
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : కొడగు జిల్లా కమిషనర్ మరియు త్రివేండ్రం మాజీ నర్సు అయిన అన్నీస్ కన్మణి జాయ్‌ను ప్రజలు అభినందిస్తున్నారనే వాదనతో ఒక మహిళను సత్కరించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తనకు ఉన్న నర్సింగ్ అనుభవంతో కొడగు జిల్లాను కోవిడ్ బారి నుండి బయట పడేసేందుకు జాయ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన తప్పుదారి పట్టించేదని తెలిసింది. వీడియోలో ఉన్న మహిళ 2012 లో ఐఎఎస్ అర్హత సాధించిన నర్సు మరియు కొడగు జిల్లా ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ అన్నీస్ కన్మనీ జాయ్ కాదు. వీడియోలో కనిపించిన యువతి ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన ఒక ఉద్యోగి.
దావా :
ఫేస్బుక్ యూజర్ పురుషోత్తం తీర్థహల్లి ఒక మహిళను సత్కరించిన వీడియోను పోస్ట్ చేశారు, ‘అన్నీస్ కన్మనీ జాయ్ త్రివేండ్రం మెడికల్ కాలేజీలో నర్సు. ఆమె ఐఎఎస్ పూర్తి చేసి కొడగులో డిస్ట్రిక్ట్ కమిషనర్‌గా పోస్టింగ్ సంపాదించింది. నర్సింగ్ అనుభవం కారణంగా, కొడగ్ జిల్లాను పూర్తిగా కోవిడ్ నుండి బయటకు తీసుకురావడానికి ఆమె సహాయపడుతోంది. ఆమె కొడగు ప్రజల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందుతోంది.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.
ఇలాంటి వాదనలతో షేర్ చేసిన వీడియోను ట్విట్టర్లో కూడా మేము కనుగొన్నాము.
దర్యాప్తు :
అన్నీస్ కన్మనీ జాయ్ గురించిన సమాచారం కోసం మేము ఇంటర్నెట్లో శోధించినప్పుడు, ప్రభుత్వ వెబ్సైట్లో గుర్తించిన వివరాల ప్రకారం ఆమె కర్ణాటకలోని కొడగు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
షెతీపీపుల్ అనే మహిళల ఛానెల్లోని ఒక కథనం ప్రకారం, ‘ఐఎఎస్ అన్నీస్ కన్మనీ జాయ్ కర్నాటక కొడగులో కోవిడ్ పోరాటానికి నాయకత్వం వహిస్తోంది.’
జాగ్రన్ జోష్ రాసిన ఒక కథనం ప్రకారం, ‘ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నీస్, రెండు సంవత్సరాల కృషి తరువాత 2011 లో యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 65 వ ర్యాంకు సాధించింది. జాయ్ త్రివేండ్రం ప్రభుత్వ వైద్య కళాశాలలో బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసింది.’
మరింత ధృవీకరణ కోసం విశ్వాస్ న్యూస్ కొడగు డిప్యూటీ కమిషనర్ అన్నీస్ కన్మనీ జాయ్‌ను సంప్రదించింది. ది న్యూస్ మినిట్ ప్రచురించిన ఒక కథనాన్ని మాకు షేర్ చేశారు జాయ్. ఆ కథనంలో ఫోటోలను గమనిస్తే, మాకు వైరల్ వీడియోలోని మహిళ జాయ్ కాదని స్పష్టమయ్యింది.
వైరల్ పోస్ట్‌లో షేర్ చేస్తున్న అన్నీస్ గురించిన సమాచారాన్ని మేము ధృవీకరించగలిగినప్పటికీ, వీడియోను కూడా నిర్ధారించుకోవాలని నిర్ణయించుకున్నాము. మేము మొదట వైరల్ వీడియోను ఇన్విడ్ సాధనానికి అప్లోడ్ చేసాము మరియు కీఫ్రేమ్‌లను సేకరించాము. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి మేము వాటిని ఇంటర్నెట్లో శోధించాము.
ఈ వీడియోను యూట్యూబ్ యూజర్ ఎండి ఆదిల్ ఫయాజ్ ఫిబ్రవరి 19వ తేదీన అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.
యూట్యూబ్‌లో ఆమె ప్రొఫైల్ వివరాల కోసం శోధిస్తున్నప్పుడు, వైరల్ వీడియోలో ఉన్న మహిళను సేఫ్షాప్కు చెందిన నాజియా బేగం అని గుర్తించే మరో వీడియోను మేము కనుగొన్నాము.
ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సేఫ్షాప్లో ఆమె సక్సెస్ స్టోరీ గురించి గూగుల్‌లో అనేక ఇతర వీడియోలను కూడా మేము కనుగొన్నాము. కంపెనీలోని ఒక అధికారి, (పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు) వీడియోలో ఉన్న మహిళ వారి సంస్థతో అనుబంధంగా ఉన్న నాజియా బేగం అని మాకు ధృవీకరించారు.
https://www.youtube.com/watch?v=XA-RWYUogiw
వైరల్ వీడియోను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ సోషల్ స్కానింగ్‌లో అతను బెంగళూరులో నివసిస్తున్నాడని, అతని అకౌంట్‌కు 4,913 మంది స్నేహితులు ఉన్నారని గుర్తించడం జరిగింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉంది. వీడియోలో సత్కరించబడిన మహిళ కొడగు డిప్యూటీ కమిషనర్ అన్నీస్ కన్మనీ జాయ్ కాదు. సేఫ్‌షాప్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో ఒక ఉద్యోగి అయిన నాజియా బేగం ఆమె సాధించిన టార్గెట్‌కు సత్కరించబడుతోంది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.