
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : 2021 జనవరి 1 నుండి గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా చెల్లింపులు చేస్తే 30 శాతం లావాదేవీ ఛార్జీలు విధిస్తారనే వాదనతో వార్తాపత్రిక క్లిప్పింగ్‌తో ఒక వైరల్ పోస్ట్ షేర్ చేయబడింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ యాప్స్ పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు, మరియు నగదు రహిత లావాదేవీలతో పొంచి ఉన్న ముప్పుపై హెచ్చరించారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) 30 శాతం పరిమితిని మాత్రమే ప్రవేశపెట్టిందని, వినియోగదారుల చెల్లింపులకు చార్జీలు వసూలు చేయడం లేదని తెలిసింది.
దావా :
2021 జనవరి 1 నుండి గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే 30శాతం లావాదేవీ ఛార్జీలు వసూలు చేస్తారని ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్‌లో కనిపిస్తోంది. థర్డ్‌పార్టీ ట్రాన్సాక్షన్స్ యాప్స్ ద్వారా నగదు రహిత లావాదేవీల గురించి చాలా మంది యూజర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తాపత్రిక స్నాప్‌షాట్‌ను షేర్ చేసిన సోషల్ మీడియా యూజర్లలో ఫేస్బుక్ యూజర్ Philiphs Jp ఒకరు. ‘30% లావాదేవీ ఛార్జీ? అంటే, 1000 రూపాయలు పంపడానికి 300 రూపాయల అదనపు ఛార్జీ? ఎంత అన్యాయం!’ అని తన పోస్ట్‌లో రైటప్ ఇచ్చారు.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
యుపిఐ, 30 శాతం వంటి కీలక పదాలను ఉపయోగించి వార్తల కోసం మేము ఇంటర్నెట్లో శోధించాము. నవంబర్ 7వ తేదీన దైనిక్ జాగరణ్‌లో ప్రచురించబడిన ఒక కథనంలో ఇలా పేర్కొన్నారు. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 1 నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లపై 30 శాతం పరిమితి విధించాలని నిర్ణయించింది. థర్డ్ పార్టీ యాప్‌ల గుత్తాధిపత్యాన్ని నియంత్రించడానికి ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.’
30 శాతం పరిమితి గురించి ఆ వ్యాసంలో మరింత వివరంగా రాశారు. ‘దీని అర్థం వచ్చే ఏడాది నుండి ప్రతి నెలా దేశంలో 200 కోట్ల యుపిఐ లావాదేవీలు జరిగితే, దానిలో ముప్పై శాతం అంటే 60 కోట్ల లావాదేవీలు ఒక నెలలో ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్లోనైనా జరగవచ్చు.’
అయితే, వైరల్ దావాలో పేర్కొన్నట్లుగా 30 శాతం లావాదేవీ ఛార్జీల గురించి మాకు ఎటువంటి వార్తా కథనాలు కనిపించలేదు.
భారతదేశంలో ధృఢమైన చెల్లింపు మరియు పరిష్కార మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 లోని నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) యొక్క చొరవతో.. భారతదేశంలో రిటైల్ చెల్లింపులు మరియు పరిష్కార వ్యవస్థలను నిర్వహించే గొడుగు సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) వెబ్సైట్లో నోటిఫికేషన్ కోసం మేము శోధించాము. నవంబర్ 5వ తేదీ నాడు వెలువరించిన పత్రికా ప్రకటనను మేము కనుగొన్నాము. ‘యుపిఐ నెలకు 2 బిలియన్ల లావాదేవీలకు చేరుకోవడంతో మరియు భవిష్యత్ వృద్ధికి అవకాశం ఉన్నందున, యుపిఐలో ప్రాసెస్ చేయబడిన మొత్తం లావాదేవీలలో 30% పరిమితిని జారీ చేసింది, ఇది అన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్ల ప్రొవైడర్లకు (TPAPs) వర్తిస్తుంది. ఇది జనవరి 1, 2021 నుండి అమలులోకి వస్తుంది. ఇది నష్టాలను పరిష్కరించడానికి మరియు యుపిఐ పర్యావరణ వ్యవస్థను మరింతగా పెంచడానికి సహాయపడుతుంది.’
విశ్వాస్ న్యూస్ ధృవీకరణ కోసం ఇమెయిల్ ద్వారా ఎన్సిపిఐని సంప్రదించింది. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న వైరల్ వాదనలను ఖండిస్తూ, వినియోగదారులు చేసే లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయబడవని, 30 శాతం పరిమితిని మాత్రమే ప్రవేశపెట్టారని ఎన్సిపిఐ స్పష్టం చేసింది.
వైరల్ దావాను షేర్ చేసిన యూజర్ యొక్క సోషల్ స్కానింగ్‌లో అతను తమిళనాడులోని సేలం నివాసి అని, మరియు ఫేస్బుక్లో 3,788 మంది ఫాలోవర్లు ఉన్నారని తేలింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ అబద్ధం. యుపిఐ చెల్లింపులకు 30 శాతం లావాదేవీ ఛార్జీలు విధించడం లేదు. ఎన్పిసిఐ 30 శాతం పరిమితిని మాత్రమే ప్రవేశపెట్టింది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.