X

వాస్తవ తనిఖీ: పాట్నాలో అగ్నిప్రమాదం పాత వీడియో మళ్లీ ఇప్పుడు మంగ్లౌర్‌ పేరుతో తప్పుదారి పట్టిస్తున్నారు

  • By Vishvas News
  • Updated: November 20, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లా మంగ్లౌర్ లోని ఒక స్వీట్‌ షాపులో 10 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగాయంటూ, ఒక భవనంలో మంటలు చెలరేగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ దుర్ఘటనలో 24 మంది మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు ఈ వాదన తప్పుదారి పట్టించేదని వెల్లడించింది. పాట్నాలో జరిగిన అగ్నిప్రమాదం పాత వీడియో తప్పుదారి పట్టించే వాదనలతో వైరల్‌గా మారింది. ఆ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు.

దావా :
రూర్కీలోని మంగ్లౌర్‌లో సిలిండర్ పేలుడు ప్రమాదంలో 24 మంది మరణించారనే వాదనతో ఒక భవనంలో అగ్నికీలలు చెలరేగుతున్న వైరల్ వీడియో షేర్‌ చేయబడింది. ఒక స్వీట్‌ షాప్‌లో 10 సిలిండర్లు పేలి మంటలు చెలరేగడంతో 30 మంది గాయపడ్డారని ఆ పోస్ట్ ఆరోపించింది.

ఈ పోస్ట్‌ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

మేము మొదట వైరల్ వీడియోను ఇన్విడ్ సాధనానికి అప్‌లోడ్ చేసాము, మరియు కీఫ్రేమ్‌లను సేకరించాము. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి మేము వాటిని ఇంటర్నెట్‌లో శోధించాము. ఈ వీడియోను 8 జూన్ 2018 న ఫ్రంట్‌లైన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము, ‘పాట్నా నగరంలోని దీదర్‌గంజ్‌లోని గ్యాస్ గిడ్డంగిలో అగ్నిప్రమాదం’.

పాట్నాలోని ఒక గోడౌన్‌కు సంబంధించి ఇలాంటి వివరణతోనే ఇండియా టుడే యూట్యూబ్ ఛానల్ 9 జూన్ 2018 న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను కూడా మేము కనుగొన్నాము.

దావాను ధృవీకరించడానికి మేము దైనిక్ జాగరణ్‌ పాట్నా కరస్పాండెంట్ ఆశిష్ కుమార్‌ను సంప్రదించాము. ‘ఈ వీడియో 2018లో జరిగింది, బీహార్ రాజధాని పాట్నాలో ఒక ఎల్‌పిజి గోడౌన్‌కు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు’. అని కుమార్ చెప్పారు.

రూర్కీలోని మంగ్లౌర్‌లో అగ్ని ప్రమాదం గురించి వార్తల కోసం మేము ఇంటర్నెట్‌లో శోధించాము. నవంబర్ 8 న మంగ్లౌర్‌లోని ఒక స్వీట్‌ షాపులో గ్యాస్ సిలిండర్ పేలుడులో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, 9 మంది గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని మేము కనుగొన్నాము.

ఇటీవలి సంఘటనకు సంబంధించి అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. వైరల్ దావాను షేర్‌ ఏసిన ఫేస్‌బుక్ పేజీ నాలెడ్జ్ కా అడ్డా యొక్క సోషల్ స్కానింగ్‌లో 11,393 మంది ఫాలోవర్లను కలిగి ఉందని తేలింది.

निष्कर्ष: వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది. ఉత్తరాఖండ్‌లోని మంగ్లౌర్‌లో ఇటీవల జరిగిన సంఘటన అంటూ… బీహార్‌లో అగ్ని ప్రమాదం జరిగిన పాత వీడియోను వైరల్‌ చేస్తున్నారు.

  • Claim Review : ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లా మంగ్లౌర్ లోని ఒక స్వీట్‌ షాపులో 10 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు చెలరేగాయంటూ, ఒక భవనంలో మంటలు చెలరేగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ దుర్ఘటనలో 24 మంది మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
  • Claimed By : FB Page
  • Fact Check : Misleading
Misleading
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later