X

వాస్తవ తనిఖీ : వీడియోలో ఉన్న వ్యక్తి పాకిస్తానీ జర్నలిస్ట్ కాదు, ఇండియన్ మోటివేషనల్ స్పీకర్

  • By Vishvas News
  • Updated: December 28, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పాకిస్తాన్ జర్నలిస్ట్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్‌ పేర్కొంది. వీడియోలో, ఆ వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడం గమనించవచ్చు.

విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్‌పై దర్యాప్తు చేసినప్పుడు, వీడియోలో ఉన్న వ్యక్తి పాకిస్తాన్ జర్నలిస్ట్ కాదని, భారత్‌కు చెందిన మోటివేషనల్‌ స్పీకర్‌ హర్షవర్ధన్ జైన్ అని మేము కనుగొన్నాము.

దావా :
ఫేస్‌బుక్ యూజర్ గణేష్ చేతనా గౌడ 2020 నవంబర్ 22 న కన్నడలో ఈ వీడియోను అప్‌లోడ్ చేసారు, దానికి కన్నడలో ఇలా రైటప్‌ ఇచ్చారు. “ಪಾಕಿಸ್ತಾನದ ಪತ್ರಕರ್ತ ಮೋದಿಯವರನ್ನು ವರ್ಣಿಸಿದ ರೀತಿ…” దీనిని తెలుగలోకి అనువదిస్తే.. ‘పాకిస్తానీ జర్నలిస్ట్‌ మోడీ గురించి మాట్లాడుతున్నాడు’. అనేది సారాంశం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.

దర్యాప్తు :
ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత, హర్షవర్ధన్ జైన్ పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్స్ స్పష్టంగా కనిపించాయి.

విశ్వాస్‌ న్యూస్ ఇన్విడ్ టూల్‌ను ఉపయోగించి వీడియో యొక్క స్క్రీన్ గ్రాబ్లను సంగ్రహించింది, మరియు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి గూగుల్‌లో స్క్రీన్ గ్రాబ్స్ ను ‘హర్షవర్ధన్ జైన్’ అనే కీవర్డ్ తో శోధించింది. శోధన సమయంలో, 2020 ఆగస్టు 14 న హర్షవర్ధన్ జైన్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన అసలు వీడియోను మేము కనుగొన్నాము.

హర్షవర్ధన్ జైన్ యొక్క యూట్యూబ్ ఛానల్‌లోని About us విభాగం, మరియు ఆయన ‘ఇన్‌స్టాగ్రామ్‌’ ప్రొఫైల్‌ గమనిస్తే.. హర్షవర్థన్ జైన్ ఒక ప్రేరణాత్మక వక్త, బిజినెస్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ మరియు లీడర్‌షిప్‌ కోచ్ అని తెలిసింది. ఆయన సోషల్‌ మీడియా అకౌంట్ల ప్రొఫైల్‌ ప్రకారం.. జైపూర్‌కు చెందిన వారు. .

మేము జైన్ యొక్క వ్యక్తిగత వెబ్‌సైట్ మరియు ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా కనుగొన్నాము.

మేము నేరుగా హర్షవర్ధన్ జైన్ కార్యాలయాన్ని సంప్రదించాము. ‘ఈ వాదన అబద్ధం. ఈ వీడియో ఏ పాకిస్తానీ పాత్రికేయుడిది కాదు, హర్షవర్ధన్ జైన్‌ది. హర్షవర్ధన్ జైన్ రాజస్థాన్‌కు చెందినవాడు మరియు ప్రసిద్ధ ప్రేరణా వక్త.’ అని ఆయన అసిస్టెంట్‌ త్రిలోక్‌ శర్మ చెప్పారు.

చివరికి, మేము నకిలీ దావాతో వీడియోను పంచుకున్న ఫేస్‌బుక్ యూజర్ గణేష్ చేతన గౌడ యొక్క అకౌంట్‌ను సోషల్ స్కానింగ్‌ను చేశాము. ఈ యూజర్‌ కర్ణాటకకు చెందిన వారని మేము కనుగొన్నాము.

निष्कर्ष: విశ్వాస్‌ న్యూస్ ఈ వైరల్ పోస్టుపై దర్యాప్తు చేసినప్పుడు, ఆ వీడియోలోని వ్యక్తి పాకిస్తాన్ జర్నలిస్ట్ కాదని, భారతీయ ప్రేరణా వక్త హర్షవర్థన్ జైన్ అని తేలింది.

  • Claim Review : వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పాకిస్తాన్ జర్నలిస్ట్
  • Claimed By : Ganesh Chethana Gowda
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later