
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ ఉపాధ్యాయ అని సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ వీడియో పేర్కొంది. వీడియోలో, ఆ వ్యక్తి రైతు బిల్లుకు మద్దతు ఇవ్వడం వినవచ్చు.
విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను దర్యాప్తు చేసినప్పుడు, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన సుధీర్ పాండే అని తేలింది. విశ్వాస్ న్యూస్ ఇంతకుముందే ఎమ్మెల్యే అనిల్ ఉపాధ్యాయ పేరిట వైరల్ అయిన ఇలాంటి పోస్టులను దర్యాప్తు చేసింది.
దావా :
ఫేస్బుక్ యూజర్ Kirit Patel 2020 డిసెంబర్ 6వ తేదీన ఒక వీడియోను అప్లోడ్ చేశారు : ‘ఈ వీడియోలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ ఉపాధ్యాయ చెప్పినది నిజం, వీడియోను పూర్తిగా చూడండి, మరియు దేశానికి తెలిసే విధంగా షేర్ చేయండి.’ అని రైటప్ ఇచ్చారు.
ఈ ఫేస్బుక్ పోస్ట్ అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
వీడియోను జాగ్రత్తగా గమనించినప్పుడు, ఖబర్ ఇండియా లోగో మరియు ఖబర్ ఇండియా న్యూస్ యొక్క వాటర్ మార్క్ చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ ఇన్విడ్ టూల్ ద్వారా పొందిన స్క్రీన్గ్రాబ్లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్లో సెర్చ్ చేసింది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసిన సమయంలో మేము ఖబర్ ఇండియా అనే కీవర్డ్‌ని కూడా ఉపయోగించాము. ఈ శోధన సమయంలో, ఖబర్ ఇండియా అనే యూట్యూబ్ ఛానెల్లో అసలు వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన మరింత వివరమైన వెర్షన్. ఈ వీడియోను నవంబర్ 28, 2020 న అప్లోడ్ చేశారు.
మేము ‘ఖబర్ ఇండియ’’ కార్యాలయాన్ని సంప్రదించాము. వైరల్ వీడియోలో కనిపించే వ్యక్తి ఎమ్మెల్యే కాదని, వృత్తిపరంగా కాంట్రాక్టర్ అయిన సుధీర్ పాండే అని వారు చెప్పారు. దర్యాప్తులో భాగంగా మేము సుధీర్ పాండేని కూడా సంప్రదించాము, ‘ఆ వీడియోలో కనిపిస్తున్నది నేనే. నా పేరు సుధీర్ కుమార్ పాండే. నేను ఢిల్లీలో నివసిస్తున్నాను, ప్రస్తుతం నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. అయితే, నేను బిజెపికి మద్దతుదారుడిని.’ అని సుధీర్ పాండే చెప్పారు.
దర్యాప్తులో భాగంగా, కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న అనిల్ ఉపాధ్యాయ అనే నాయకుడిని మేము కనుగొనలేదు. Myneta.info వెబ్సైట్లో, అనిల్ ఉపాధ్యాయ అనే పలువురు నాయకుల ప్రస్తావన మాకు దొరికింది, కాని వారిలో ఎవరూ కాంగ్రెస్‌తో సంబంధం కలిగి లేరు.
నకిలీ దావాలతో వీడియోను వైరల్ చేసిన ఫేస్బుక్ యూజర్ కిరిత్ పటేల్ అకౌంట్‌ను మేము సోషల్ స్కానింగ్ చేసాము. ముంబైకి చెందిన ఆ యూజర్‌కు ఫేస్బుక్లో 1,033 మంది స్నేహితులు ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్టుపై దర్యాప్తు చేసినప్పుడు, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, వృత్తిరీత్యా కాంట్రాక్టర్ సుధీర్ పాండే అని తేలింది. ఎమ్మెల్యే అనిల్ ఉపాధ్యాయ పేరుతో వైరల్ అయిన ఇలాంటి అనేక పోస్టులను విశ్వాస్ న్యూస్ గతంలో పరిశోధించింది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.