X

ఫాక్ట్ చెక్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీహార్‌లో బిజెపి కోసం ప్రచారం చేయడం లేదు, వైరల్ పోస్ట్‌ అబద్ధం

  • By Vishvas News
  • Updated: September 27, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్): బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ABP న్యూస్‌ ఛానెల్‌లోఈ బ్రేకింగ్‌ ప్రసారమైనట్లు గ్రాఫిక్‌ ప్లేట్‌ను షేర్‌ చేస్తున్నారు.

వాట్సాప్ చాట్‌బాట్ (+91 95992 99372) లో వాస్తవ తనిఖీ కోసం మేము దీన్ని అందుకున్నాం. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది. బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కంగనా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలను బిజెపి ఖండించింది.

దావా :
రాబోయే బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నట్లు ఎబిపి టివి ఛానెల్‌కు సంబంధించిన గ్రాఫిక్‌ ప్లేట్‌తో వైరల్‌ పోస్ట్‌.

దర్యాప్తు :

ABP న్యూస్ అలాంటి వార్తలను ప్రచురించిందో లేదో తెలుసుకోవడానికి మేము కీవర్డ్స్‌ సహాయంతో ఇంటర్నెట్‌లో శోధించడం జరిగింది ఎబిపి ఛానెల్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో మాకు ఎలాంటి సమాచారం దొరకలేదు. అయితే, కంగనా రనౌత్‌ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారన్న వాదనను బిజెపి బీహార్ ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించిన వార్తా కథనాన్ని కనుగొన్నాము. లైవ్ హిందుస్తాన్‌ డాట్‌కామ్‌లో ప్రచురించబడిన ఆ వార్తా కథనం లింక్‌ను ఇక్కడ చూడవచ్చు.

కంగనా రనౌత్ బిజెపి కోసం ప్రచారం చేయడాన్ని ధృవీకరించే ప్రామాణికమైన నివేదికలు ఏవీ మాకు లభించలేదు.

ఎబిపి న్యూస్ పేరిట వైరల్ అయిన గ్రాఫిక్ ప్లేట్‌ను మేము నిశితంగా పరిశోధించాము. ఈ గ్రాఫిక్ ప్లేట్‌లో వ్యాకరణ దోషం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది తప్పుడు స్థలంలో విరామ చిహ్నాన్ని (సెమీ కోలన్) ఉపయోగించింది. ఈ గ్రాఫిక్ ప్లేట్‌లో ఉపయోగించిన ఫాంట్ ABP న్యూస్ యొక్క అసలు ఫాంట్‌కు భిన్నంగా ఉంది.

నకిలీ ప్లేట్ మరియు ABP ఛానెల్‌ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియో నుండి తీసిన అసలు ABP గ్రాఫిక్ ప్లేట్ మధ్య ఈ వ్యత్యాసం కింది ఫోటోలో చూడవచ్చు.

ఈ వాదనను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ ఎబిపి న్యూస్ సంపాదకీయ విభాగాన్ని సంప్రదించింది. ఇది నకిలీ గ్రాఫిక్ ప్లేట్ అని, ఇది ABP ఛానెల్‌కు సంబంధించిన గ్రాఫిక్ ప్లేట్ కాదని వారు స్పష్టం చేశారు.

‘టీం హక్ కి ఆవాజ్’ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఈ వైరల్ దావాను పోస్ట్ చేశారు. ప్రొఫైల్‌ను సోషల్ స్కానింగ్ చేయగా.. ఈ అకౌంట్‌ను 2020 సెప్టెంబరులో క్రియేట్‌ చేసినట్లు తెలిసింది. మరియు ఈ ట్విట్టర్‌ హ్యాండిల్‌ను 116 మంది ఫాలో అవుతున్నారు.

निष्कर्ष: వైరల్ అవుతున్న దావా నకిలీ. బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కంగనా ప్రచారం చేస్తున్నారన్న వాదనలను బిజెపి ఖండించింది.

  • Claim Review : బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నారు.
  • Claimed By : ట్విట్టర్ హ్యాండిల్ 'టీం హక్ కి ఆవాజ్'
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later