగరణ్ విలేఖరి స్మిత శ్రీవాత్సవకు షేర్ చేశాము. ఆమె ఈ క్లిప్ పాతదని మరియు ‘క్రూ’ షూటింగ్ సమయములో తీసినదని ధృవీకరించారు. ఆ సమయములో, నటీనటులు అందరు దోసాంజితో ఇన్స్టాగ్రాంలో లైవ్ గా మాట్లాడారు.
చివరిగా, ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేశాము మరియు ఈ యూజర్ పై ఒక నిర్దిష్ట భావజాల ప్రభావితం ఉందని కనుగొన్నాము.
ముగింపు: దోసాంజి చిత్రము ‘క్రూ’ విడుదలకు ముందు ఇన్స్టాగ్రాం పై లైవ్ లో దోసాంజితో కనెక్ట్ అయినప్పుడు, కరీనా కపూర్, కృతి సనన్ మరియు రియా కపూర్ లతో దిల్జీత్ దోసాంజి మాట్లాడుతున్న ఈ వీడియో 2024 నాటిదని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తేలింది. ఈ వీడియోకు ప్రస్తుత పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదు.
- Claim Review : కరీనా కపూర్ మరియు కృతి సనన్ లతో దిల్జీత్ దోసాంజి యొక్క ఇటీవలి వీడియో.
- Claimed By : Facebook page ‘All India News Live’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











