X
X

వాస్తవ తనిఖీ: సెప్టెంబర్‌ 25 నుంచి దేశంలో లాక్‌డౌన్‌ విధించడం లేదు : NDMA పేరిట వైరల్‌ అవుతున్న లేఖ నకిలీ

వైరల్ దావా నకిలీ. సెప్టెంబర్ 25 నుండి 46 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని ఎన్‌డిఎంఎ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదు.

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : కోవిడ్ -19 రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుండి దేశంలో 46 రోజుల లాక్‌డౌన్ ప్రకటించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఎ) కేంద్రప్రభుత్వాన్ని కోరిందంటూ సోషల్‌ మీడియాలో ఓలేఖ వైరల్‌ అవుతోంది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది. సెప్టెంబర్ 25వ తేదీ నుండి దేశమంతటా లాక్‌డౌన్‌ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వైరల్‌ అవుతున్నది ఏంటి ?
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుండి లాక్‌డౌన్‌ విధించాలనే వాదనతో ఒక లేఖ వైరల్ అవుతోంది, ఇది జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) మరియు దేశంలోని ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాసిన లేఖ అని చెప్పబడుతోంది. సెప్టెంబర్ అర్ధరాత్రి నుండి 46 రోజులు తిరిగి లాక్‌డౌన్ అమలు చేయాలని ఆదేశించింది. వైరల్ లేఖను క్రింద చూడవచ్చు.

దర్యాప్తు :
ఈ లేఖ NDMA నుండి వచ్చినట్లు పేర్కొనడంతో, మేము అధికారిక NDMA వెబ్‌సైట్‌లో శోధించాము. మే 4వ తేదీ తర్వాత రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగించే మార్గదర్శకాలకు సంబంధించిన సలహా విభాగంలో మే 1, 2020 నాటి ఆర్డర్ కాపీని మేము కనుగొన్నాము.

ఈ క్రమంలో లేఖలో ఉపయోగించిన ఆకృతిని మేము స్పష్టంగా గుర్తించగలిగాము. మరియు వైరల్ లేఖలో పాత ఆర్డర్‌లోని అక్షరాల మాదిరిగా కొత్త లేఖను సృష్టించినట్లు ధృవీకరించాము.

మా పరిశోధనలో లాక్‌డౌన్‌ను పొడిగించడానికి సంబంధించి ఇటీవలి కాలంలో వెలువడిన ప్రకటన వెబ్‌సైట్‌లో కనిపించలేదు.

అయినప్పటికీ, వైరల్‌ దావాను నిర్ధారించుకోవడానికి చేయడానికి విశ్వాస్ న్యూస్ ఎన్‌డిఎంఎ డైరెక్టర్ (పిఆర్&ఎజి) భూపిందర్ సింగ్‌ను సంప్రదించింది. “అటువంటి లేఖను ఎన్‌డిఎమ్ఎ రాయలేదని, మా తరపున లాక్‌డౌన్ విధించడం లేదా పొడిగించడం గురించి ప్రభుత్వం నుండి ఎటువంటి సూచన లేదు” అని డైరెక్టర్ చెప్పారు.

ఏదైనా ప్రామాణికమైన వార్తా నివేదిక కోసం మేము ఇంటర్నెట్‌లో శోధించాము, మరియు భారతదేశంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. మూడు వారాల పాటు మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మేము అనేక నివేదికలను కనుగొన్నాము.

దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి మరియు దాని మరణాలను తగ్గించడానికి 2020 సెప్టెంబర్ 25వతేదీ అర్ధరాత్రి నుండి వచ్చే 46 రోజుల పాటు కఠినమైన దేశవ్యాప్త లాక్‌డౌన్ అవసరమని దావాలోని వైరల్ లేఖలో పేర్కొన్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, భారతదేశంలో వేగంగా పెరుగుతున్న వైరస్‌ కేసులలో రికవరీ రేటు 78.27 శాతానికి పెరిగింది. మొత్తం రోగులలో అరవై శాతం మంది ఎక్కువగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాల్లో ఉన్నారు, ఇది రికవరీ రేటు 60 శాతం.

కోవిడ్ -19 ఇండియా ట్రాకర్ ప్రకారం, (సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 8 గంటల వరకు) భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య 49 లక్షలు దాటింది. కరోనావైరస్ కారణంగా భారతదేశంలో ఇప్పటివరకు 80,776 మంది మరణించారు.

https://twitter.com/COVIDNewsByMIB/status/1305742370877530113?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1305742370877530113%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.vishvasnews.com%2Fenglish%2Fpolitics%2Ffact-check-ndma-did-not-suggest-government-to-impose-46-days-lockdown-the-viral-letter-is-fake%2F

DISCLAIMER: #కరోనావైరస్‌ఫ్యాక్ట్స్‌ డేటాబేస్ కోవిడ్‌-19 వ్యాప్తి ప్రారంభం నుండి ప్రచురించబడిన వాస్తవాలు-తనిఖీలను నమోదు చేస్తుంది. మహమ్మారి మరియు దాని పర్యవసానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా రోజులు, వారాలు గడిచే సరికి ఖచ్చితమైన డేటా మారవచ్చు. కాబట్టి దీనిని ఎవరికైనా షేర్‌ చేయడానికి ముందు మీరు చదువుతున్న ఫాక్ట్-చెక్ స్టోరీ ప్రచురించబడిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని గుర్తుంచుకోండి.

निष्कर्ष: వైరల్ దావా నకిలీ. సెప్టెంబర్ 25 నుండి 46 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని ఎన్‌డిఎంఎ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later