X

వాస్తవ తనిఖీ: చైనా వస్తువులను బహిష్కరించాలని ఐటిబిపి కోరిందంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధం, ఎడిటెడ్‌ ఫోటో నకిలీ దావాతో వైరల్

  • By Vishvas News
  • Updated: November 9, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : దేశంలో దీపావళి పండుగ సందర్భంగా ఓ బ్యానర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటిబిపి) రూపొందించిన ఈ బ్యానర్ చైనా వస్తువులను కొనవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ ఫోటో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ అవుతోంది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని తేలింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గర్‌కు చెందిన ఒక సంస్థ యొక్క బ్యానర్‌ను ఐటిబిపి పేరుతో ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

దావా :
ట్విట్టర్ యూజర్ రాజేష్ కేసరి (@ rajeshk9835455) అక్టోబర్ 26 న ఒక ట్వీట్ పోస్ట్ చేశారు, ‘నేను # చైనాను మన సరిహద్దులోకి ప్రవేశించనివ్వను, మీరు # చైనా వస్తువులను # దీపావళిలో కొనవద్దు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్’. అని ఆ బ్యానర్‌లో ఉన్న అంశాన్నే రైటప్‌గా రాశారు.

వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
బ్యానర్‌ను బాగా పరిశీలించినప్పుడు, ‘ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్’ అనే పదాలు బ్యానర్‌లోని ఇతర కంటెంట్‌తో సరిపోలడం లేదని మరియు వేరేగా ఉన్నాయని మేము గుర్తించాము. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి దాని అసలు మూలాన్ని కనుగొనడానికి మేము ఇంటర్నెట్‌లో వైరల్ ఇమేజ్‌ని శోధించాము. ఈ బ్యానర్‌ను అక్టోబర్ 2017 న అప్‌లోడ్ చేసిన ఫేస్‌బుక్ పేజీ ఆర్కే ఏజెన్సీ కవర్ ఫోటోలో మేము కనుగొన్నాము. అసలు బ్యానర్‌ను చిత్తోర్‌గర్‌‌లోని స్వదేశీ జాగరణ్‌ మంచ్ వారు రూపొందించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అనే పదాలు ఎడిట్‌ చేసి.. ఈ బ్యానర్‌లో స్వదేశీ జాగరణ్‌ మంచ్‌కు బదులు అతికించారని నిర్ధారించడం జరిగింది.


ఈ వైరల్‌ దావాను ధృవీకరించడానికి మేము ఐటిబిపి ప్రతినిధి వివేక్ కుమార్ పాండేని సంప్రదించాము. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌కు చెందినదని ఆరోపించిన ఈ వైరల్ బ్యానర్ నకిలీదని, ఐటిబిపి అలాంటి విజ్ఞప్తి చేయలేదని ఆయన మాకు చెప్పారు.

వైరల్ చిత్రాన్ని షేర్‌ చేసిన ట్విట్టర్ యూజర్ సోషల్ స్కానింగ్‌లో అతను బీహార్‌కు చెందినవాడని, ట్విట్టర్‌లో 2,443 మంది ఫాలోవర్లు ఉన్నారని తేలింది. అతని అకౌంట్‌ డిసెంబర్ 2016 నుండి యాక్టివ్‌గా ఉంది.

निष्कर्ष: వైరల్ పోస్ట్ నకిలీ. ఈ బ్యానర్ చిత్తోర్‌గర్‌లోని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌కు చెందినది, మరియు ఇది ఐటిబిపికి తప్పుగా ఆపాదించబడింది.

  • Claim Review : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క బ్యానర్
  • Claimed By : Twitter user Rajesh Kesari
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later