X

వాస్తవ తనిఖీ : COVID-19 కారణంగా నెట్‌ఫ్లిక్స్ యేడాది ఉచిత సభ్యత్వాన్ని ఇవ్వడం లేదు, వైరల్‌ పోస్ట్‌ అబద్ధం

COVID-19 కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఒక సంవత్సరం ఉచిత సభ్యత్వాన్ని ఇవ్వడం లేదు, వైరల్ పోస్ట్ అబద్ధం.

  • By Vishvas News
  • Updated: December 14, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : COVID-19 కారణంగా నెట్‌ఫ్లిక్స్ 1 సంవత్సరం చందాను ఉచితంగా ఇస్తోందని కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు వైరల్ పోస్ట్ అబద్ధమని మేము కనుగొన్నాము. ఈ పోస్ట్‌లో ఫిషింగ్ స్కామ్ లింక్ కూడా ఉంది.

దావా :
విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్‌లో వాస్తవ తనిఖీ కోసం ఒక పోస్ట్ అందుకుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఆవరించిన నేపథ్యంలో, నెట్‌ఫ్లిక్స్ తన ప్లాట్‌ఫామ్ కోసం ఐసొలేషన్‌ సమయంలో కొంత ఉచిత పాస్ ఆఫర్‌ చేస్తోంది. సైట్‌ త్వరగా ఓపెన్‌ చేయండి, లేదంటే అది త్వరగా ముగుస్తుంది!’ అని రైటప్‌ ఇచ్చారు. ఆ పోస్ట్‌లో ఒక లింక్ కూడా ఉంది.

దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌లో మరియు దాని సోషల్ మీడియా ఖాతాలలో అటువంటి ఉచిత ఆఫర్‌ల కోసం శోధించింది. వైరల్ పోస్ట్‌లో క్లెయిమ్ చేసినట్లు మేము ఏ ఆఫర్‌ను కనుగొనలేదు.

వైరల్ పోస్ట్‌లో ఇచ్చిన https://netflix-usa.net/?free-isolation-period అనే url ని మేము తనిఖీ చేసినప్పుడు, ఆ వెబ్‌సైట్ సురక్షితం కాదనే సందేశాన్ని అందుకుంది.

మేము వెబ్‌సైట్‌ను మరింత క్షుణ్ణంగా తనిఖీ చేసాము, మరియు నెట్‌ఫ్లిక్స్‌కు ఆ వెబ్‌సైట్‌తో ఎలాంటి సంబంధం లేదని కనుగొన్నాము. ‘ఇప్పుడు మీరు మీ వాట్సాప్‌ను మార్చుకోవచ్చు, మరియు మీకు ఇష్టమైన రంగును చేర్చుకోవచ్చు!’ అని ఆ వెబ్‌సైట్‌ హోమ్‌పేజీలో ఒక మెస్సేజ్‌ ఉంది.

నెట్‌ఫ్లిక్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ లింక్‌ ఇది.. https://www.netflix.com/ . వైరల్ అవుతున్న మెస్సేజ్‌లో ఇవ్వబడిన లింక్‌ కాదు.

విశ్వాస్ న్యూస్ నెట్‌ఫ్లిక్స్‌ను చాట్ ద్వారా సంప్రదించడం జరిగింది. మేము కస్టమర్ సేవా విభాగానికి చెందిన రెజిన్‌తో చాట్ చేసాము. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, ఈ మెస్సేజ్‌ నకిలీ. వైరల్ పోస్ట్‌లో ఇచ్చిన వెబ్‌సైట్ నెట్‌ఫ్లిక్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ కాదు, అలాగే, నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఒక సంవత్సరం ఉచిత సభ్యత్వాన్ని ఇవ్వడం లేదు.

निष्कर्ष: COVID-19 కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఒక సంవత్సరం ఉచిత సభ్యత్వాన్ని ఇవ్వడం లేదు, వైరల్ పోస్ట్ అబద్ధం.

  • Claim Review : COVID-19 కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఒక సంవత్సరం చందా ఉచితంగా ఇస్తోంది
  • Claimed By : Whatsapp user
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later