X

వాస్తవ తనిఖీ: A $100 బిల్ పై మహాత్మ బసవేశ్వర్ యొక్క ఫోటో క్లెయిం చేస్తున్న పోస్ట్ నకిలీది

ముగింపు: యూఎస్ మహాత్మ బసవేశ్వర్ యొక్క చిత్రాన్ని $100 బిల్ పై ఉపయోగించింది అని పేర్కొనే వైరల్ పోస్ట్ నకిలీది.

  • By Vishvas News
  • Updated: July 15, 2021

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): విశ్వాస్ న్యూస్ $100 బిల్ (నోట్) మీద మహాత్మ బసవేశ్వర్ యొక్క ఫోటో ఉపయోగించి యూఎస్ భారతదేశాన్ని గౌరవించింది అని తెలిపే ఒక పోస్ట్ చూసింది. భారత ప్రధాని యూఎస్ కు ధన్యవాదాలు తెలిపారు అని కూడా ఇందులో పేర్కొనబడింది.

తన దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిం నకిలీది అని కనుగొనింది.

క్లెయిం:

ఫేస్‎బుక్ యూజర్ ఆర్‎ఎన్ విభూతి, జూన్ 22 నాడు తన ప్రొఫైల్ పై ఒక వీడియోను పోస్ట్ చేశారు మరియు ఇలా వ్రాశారు: యూఎస్ ద్వారా భారతదేశానికి దక్కిన గౌరవము. 100 డాలర్ బిల్ పై యూఎస్‎ఏ బసవేశ్వర చిత్రాన్ని వినియోగించింది. ప్రధానమంత్రి యూఎస్‎ఏ కు  ధన్యవాదాలు తెలిపారు

దర్యాప్తు:

వార్తా వ్యాసాలను పరీక్షించడము ద్వారా విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది. ఒకవేళ భారతదేశానికి ఈ విధమైన గౌరవం దక్కి ఉంటే లేదా ఒకవేళ యూఎస్ఏ ఒక $100 బిల్ పై బసవేశ్వర చిత్రాన్ని ఉపయోగించి ఉంటే, అది తప్పకుండా ఒక ప్రత్యేక వార్త అయ్యేది. అయితే, ఇంటర్నెట్ పై మాకు అలాంటి వార్తలు ఏవి కనపడలేదు.

అలాగే ఆ పోస్ట్ లో ప్రధానమంత్రి ఈ విషయమై యూఎస్ కు ధన్యవాదాలు తెలిపారు అని కూడా పేర్కొనబడింది.

అయినప్పటికీ, మేము ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ ఖాతాను పరీక్షించినప్పుడు, మాకు ఆ విషయం గురించి ఎలాంటి ట్వీట్ లభించలేదు.

తరువాత మేము వైరల్ అవుతున్న $100 బిల్ ను పరీక్షించాము. విస్తృతంగా షేర్ చేయబడిన ప్రతి నోట్ ఒకే క్రమ సంఖ్య (CL01985909BL12) కలిగి ఉందని మేము గమనించాము. దానిని మేము అసలు $100 బిల్ తో పోల్చి చూశాము. అయితే అది ఒకేలా కనిపించింది.

విశ్వాస్ న్యూస్ ఆ తరువాత ఫేక్ $100 బిల్స్ సృష్టించే ఏదైనా అప్లికేషన్ లేదా ఒక   వెబ్సైట్  ఉందా అని పరీక్షించుటకు ‘ఫేక్ $100 బిల్ జనరేటర్’ వంటి కీవర్డ్స్ ఉపయోగించింది. దీనితో మేము ఒక వెబ్సైట్ కు మళ్ళించబడ్డాము, ‘మీ ముఖముతో ఆన్లైన్ లో ఫేక్ వ్యక్తిగతీకరించబడిన 100 డాలర్ బిల్ తయారు చేసుకోండి’.

ఈ వెబ్సైట్ ఉపయోగించి, ప్రజలు వ్యక్తిగతీకరించబడిన $100 బిల్స్ తయారుచేసుకోవచ్చు. వెబ్సైట్ పై చూపబడిన ఇతర నోట్స్ యొక్క క్రమ సంఖ్య మహాత్మ బసవేశ్వర చిత్రము ఉన్న $100 బిల్ యొక్క క్రమ సంఖ్యగానే ఉంది. కాబట్టి ఆ చిత్రము ఈ వెబ్సైట్ ఉపయోగించి తయారుచేయబడింది అని ఇప్పుడు స్పష్టం అయ్యింది.

దర్యాప్తులోని తరువాతి దశలో, విశ్వాస్ న్యూస్ శరణ్ సాహిత్యము యొక్క పండితుడు, సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘బసవ వాణి’ యొక్క సంపాదకుడు అయిన చెన్నావీర్ భద్రేశ్వర్ మఠ్ ను సంప్రదించింది.

ఆయన $100 బిల్ పై మహాత్మ బసవేశ్వర్ చిత్రము ఉంది అని పేర్కొంటున్న వైరల్ పోస్ట్ నకిలీది అని తెలిపారు. యూఎస్ ఇటువంటి చర్య ఏది చేపట్టలేదు.

విశ్వాస్ న్యూస్ ఇప్పుడు వైరల్ పోస్ట్ షేర్ చేసిన వ్యక్తి యొక్క ఒక సామాజిక నేపథ్యం ఉన్న తనిఖీ చేశారు. ఆర్ఎన్ విభూతి (బాబారాజె), ఈ పోస్ట్ ను షేర్ చేసిన ఈ వ్యక్తి షోలాపూర్ నివాసి మరియు ఈయనకు 718 మంది అనుచరులు ఉన్నారు.

निष्कर्ष: ముగింపు: యూఎస్ మహాత్మ బసవేశ్వర్ యొక్క చిత్రాన్ని $100 బిల్ పై ఉపయోగించింది అని పేర్కొనే వైరల్ పోస్ట్ నకిలీది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later