X

నిజ నిర్దారణ : యుపి ఎన్నికల పేరిట వచ్చిన ఈ స్క్రీన్ షాట్ నకిలీది

  • By Vishvas News
  • Updated: October 25, 2021

న్యూఢిల్లీ (విశ్వస్ న్యూస్): సోషల్ మీడియాలో నకిలీ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో, ఒక ఛానల్ లో పాత అభిప్రాయ సేకరణ సవరించి UP 2022 ఎన్నికల అభిప్రాయ సేకరణగా వైరల్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఆ వైరల్ పోస్ట్ నకిలీదని తెలుసుకుంది. దీనిని ABP సీనియర్ ఎడిటర్ కూడా ధృవీకరించారు.

క్లెయిమ్


ఫేస్‌బుక్ యూజర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ ఒక అభిప్రాయ సేకరణ చిత్రాన్ని షేర్ చేశారు: ఈసారి అఖిలేష్ భయ్యా ప్రభుత్వం.


ఫోటో లోపల టెక్స్ట్ ఇలా ఉంది: ABP న్యూస్ సర్వే ప్రకారం, 2022 UP ఎన్నికల్లో SP 228 సీట్లు గెలుచుకుంటుంది. అఖిలేష్ 300+ అభిప్రాయ సేకరణ అని ఇంకా వ్రాయబడింది.

ABP న్యూస్ సర్వే ప్రకారం, 2022 UP ఎన్నికల్లో SP 228 సీట్లను గెలుచుకుంటుందని చిత్రంలో ఉన్నది. కానీ ఇంకా దానిలో అఖిలేష్ 300+ అభిప్రాయ సేకరణ అని వ్రాయబడింది.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ సంబంధిత కీవర్డ్‌లతో యూట్యూబ్‌లో వెతికి యుపి 2012 ఎన్నికల ఫలితాలు అని పేర్కొంటూ ABP న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వైరల్ స్క్రీన్ షాట్ లాంటి కంటెంట్ తెలుసుకుంది. 2012 ఎన్నికల్లో ఎస్పీకి 228 సీట్లు వచ్చినట్లు సమాచారం. ఇదే కాకుండా, ఇతర పార్టీలు గెలిచిన సీట్లను గురించి కూడా చూపించింది. మీరు ఈ పూర్తి వీడియోను క్రింద చూడవచ్చు.

విశ్వస్ న్యూస్ ABP యొక్క సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేసింది. మేము ABP న్యూస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో అక్టోబర్ 8, 2021 నాటి ట్వీట్‌ను చూశాము. సర్వే ప్రకారం, యుపిలో బిజెపి ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతోంది, ఎస్‌పికి కూడా ప్రయోజనం అని అందులో వ్రాసి ఉంది.

వైరల్ పోస్ట్‌కు సంబంధించి విశ్వాస్ న్యూస్ ABP న్యూస్ ఎడిటోరియల్ విభాగం సీనియర్ ఎడిటర్‌తో మాట్లాడారు. వైరల్ పోస్ట్ పూర్తిగా నకిలీది అని ఆయన అన్నారు.

వైరల్ పోస్ట్‌ను షేర్ చేసిన ఫేస్‌బుక్ యూజర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ ప్రొఫైల్‌ని మేము స్కాన్ చేశాము. అతని అకౌంట్ ఫిబ్రవరి 2018 లో తెరవబడింది.

  • Claim Review : ABP యొక్క ఇటీవలి సర్వే
  • Claimed By : ఫేస్‌బుక్ యూజర్ రాఘవేంద్ర రాజ్‌పుత్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later