X

వాస్తవ తనిఖీ: బంగ్లాదేశ్‌ షార్ట్‌ఫిలిం క్లిప్పింగ్‌ తప్పుడు వాదనతో వైరల్‌

  • By Vishvas News
  • Updated: November 5, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : పాఠశాల యూనిఫాంలో ఉన్న ఒక అమ్మాయితో పాటు అభ్యంతరకరమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క నాలుగు ఫోటోల కోల్లెజ్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తిరుగుతోంది. ఇది మదర్సాలో జరిగిందనే వాదనతో ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

విశ్వాస్‌ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. నకిలీ దావాతో బంగ్లాదేశ్ చిత్రంలోని ఓ సన్నివేశం ఇప్పుడు వైరల్ అవుతోందని మాకు తెలిసింది.

దావా :
ఫేస్‌బుక్ యూజర్ ఇంద్రజీత్ వ్యాహుత్ పాఠశాల యూనిఫాంలో ఉన్న ఒక అమ్మాయి, అభ్యంతరకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క నాలుగు చిత్రాల కోల్లెజ్‌ను షేర్‌ చేశాడు. ‘ అశ్లీలమైన, వ్యభిచారం యొక్క స్థావరాలుగా మారిన ఈ మదర్సాలను మూసేయండి.’ అని దానికి రైటప్‌ ఇచ్చాడు.

వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
ఈ ఫోటోల అసలు మూలాన్ని కనుగొనడానికి గూగుల్ రివర్స్ ఇమేజ్ సాధనాన్ని ఉపయోగించి మేము ఇంటర్నెట్‌లో శోధించాము. ధృవీకరించబడిన యూట్యూబ్ ఛానల్ అన్నా బాలా 20 సెప్టెంబర్ 2020వ తేదీన అప్‌లోడ్ చేసిన వీడియోలో వైరల్ కోల్లెజ్‌ను మేము కనుగొన్నాము. మేము వీడియోలో 7 నిమిషాల తర్వాత ఈ ఫోటోలను గమనించాము. ఇది అటౌల్ హక్ దర్శకత్వం వహించిన ఒక లఘు చిత్రం.

మరింత స్పష్టత కోసం మేము అటౌల్ హక్‌ను సంప్రదించాము. “ఈ వైరల్ ఫోటో లైంగిక దోపిడీ మరియు లైంగిక నేరాల గురించి అవగాహన కల్పించడానికి తాను నిర్మించిన చిత్రంలోని ఓ సన్నివేశం” అని హక్ తెలిపారు.
ఈ పోస్ట్‌ను ధృవీకరించడానికి బంగ్లాదేశ్‌లోని బాగర్‌పారా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఇక్బర్ కబీర్‌ను కూడా సంప్రదించాము. ‘ఈ చిత్రాలు బంగ్లాదేశ్ లఘు చిత్రం స్క్రీన్ షాట్లు. అవి బంగ్లాదేశ్‌లో కూడా తప్పుడు వాదనలతో వైరల్‌ అవుతున్నాయి’ అని కబీర్ చెప్పారు.

ఈ వైరల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిన ఫేస్‌బుక్ పేజీ యొక్క సోషల్ స్కానింగ్‌లో 22.7వేల మంది ఫాలోవర్లు ఉన్నారని గుర్తించడం జరిగింది.

निष्कर्ष: ఈ వైరల్ పోస్ట్ నకిలీ. బంగ్లాదేశ్‌కు చెందిన లఘు చిత్రం నుండి ఒక సన్నివేశం యొక్క స్క్రీన్ గ్రాబ్స్ నకిలీ వాదనలతో వైరల్ అవుతున్నాయి.

  • Claim Review : అశ్లీలమైన, వ్యభిచారం యొక్క స్థావరాలుగా మారిన ఈ మదర్సాలను మూసేయండి.
  • Claimed By : Facebook User Indrajeet Vyahut
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later