X

వాస్తవ తనిఖీ: నీలగిరి పర్వత రైలు గురించి నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్య చేయలేదు, వైరల్ దావా అబద్ధం

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉటంకిస్తూ వైరల్ గ్రాఫిక్స్‌ ప్లేట్ నకిలీ. పుతియతలైమురై వెబ్ బృందం ఈ వాదనలను ఖండించింది.

  • By Vishvas News
  • Updated: December 17, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : తమిళ భాషా ప్రాంతీయ వార్తా ఛానెల్ అయిన పుతియతలైమురైకి చెందిన వైరల్ గ్రాఫిక్ ప్లేట్‌లో ‘ఊటీ రైలు అంతర్జాతీయ ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయబడింది. ప్రజలు రూ.3,000 టికెట్ ఛార్జీలను భరించలేకపోతే, వారు ఎందుకు రైలులో ప్రయాణించాలనుకుంటున్నారు.’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నట్లు వైరల్‌ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. పుతియతలైమురై వెబ్ బృందం వారు అలాంటి వార్తలను తాము ప్రసారం చేయలేదని ఈ వాదనలను ఖండించారు.

దావా :
ఊటీ రైలును అంతర్జాతీయ ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేశామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించినట్లు పేర్కొన్న తమిళ ప్రాంతీయ వార్తా ఛానెల్ పుతియతలైమురైకి సంబంధించిన వైరల్ గ్రాఫిక్ ప్లేట్. రూ.3,000 టికెట్ ఛార్జీలను భరించలేకపోతే ప్రజలు ఊటీని ఎందుకు సందర్శించాలనుకుంటున్నారు? అని ఆమె ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ ఇటీవల నీలగిరి మౌంటైన్ రైల్వే (ఎన్‌ఎంఆర్) ప్రైవేటీకరించబడిందంటూ సాగుతున్న ఒక పుకారును వాస్తవ తనిఖీ చేయడం జరిగంది. మేము ఆర్థిక మంత్రి వ్యాఖ్యల కోసం ఇంటర్నెట్‌లో శోధించాము.

వైరల్ దావాలో ఉన్నట్లుగా ఆర్థికమంత్రి వ్యాఖ్యానించినట్లు ప్రామాణికమైన వార్తా కథనాలు ఏవీ మాకు కనిపించలేదు.

కానీ వైరల్ ఫోటోలోని సమాచారం నకిలీదని పుతియతలైమురై యొక్క అధికారిక ఫేస్‌బుక్ పేజీలో నకిలీ హెచ్చరికను మేము కనుగొన్నాము.

ధృవీకరణ కోసం విశ్వాస్ న్యూస్, పుతియతలైమురై వెబ్ టీమ్‌ ఇన్‌ఛార్జ్ మనోజ్ ప్రభాకర్‌ను సంప్రదించింది. ఆ వాదనలను ఖండించిన ఆయన.. గ్రాఫిక్ ప్లేట్ ఎడిట్‌ చేయబడిందని చెప్పారు. ‘వైరల్ ఫోటో నకిలీ. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ను ఉటంకిస్తూ మేము అలాంటి వార్తలను ప్రసారం చేయలేదు.’ అని ప్రభాకర్ అన్నారు.

వైరల్ పోస్ట్‌ను షేర్‌ చేసుకున్న ఫేస్‌బుక్‌ యూజర్ తిలగరాజ్ యొక్క సోషల్ స్కానింగ్‌లో, అతను తమిళనాడులోని చెన్నైకి చెందినవాడని, మరియు ఫేస్‌బుక్‌లో 4,057 మంది స్నేహితులు మరియు 572 మంది ఫాలోవర్లు ఉన్నారని తేలింది.

निष्कर्ष: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉటంకిస్తూ వైరల్ గ్రాఫిక్స్‌ ప్లేట్ నకిలీ. పుతియతలైమురై వెబ్ బృందం ఈ వాదనలను ఖండించింది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later