X

వాస్తవ తనిఖీ: ఫతేహాబాద్‌లో పూజారిపై దాడి చేసిన పాత వీడియో తప్పుడు దావాతో వైరల్‌

వైరల్ దావా నకిలీ. ఈ వైరల్ వీడియో హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన సంఘటన. పూజారిపై దాడి చేసిన నలుగురిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

  • By Vishvas News
  • Updated: November 12, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : గుజరాత్‌లోని ఒక ఆలయంలో బాలికను వేధించినందుకు పూజారిపై ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన యొక్క వీడియో గుజరాత్ లోని ఒక ఆలయం పేరుతో వైరల్ అవుతోంది.

దావా :
ఫేస్‌బుక్ పేజీ ‘మోను భాయ్: ఏక్ ఆవాజ్ సమాజ్ కే లియే భీ‘లో ఈ వైరల్ వీడియోను షేర్‌ చేశారు. ‘ఒక అమ్మాయిని వేధించినందుకు గుజరాత్ లోని ఒక ఆలయ పూజారికి మసాజ్ చేస్తూ…’ అని రైటప్‌ ఇచ్చారు.

ఈ పోస్ట్‌ అర్కైవ్‌ వెర్షన్‌ను ఇక్కడ చూడొచ్చు.

చాలామంది యూజర్లు ఈ వీడియోను పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి వాదనతో షేర్‌ చేశారు.

దర్యాప్తు :
సోషల్ మీడియా శోధనలో, పశ్చిమ బెంగాల్ పోలీసులు వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌పై పోస్ట్ చేసిన ట్వీట్ ఇలాంటి వైరల్‌ క్లెయిమ్‌ గురించి హెచ్చరిస్తోంది. హర్యానాలో ఈ సంఘటన జరిగితే పశ్చిమ బెంగాల్‌లో జరిగిందంటూ కొందరు వైరల్‌ చేయడంతో ఆ సమయంలో పోలీసులు ఈ ట్వీట్‌తో ప్రజలను అప్రమత్తం చేశారు.

అదే ట్వీట్‌ను ప్రస్తావిస్తూ దైనిక్ భాస్కర్‌లో ప్రచురించిన వార్తా కథనం కూడా ఈ సంఘటన గురించి క్లారిటీ ఇచ్చింది. ‘హర్యానాలోని ఫతేహాబాద్‌లో ఒక పూజారిపై దాడి చేసినందుకు పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. ఆలయం లోపల బ్యాట్ పెట్టడానికి అనుమతించకపోవడంతో, మూడు రోజుల క్రితం వారు పూజారిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టారు,’ అని ఆ వార్తాకథనం పేర్కొంది. భట్టు కలాన్ పోలీసులు దాడి కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేశారు.

నవంబర్ 3వ తేదీన ప్రచురించబడిన దైనిక్ జాగరణ్‌ వార్తా కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. ఈ కథనం ప్రకారం, ‘ఫతేహాబాద్ లోని ధబికాలన్ గ్రామంలో ఒక ఆలయంలో పూజారిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది’ మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాలోని బిరో గ్రామ నివాసి అయిన కైలాష్ శర్మ ఈ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. సోమవారం, కొంతమంది యువకులు పూజారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.’ అని తెలుసుకున్నాం.

నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఫతేహాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు.

ఈ వాదనను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ ఫతేహాబాద్ పోలీస్‌ పీఆర్‌ఓ భీమ్‌సింగ్‌ను సంప్రదించింది. ఈ సంఘటన ఫతేహాబాద్‌లో జరిగిందని, ధృవీకరిస్తూ, “ఈ కేసులో నిందితులైన యువకులను అరెస్టు చేశారు మరియు ఈ కేసు దర్యాప్తులో ఉంది.” అని భీమ్‌సింగ్‌ చెప్పారు.

ఈ వైరల్ పోస్ట్‌ను షేర్‌ చేసిన ఫేస్‌బుక్‌ పేజీకి ఐదు వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ పేజీ జూలై నుండి యాక్టివ్‌గా ఉంది.

निष्कर्ष: వైరల్ దావా నకిలీ. ఈ వైరల్ వీడియో హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన సంఘటన. పూజారిపై దాడి చేసిన నలుగురిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

  • Claim Review : 'ఒక అమ్మాయిని వేధించినందుకు గుజరాత్ లోని ఒక ఆలయ పూజారికి మసాజ్ చేస్తూ...'
  • Claimed By : Facebook page
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later