
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): విశ్వాస్ న్యూస్ వాట్సాప్ చాట్బాట్లో ఒక వీడియో షేర్ చేయబడింది : ‘మెంతి గింజలను టేప్ స్ట్రిప్‌లో బొటనవేలుపై అతికించి రాత్రిపూట వదిలేస్తే, కరోనావైరస్ సమయంలో గొంతు ఇన్ఫెక్షన్ నయమవుతుంది.’
విశ్వాస్ న్యూస్ ఇంతకుముందు ఈ దావాపై దర్యాప్తు చేసి, అది నకిలీదని తేల్చింది.
దావా :
విశ్వాస్ న్యూస్ వాట్సాప్ చాట్బాట్లో షేర్ చేసిన యూట్యూబ్ లింక్‌లో ఉన్న వీడియో, మెంతి విత్తనాలను టేప్ స్ట్రిప్‌లో బొటనవేలుపై అతికించి రాత్రిపూట వదిలివేస్తే, ఇది కరోనావైరస్ సమయంలో గొంతు ఇన్ఫెక్షన్ను నయం చేయగలదని పేర్కొంది.
యూట్యూబ్ లింక్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
మెంతులు భారతీయ వంటకాల్లో నిత్యం వాడే ఒక సాధారణ దినుసు మరియు ఔషధ గుణాలున్నది. దీనిని తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు, అయితే, ఇది కరోనా వైరస్‌కు సంబంధించిన గొంతు ఇన్ఫెక్షన్ను పూర్తిగా నయం చేయగలదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
ఆయుష్ మంత్రిత్వ శాఖలోని ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ విమల్.ఎన్ తో విశ్వాస్ న్యూస్ ప్రతినిధి మాట్లాడటం జరిగింది. ఈ వీడియోలోని వాదన నకిలీదని ఆయన చెప్పారు. ‘ఈ మెంతి గింజల టేప్ కరోనా వైరస్‌కు నివారణ కాదు. మెంతి గింజలతో చేసిన టీ తాత్కాలికంగా గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది, అయితే, ఇది కరోనావైరస్ను నయం చేస్తుందని చెప్పలేము,’ అని ఆయన అన్నారు.
వైరల్ వీడియోకు సంబంధించి డాక్టర్ లోహియా ఆక్యుపంక్చర్ సెంటర్లోని ఆక్యుపంక్చర్ నిపుణుడితో కూడా మేము మాట్లాడాము. ‘ఇది అబద్ధం. చేతులపై గొంతుకు సంబంధించిన పాయింట్లు ఉన్నాయి, మరియు గొంతు ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కోసం మేము ఆ పాయింట్లపై ఒత్తిడి తెస్తాము. మేము ఆ పాయింట్లపై క్లాసిక్ ఆక్యుపంక్చర్ చేస్తాము. కానీ, మెంతి గింజల టేప్‌ను బొటనవేలుపై అతికించడం వల్ల గొంతు నొప్పి నయమవుతుందన్నది మాత్రం నకిలీ వాదన. ఇది పూర్తిగా అబద్ధం.’ అని ఆయన చెప్పారు.
దీనికి సంబంధించిన పూర్తి వాస్తవం తనిఖీ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
DISCLAIMER: విశ్వాస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం.
निष्कर्ष: COVID-19 సమయంలో మెంతి విత్తన టేప్ గొంతు ఇన్ఫెక్షన్ను తగ్గింస్తుందని పేర్కొన్న పోస్ట్ తిరిగి సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వైరల్ వాదనను ఆరోగ్య నిపుణులు ఖండించారు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.