వాస్తవ తనిఖీ: కేవలం మాస్క్‌లతో మాత్రమే COVID-19ను నివారించలేం, కీలక సందర్భం లోపించిన వైరల్ పోస్ట్
కేవలం మాస్క్‌లతో మాత్రమే COVID-19ను నివారించలేం. సరైన పద్ధతిలో తరచూ చేతులు కడుక్కోవడం, మరియు సామాజిక దూరం కూడా పాటించాలి.
- By Vishvas News
- Updated: December 17, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : మాస్క్‌లు పనిచేస్తే ప్రజలు ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లకు ఎందుకు దూరంగా ఉండాలి?, మాస్క్‌లు పని చేయకపోతే, వాటిని మా పిల్లల నుంచి ఎందుకు తీసివేయకూడదు.’ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఈ వైరల్ దావాలో కీలక సందర్భం లోపించిందని తేల్చింది. కరోనావైరస్ నివారించడానికి మాస్క్‌లతో పాటు.. సామాజిక దూరం మరియు సరైన చేతి పరిశుభ్రతను కూడా సిఫార్సు చేస్తారు.
దావా :
ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక దావా ఇలా ఉంది : ‘మాస్క్‌లు పనిచేస్తే, తిరిగి వారి ప్రియమైనవారితో ఉండటానికి కుటుంబసభ్యులను ఆసుపత్రులు మరియు నర్సింగ్హోమ్లలోకి అనుమతించండి. అవి పని చేయకపోతే, వాటిని మా పిల్లలనుండి తీసివేయండి. ఎవరో అబద్ధం చెబుతున్నారు.’
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ పరిశీలించవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం, ‘COVID-19 యొక్క వ్యాప్తిని తగ్గించడానికి ఇతర రోజువారీ నివారణ చర్యలతో కలిపి సామాజిక దూరాన్ని పాటించాలి, మాస్క్‌లు ధరించాలి. కడగని చేతులతో మీ ముఖాన్ని తాకకుండా ఉండాలి, మరియు తరచుగా మీ చేతులను సబ్బు మరియు నీటితో కనీసం 20 సెకన్ల పాటు కడగాలి.’
మాస్క్ సామాజిక దూరానికి ప్రత్యామ్నాయం కాదు. ఇతరులకు కనీసం 6 అడుగుల దూరంలో ఉండటంతో పాటు.. అదనంగా మాస్క్‌లు ధరించాలి, అని సిడిసి సూచిస్తుంది.
మాస్క్ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుండగా, చేతులను సరైన విధంగా తరచూ కడుక్కోవడం, మరియు సామాజిక దూరం పాటించడం కూడా అవసరం.
పల్మోనాలజిస్ట్, COVID-19 సోకిన రోగులకు కూడా చికిత్స అందిస్తున్న డాక్టర్ నిఖిల్ మోడీతో విశ్వాస్ న్యూస్ మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ‘మీరు ఇతర నివారణలను కూడా పాటించకపోతే మాస్క్‌లు మాత్రమే మిమ్మల్ని నిరోధించలేవు. వైరస్‌ను నివారించడానికి మనం సామాజిక దూరం మరియు సరైన హ్యాండ్‌వాషింగ్ చేయాలి.’
ఈ పోస్ట్‌ను Penny Wiens-Normandeau అనే యూజర్ ఫేస్బుక్లో షేర్ చేశారు. మేము యూజర్ యొక్క ప్రొఫైల్‌ను స్కాన్ చేసి, ఈ యూజర్ ప్రిన్స్టన్కు చెందిన వాడని కనుగొన్నాము.
DISCLAIMER: విశ్వాస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం.
निष्कर्ष: కేవలం మాస్క్‌లతో మాత్రమే COVID-19ను నివారించలేం. సరైన పద్ధతిలో తరచూ చేతులు కడుక్కోవడం, మరియు సామాజిక దూరం కూడా పాటించాలి.
- Claim Review : 'మాస్క్‌లు పనిచేస్తే, తిరిగి వారి ప్రియమైనవారితో ఉండటానికి కుటుంబసభ్యులను ఆసుపత్రులు మరియు నర్సింగ్హోమ్లలోకి అనుమతించండి. అవి పని చేయకపోతే, వాటిని మా పిల్లలనుండి తీసివేయండి. ఎవరో అబద్ధం చెబుతున్నారు.'
- Claimed By : FB user: https://www.facebook.com/penny.wiens.9
- Fact Check : Misleading

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com