
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల మధ్య, యశోద ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చికిత్స పొందుతున్నారంటూ ఓ టీవీఛానెల్ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది. ‘సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స, జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్’ అని ఆ పోస్ట్‌లో బ్రేకింగ్న్యూస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పోస్ట్‌తో, సంబంధిత యూజర్ ఈ చిత్రాలను తాజా బ్రేకింగ్ అని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు, CM ఆరోగ్యం గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను దర్యాప్తు చేసి, ఈ వాదన తప్పు అని కనుగొంది. ఆ టీవీ ఛానెల్‌ల స్క్రీన్షాట్లు పాతవి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
దావా :
‘ఐరావతం’ అనే ఫేస్బుక్ పేజీలో జూలై 8 న ఒక టీవీ ఛానల్ యొక్క స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. ‘సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స, జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న కేసీఆర్’ అని ఉన్న ఆ స్క్రీన్ షాట్లు తెలుగు న్యూస్ ఛానెల్ HMTVకి సంబంధించినవి.
ఈ పోస్టుకు సంబంధించిన అర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
దర్యాప్తు:
మేము సీఎం కేసీఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌తో పాటు.. ఇతర ప్రామాణికమైన మీడియా వెబ్సైట్లలో కెసిఆర్ ఆరోగ్యం గురించి శోధించాము. ఆయన అనారోగ్యం గురించి ఎక్కడా మాకు వార్తలు కనిపించలేదు. దీనిని ధృవీకరించుకోవడానికి, మేము CMO ని సంప్రదించాము. CM ఆరోగ్యం బాగుందని సమాచారం వచ్చింది.
ఇక మేము మా శోధనను మరింత విశదీకరించాము. ‘యశోద ఆసుపత్రిలో కెసిఆర్‌కు చికిత్స’ అనే కీలక పదాలతో గూగుల్‌లో శోధించాము. ఈ కీవర్డ్ శోధనతో, మేము చాలా ఫలితాలను కనుగొన్నాము. జలుబు, జ్వరంతో యశోద ఆసుపత్రిలో ఈ ఏడాది జనవరిలో కెసిఆర్ చికిత్స పొందినట్లు పలు మీడియా సంస్థలు, వెబ్ పోర్టల్స్ వార్తాకథనాలు ఇచ్చాయి. మేము ఈ వార్తను HMTVకి చెందిన Youtube ఛానెల్లో కూడా కనుగొన్నాము. ఈ వీడియోను జనవరి 21, 2020 న అప్లోడ్ చేశారు. ఆ వీడియో వివరణ ప్రకారం, స్వల్ప అనారోగ్యంతో కెసిఆర్‌ను యశోద ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.
అయితే, ఈ వైరల్ పోస్ట్‌పై మరింత స్పష్టత కోసం, మేము హెచ్ఎమ్టివి రిపోర్టర్ రాజేష్‌తో మాట్లాడాము. అతని ఫోటో వైరల్ పోస్ట్‌లో చూడవచ్చు, అక్కడ అతను హాస్పిటల్ నుండి ఫోనో ఇస్తున్నాడు. KCR అనారోగ్యాన్ని ఫోన్ ద్వారా నివేదించిన రాజేష్, “ఈ సంవత్సరం జనవరి 21 న ఈ సంఘటన జరిగిందని, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో CM ఆరోగ్యం గురించి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అవాస్తవం” అని చెప్పారు.
ఈ వైరల్ పోస్ట్‌ను అప్లోడ్ చేసిన ఫేస్బుక్ పేజీ ‘ఐరవతం’ ప్రొఫైల్‌ను విశ్వాస్ న్యూస్ స్కాన్ చేసింది. 1695 మంది ఈ పేజీని అనుసరిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రచురించే వరకు ఈ వైరల్ పోస్ట్‌ను 192 మంది షేర్ చేశారు.
निष्कर्ष: ముగింపు : విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను పరిశోధించి, ఈ వాదన తప్పు అని కనుగొనడం జరిగింది. వైరల్ అవుతున్న టీవీ ఛానెల్ స్క్రీన్షాట్లు పాతవి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.