X

వాస్తవ తనిఖీ : వరద నీటిలో మొసలి కొట్టుకొచ్చిన దృశ్యం హైదరాబాద్‌లో కాదు – పాత వీడియో వైరల్‌

  • By Vishvas News
  • Updated: October 20, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్‌ న్యూస్‌) : సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షాల కారణంగా వీధుల్లోకి వరదనీరు పోటెత్తింది. ఆ నీటిలో ఓ మొసలి కొట్టుకువచ్చిందని ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

విశ్వాస్‌న్యూస్‌ దర్యాప్తులో ఆ వీడియో ఇప్పటిది కాదని తేలింది. వడోదరలో వర్షాలు వెల్లువెత్తిన సమయంలో ఆ వీడియో తీశారు. యేడాది క్రితం జరిగిన సంఘటనగా గుర్తించడం జరిగింది.

వైరల్‌ అవుతున్నది ఏంటి?
ఫేస్‌బుక్‌ యూజర్‌ Vijayakumar Alamkaram తన ఫేస్‌బుక్‌ వాల్‌పై ఒక వీడియో పోస్ట్‌ చేశారు. వీధుల్లోకి వచ్చిన మొసలి వీడియో అది. దానికి ఇలా రైటప్‌ ఇచ్చారు. ‘వరద నీటిలో యధేచ్చగా తిరుగుతున్న మొసలి. పొంచి ఉన్న ప్రమాదం. భయపడుతున్న జనం.’ చాలామంది ఈ వీడియోను హైదరాబాద్‌ వీధుల్లోకి మొసలి వచ్చిందంటూ షేర్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్‌ ఇక్కడ క్లిక్‌ చేసి చూడొచ్చు.

ఈ వీడియోకు సంబంధించిన అర్కైవ్‌ వెర్షన్‌ ఇక్కడ కనుక్కోవచ్చు.

దర్యాప్తు :
విశ్వాస్‌ న్యూస్‌ ఈ వైరల్‌ పోస్ట్‌ను వాస్తవ తనిఖీ చేసింది. ముందుగా ఆ వీడియోను ఇన్‌విడ్‌ టూల్‌ ద్వారా కీ ఫ్రేమ్స్‌ను వేరు చేశాము. ఆ కీ ఫ్రేమ్స్‌ను రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ఆధారంగా శోధించడం జరిగింది. అలాగే, కీలక పదాలతోనూ పరిశోధించడం జరిగింది. చాలామంది ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కూడా ఇదే వాదనతో వైరల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసినట్లు గుర్తించడం జరిగింది.

తెలుగు పాపులర్ టివి అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో కూడా ఇదే వాదనతో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. దానికి సంబంధించిన అర్కైవ్‌ వెర్షన్‌ ఇక్కడ క్లిక్‌ చేసి చూడొచ్చు.

విశ్వాస్‌ న్యూస్‌ మరింత లోతుగా దర్యాప్తు చేసింది. దీంతో, ఈ వీడియో యేడాది క్రితం రికార్డ్ చేసినట్లు ఆధారాలు దొరికాయి. ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ వీడియో కనుక్కోవడం జరిగింది. వడోదరలో వరద నీటిలో మొసలి కొట్టుకువచ్చిందని ఆ కథనంలో పేర్కొన్నారు.

జాగరణ్‌ న్యూస్‌లో కూడా ఈ వార్తా కథనం కనిపించింది. ఆ కథనం ప్రకారం భారీ వర్షాలతో వచ్చిన వరదల్లో ఓ మొసలి వీధుల్లోకి చొచ్చుకొచ్చింది.

మేము దైనిక్‌ జాగరణ్‌ వడోదర కరస్పాండెంట్‌ రాజీవ్‌ సింగ్‌ను సంప్రదించాము. ఈ వీడియో పాతది అని వడోదరలో జరిగిన సంఘటన అని ఆయన నిర్ధారించారు.

తప్పుదోవ పట్టించే ఈ వైరల్‌ పోస్ట్‌ను షేర్‌చేసిన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను సోషల్‌ స్కానింగ్‌ చేశాము. ఫేస్‌బుక్‌ యూజర్‌ Vijayakumar Alamkaram కు 2440 మంది స్నేహితులు ఉన్నారు.

निष्कर्ष: ఈ వైరల్‌ పోస్ట్‌లో ఉన్న వీడియో హైదరాబాద్‌లోనిది కాదు. 2019లో గుజరాత్‌లోని వడోదరలో వీధుల్లోకి మొసలి కొట్టుకొచ్చిన వీడియో. దీనికి హైదరాబాద్‌కు సంబంధం లేదు. ఈ వీడియోను పోస్ట్‌ చేయడం ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారు.

  • Claim Review : హైదరాబాద్‌లో వీధుల్లోకి వరద నీటిలో మొసలి కొట్టుకు వచ్చింది.
  • Claimed By : ఫేస్‌బుక్‌ యూజర్‌ 'Vijayakumar Alamkaram'
  • Fact Check : Misleading
Misleading
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later