X

వాస్తవ తనిఖీ : ప్రియాంక రాహుల్ గాంధీ నవ్వుతూ దిగిన ఈ ఫోటో 2019లో తీసినది, తాజా ఫోటో కాదు

ఈ వాదన నిజం కాదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో ఇటీవల తీసినది కాదు. వైరల్ అవుతునన ఫోటో 2019లో తీశారు.

  • By Vishvas News
  • Updated: October 12, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : యూపీలోని హత్రాస్‌లో జరిగిన సంఘటన తర్వాత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ నవ్వుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇద్దరూ కలిసి హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళుతున్నప్పుడు ఈ ఫోటో దిగారంటూ విమర్శిస్తున్నారు. అయితే, వాస్తవం ఏంటంటే.. ఈ ఫోటోను 2019లో కాన్పూర్ విమానాశ్రయంలో తీశారు.

వైరల్‌ అవుతున్నది ఏంటి?
వైరల్ ఫోటోలో, ప్రియాంక గాంధీ మరియు రాహుల్ గాంధీ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని నవ్వుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు హత్రాస్‌కు వెళుతున్న సమయంలో దిగిన ఫోటో అంటూ ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తున్నారు. దుఃఖంలో మునిగిన కుటుంబాన్ని పరామర్శించాల్సిన సమయంలో ఇలా నవ్వుతూ ఫోటో దిగారు. Neutral face #ड्रामेबाज_भाईबहन.’

పోస్ట్‌, దీనికి సంబంధించిన ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
ఈ ఫోటోను పరిశోధించడానికి, మేము గూగుల్ రివర్స్ ఇమేజ్‌లో శోధించాము. శోధన సమయంలో, ఏప్రిల్ 27, 2019 న ఎన్డీటివిలో ప్రచురించిన వార్తలలో ఈ వైరల్ చిత్రాన్ని కనుగొన్నాము. అందులో పేర్కొన్న వార్తాకథనం ప్రకారం, రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకతో కలిసి కాన్పూర్‌ వచ్చినప్పుడు అక్కడి విమానాశ్రయంలో తీసుకున్న ఫోటో.

ఏప్రిల్ 27, 2020 న టైమ్స్ ఆఫ్‌ ఇండియా యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో కూడా ఓచోట ఈ వైరల్ ఫోటో కనిపించింది.

ఈ విషయంలో మేము కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ ప్రణవ్‌ ఝాతో విశ్వాస్‌ న్యూస్‌ మాట్లాడటం జరిగింది. ‘ఈ ఫోటో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తీసినది. వాళ్లు ఇద్దరూ ఒకే హెలికాఫ్టర్‌లో ప్రయాణించబోయే సమయంలో… ప్రియాంక గాంధీ కోసం ఒక పెద్ద హెలికాప్టర్‌ తీసుకు రావాలంటూ రాహుల్‌గాంధీ చమత్కరించడంతో నవ్వులు పూసాయి.’ అని ప్రణవ్‌ చెప్పారు. కాంగ్రెస్ ప్రతినిధి సంజీవ్ సింగ్ కూడా ఈ ఫోటోపాతదని ధృవీకరించారు.

సోషల్ మీడియాలో తప్పుడు వాదనలతో చాలా మంది ఈ పోస్ట్ షేర్‌ చేస్తున్నారు. వీటిలో ఒకటి అనిమా సోంకర్ @AnimaSonkar అనే ట్విట్టర్ హ్యాండిల్. ఈ ట్విట్టర్‌ హ్యాండిల్‌కు 19.7 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

निष्कर्ष: ఈ వాదన నిజం కాదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ఈ ఫోటో ఇటీవల తీసినది కాదు. వైరల్ అవుతునన ఫోటో 2019లో తీశారు.

  • Claim Review : ప్రతిపక్ష నాయకుడు హత్రాస్‌కు వెళుతున్న సమయంలో దిగిన ఫోటో
  • Claimed By : @AnimaSonkar
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later