
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ఢిల్లీలో రైతుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో, ఓ మహిళ చేతిలో పెద్ద కర్రతో కోపంతో పోలీసులను ప్రతిఘటిస్తున్న ఫోటో ఇటీవలి నిరసనలకు సంబంధించినదంటూ షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వాదన నకిలీదని కనుగొంది. ఈ వైరల్ ఫోటో ఇంటర్నెట్లో 2016 నుండి వైరల్ క్లెయిమ్‌లతో షేర్ చేయబడుతోంది.
దావా :
హమారా హిందుస్తాన్ ప్యారా సా హిందూస్తాన్ అనే ఫేస్బుక్ పేజిలో పోలీసుల ముందు పెద్ద కర్రతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ ఫోటోను పోస్ట్ చేసి.. ఇది రైతుల నిరసనలోని దృశ్యమంటూ పేర్కొన్నారు.
ఫేస్బుక్ పోస్ట్ ఇక్కడ పరిశీలించవచ్చు.
పోస్ట్ యొక్క అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ఉపయోగించి మేము ఈ ఫోటోను ఇంటర్నెట్లో శోధించాము. ఈ ఫోటోను 10 సెప్టెంబర్ 2016 న హైదరాబాద్ ఫన్నీ క్లబ్ అనే ఫేస్బుక్ పేజీలో ఎటువంటి వివరణ లేకుండా పోస్ట్ చేయడాన్ని గుర్తించాము.
Tiju Thankachan @TijuThankacham అనే ట్విట్టర్ యూజర్ రైతుల నిరసన అనే వాదనతో 4 అక్టోబర్ 2018 న పోస్ట్ చేసిన చేసిన ట్వీట్లో కూడా మేము ఈ ఫోటోను కనుగొన్నాము.
దావాను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ TijuThankachamను సంప్రదించింది. ‘నాకు గుర్తు లేదు, కానీ నేను ఈ ఫోటోను వాట్సాప్‌లో చూసి ట్విట్టర్లో షేర్ చేశాను. నేను ఈ ఫోటోను స్వయంగా తీయలేదు. కానీ, ఈ ఫోటో పాతదని, ఇటీవలి నిరసనలకు సంబంధించినది కాదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.’ అని TijuThankacham చెప్పారు.
సరైన మూలం దొరక్కపోవడం వల్ల ఈ ఫోటో యొక్క సోర్స్‌ను మేము స్వతంత్రంగా గుర్తించే అవకాశం లేదు, కానీ, ఈ ఫోటో ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించినది కాదని మాత్రం మేము నిర్ధారించగలిగాము.
వైరల్ దావాను షేర్ చేసుకున్న ఫేస్బుక్ పేజీ యొక్క సోషల్ స్కానింగ్‌లో దానికి 62,223 మంది ఫాలోవర్లు ఉన్నారని తెలుసుకోవడం జరిగింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ అబద్ధం. ఈ ఫోటో 2016 నుండి విభిన్న వైరల్ దావాలతో ఇంటర్నెట్లో తిరుగుతోంది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.