X

వాస్తవ తనిఖీ: ఇది 36 సంవత్సరాలకోసారి వికసించే అరుదైన పుష్పం కాదు

ఈ వాదన అబద్ధమని మేము మా పరిశోధనలో కనుగొన్నాము. వాస్తవానికి ఫోటోలో కనిపిస్తున్నది పుష్పం కాదు, సముద్ర అకశేరుకం.

  • By Vishvas News
  • Updated: December 22, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పెద్ద పువ్వులా కనిపించే ఈ ఫోటోను చాలా మంది షేర్‌ చేసుకుంటున్నారు. ఈ పుష్పం పేరు నాగ్‌పురుష్ అని, ఈ పువ్వు 36 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాలలో వికసిస్తుంది అని వైరల్ పోస్ట్‌లో పేర్కొంటున్నారు.

ఈ దావా అబద్ధమని విశ్వాస్‌ న్యూస్‌ దర్యాప్తులో మేము కనుగొన్నాము. ఫోటోలో కనిపించేది పుష్పం కాదు, సముద్ర అకశేరుకం.

వైరల్‌ అవుతున్నది ఏంటి?
వైరల్ పోస్ట్‌లో ఒక పువ్వు లాంటి ఫోటోను జోడించారు. “హిమాలయాలలో కనిపించే అరుదైన పువ్వు” ఇది హిమాలయ పర్వతాలలో వికసించే నాగపుష్పం. ఇది 36 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుంది, అలాగే శేషనాగు మాదిరిగా కనిపిస్తుంది. దీనిని గమనించిన వాళ్లు వీలైనంత ఎక్కువ మందికి పంపించండి.

ఈ పోస్ట్ కోసం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడండి.

దర్యాప్తు :
ఈ వైరల్ పోస్ట్‌ను పరిశోధించడానికి, మేము ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో శోధించడం జరిగింది. మేము ఈ ఫోటోను pinterest.es లో కనుగొన్నాము. ఈ ఇమేజ్‌కు Sea feather by Gordon B Bowbrick అని క్యాప్షన్‌ ఇచ్చారు.

మేము steemit.com లో ఒక కథనాన్ని కనుగొన్నాము, ఆ కథనంలో ఈ ఫోటోనే కనిపిస్తోంది. దీనిని సీపెన్‌ అని ప్రస్తావించారు. ‘పెనాటులేసియా క్రమానికి చెందిన 300 జాతులలో సీ పెన్ ఒకటి. ఈ ఆంథోజోవా ఒక అకశేరుక సముద్ర జంతువు. ధ్రువ మహాసముద్రం నుండి ఉష్ణమండలం వరకు నిస్సార మరియు లోతైన నీటిలో వీటిని చూడవచ్చు.’ అని ఆ కథనంలో వివరించారు.

ఆ తరువాత, మేము గూగుల్ లో సీ పెన్ అనే కీవర్డ్‌తో శోధించాము. సీ పెన్ పేరుతో పలు ఫోటోలు, చాలా కథనాలను కనుగొనడం జరిగింది.

మరింత ధృవీకరణ కోసం, మేము ఢిల్లీ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ గీతతో మాట్లాడటం జరిగింది. “ఇది ఒక పువ్వు కాదు. నాకు తెలిసినంతవరకు అలాంటి పువ్వు ఏదీ లేదు. నాగ్‌పుష్ప్ అనేది ఒక సంస్కృత పదం, దీని శాస్త్రీయ నామం ‘మెసువా ఫెర్రియా’. ఈ పేరుతో పుష్పం ఏదీ లేదు, కానీ ఇది సతత హరిత చెట్టు.” అని ప్రొఫెసర్‌ గీత చెప్పారు.

ఈ వైరల్‌ పోస్ట్‌ను ‘తేరే మేరే సాప్నే’ అనే ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఈ పేజీకి 6,49,871 మంది ఫాలోవర్లు ఉన్నారు.

निष्कर्ष: ఈ వాదన అబద్ధమని మేము మా పరిశోధనలో కనుగొన్నాము. వాస్తవానికి ఫోటోలో కనిపిస్తున్నది పుష్పం కాదు, సముద్ర అకశేరుకం.

  • Claim Review : హిమాలయాలలో కనిపించే అరుదైన పువ్వు ఇది హిమాలయ పర్వతాలలో వికసించే నాగపుష్పం. ఇది 36 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుంది, అలాగే శేషనాగు మాదిరిగా కనిపిస్తుంది. దీనిని గమనించిన వాళ్లు వీలైనంత ఎక్కువ మందికి పంపించండి
  • Claimed By : ఫేస్‌బుక్ పేజీ : తేరే మేరే సాప్నే
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later