
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్బాట్లో ఒక దావాను అందుకుంది. ఉచిత టాబ్లెట్ డివైజ్‌లను ఇవ్వడం గురించి అందులో చర్చిస్తున్నారు. ఉచిత టాబ్లెట్ పరికరాన్ని పొందడానికి వివరాలు నమోదు చేయమని ఆ పోస్ట్ ప్రజలను అడుగుతుంది. వైరల్ అవుతున్న ఈ సందేశం నకిలీదని విశ్వాస్ న్యూస్ కనుగొంది.
వైరల్ అవుతున్నది ఏంటి?
మా వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 9599299372 లో వాస్తవ తనిఖీ కోసం విశ్వాస్ న్యూస్‌కు ఈ సందేశం వచ్చింది.
దర్యాప్తు :
వైరల్ పోస్ట్‌లో చేసిన దావా యొక్క నిజానిజాలు తెలుసుకోవటానికి, మేము మొదట గూగుల్‌లో కీలకపదాల సహాయంతో ఒక శోధనను ప్రారంభించాము, కానీ భారతదేశంలోని సాధారణ ప్రజల కోసం అటువంటి ప్రైవేట్ లేదా అధికారిక పథకం గురించి మాకు ఏ విధమైన మీడియా కథనం రాలేదు. అయితే, 8 నుండి 12 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల పిల్లలకు హర్యానా ప్రభుత్వం ఉచిత టాబ్లెట్ పరికరాలను ఇవ్వబోతోందని jagranjosh.com లో మాకు ఒక వార్త కనిపించింది. కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరలేదు.
పశ్చిమ బెంగాల్ గురించి కూడా అలాంటి ఒక వార్త మాకు కనిపించింది. jagranjosh.com వార్తా కథనం ప్రకారం, “మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వచ్చే ఏడాది హయ్యర్ సెకండరీ పరీక్షకు హాజరు కానున్న రాష్ట్రంలోని 9.5 లక్షలకు పైగా విద్యార్థులకు టాబ్లెట్ పరికరాలను ఇవ్వడానికి యోచిస్తోంది.” ఈ వార్తలలో కూడా రిజిస్ట్రేషన్ గురించి చెప్పబడలేదు.
అయినప్పటికీ, విశ్వాస్ కనుగొన్న గ్రాఫిక్స్‌లో ఎటువంటి లింక్ లేదు, కానీ గ్రాఫిక్ “నమోదు చేయడానికి చివరి తేదీ” అని చెప్పింది, ఇది ఈ గ్రాఫిక్‌తో ఒక లింక్ పంపబడి ఉండాలని సూచిస్తుంది.
మేము సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మరియు రాజస్థాన్ ప్రభుత్వ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ మాజీ ఐటి కన్సల్టెంట్ ఆయుష్ భరద్వాజ్‌ను సంప్రదించాము. “మాకు అలాంటి పథకం లేదు. ఇటువంటి లింక్‌లు క్లిక్‌బైట్ మాత్రమే. అంటే, అటువంటి లింక్‌లలో నమోదు చేసిన తర్వాత కూడా, వినియోగదారు ఉచిత టాబ్లెట్ పరికరాన్ని పొందలేరు.” అని భరద్వాజ్ చెప్పారు, అలాగే, “ఈ రోజుల్లో ఇటువంటి సైబర్ క్రైమ్ పెరుగుతోంది, ఇలాంటి సమాచారం ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలని మెస్సేజ్‌లు పొందుతారు. వాటిపై క్లిక్ చేసినా దానిని పొందలేరు. అంతేకాదు.. ఆర్థికంగా కూడా నష్టపోతారు. అలాంటి లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండాలి. ” అన్నారు.
निष्कर्ष: వైరల్ అవుతున్న ఈ సందేశం నకిలీదని విశ్వాస్ న్యూస్ కనుగొంది. ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయండి.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.