
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): ఎలాంటి రీచార్జ్ చేయకుండానే ఏ మొబైల్ నెట్‌వర్క్‌లో అయినా 60 రోజుల పాటు ఉచితంగా 50 జీబీ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తిరుగుతోంది. ఈ పోస్ట్‌లో ఒక లింక్‌ను జోడించారు. ఫ్రీ ఇంటర్నెట్ సదుపాయం పొందాలంటే ఆ లింక్‌పై క్లిక్ చేయాలని అడుగుతున్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ మెస్సేజ్ నకిలీదని కనుగొంది.
దావా :
వాస్తవ తనిఖీ కోసం విశ్వాస్ న్యూస్‌కు దాని వాట్సాప్ చాట్‌బాక్స్‌లో ఓ మెస్సేజ్ వచ్చింది. ఈ మెస్సేజ్ సోషల్ మీడియాలో ఇలా సర్క్యులేట్ అవుతోందట : ఏ రీఛార్జ్ లేకుండా 50 జీబీ ఇంటర్నెట్ డేటా. ఏ మొబైల్ నెట్‌వర్క్‌లోనైనా 50 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటాను 60 రోజుల పాటు పొందండి. ఇప్పుడే పొందండి. https://payuplay.in/free50gb?ref=x1JtftV2b.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ పరిశీలించవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ ఈ అంశంపై తన దర్యాప్తును ప్రారంభించింది. అనేక ఇతర ఆన్లైన్ మోసాల మాదిరిగా కాకుండా, ఇంటర్నెట్ డేటాను ఇస్తామనే వైరల్ మెస్సేజ్ వినియోగదారు యొక్క మొబైల్ నెట్‌వర్క్‌ను గుర్తించలేదని కనుగొంది.
ఇంకా, వైరల్ పోస్ట్‌లో ఇచ్చిన URL ఏ సర్వీసు ప్రొవైడర్ల యొక్క అధికారిక వెబ్సైట్ కాదు.
ఒకే టెక్స్ట్ మరియు విభిన్న లింక్‌లతో కూడిన ఇలాంటి పోస్ట్.. ఫేస్బుక్లో ప్రసారం అవుతోందని మేము కనుగొన్నాము. మేము యాక్టివ్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసి పలు అంశాలు గుర్తించాము. వారికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ఎక్కువ మంది వినియోగదారులు సందర్శించేలా ఆకర్షించేందుకు నకిలీ సమీక్షలు మరియు వినియోగదారుల కామెంట్లను వాళ్లే రూపొందిస్తున్నట్లు అర్థమయ్యింది.
దర్యాప్తు తదుపరి దశలో భాగంగా సైబర్ సెక్యూరిటీ నిపుణుడిని సంప్రదించడం జరిగింది.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (ఐఐసిఎస్)కు చెందిన సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ జితేందర్ నరులా ఇలా చెప్పారు: ‘సోషల్ మీడియాలో ఏదైనా లింక్ పై క్లిక్ చేసేటప్పుడు యూజర్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని హ్యాక్ చేయడానికి సులభమైన మార్గం లాభదాయకమైన ఆఫర్లతో హానికరమైన లింక్‌ను పంపడం. ఇది ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్, ఇక్కడ వినియోగదారులు పోస్ట్ చదవడానికి మరియు వైరస్ కలిగి ఉన్న లింక్‌పై క్లిక్ చేయడానికి లాభదాయకమైన ఆఫర్ల ద్వారా రెచ్చగొట్టబడతారు. లింక్ క్లిక్ చేసిన తర్వాత, వైరస్ వినియోగదారు మొబైల్ లేదా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడుతుంది.’
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (ఐఐసిఎస్) నిపుణులు వైరల్ పోస్ట్‌లో ఇచ్చిన యుఆర్ఎల్ను పరిశోధించారు, మరియు ఈ క్రింది స్క్రీన్‌షాట్‌లో ఇచ్చినట్లుగా ‘payuplay.in’ వెబ్సైట్ ప్రస్తుతం పనిచేయడం లేదని కనుగొన్నారు. అంతేకాకుండా, సైబర్ పరిశోధకుల నుండి తమను తాము రక్షించుకోవడానికి, మాల్వేర్ నడుపుతున్న చాలా వెబ్సైట్లు ఉపయోగంలో లేనప్పుడు వాటిని నిలిపేసినట్లు గతంలో కనిపించింది.
సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, జితేందర్ నరులా ఆన్లైన్ వినియోగదారుల డిజిటల్ భద్రత కోసం కొన్ని దశలను సూచించారు.
ఏయే చర్యలు తీసుకోవాలి :
ఈ పోస్ట్‌ను ఫేస్బుక్లో ‘ఆర్ ఎండనా విద్యాలయ’ అనే పేజీలో షేర్ చేశారు. మేము పేజీని నిశితంగా పరిశీలించినప్పుడు, ఈ పేజీకి ఇప్పటి వరకు 11 మంది ఫాలోవర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.
निष्कर्ष: 100 జిబి ఇంటర్నెట్ & రూ .500 టాక్‌టైమ్ ఉచితం అంటూ వాగ్దానం చేసే వైరల్ మెస్సేజ్‌లు బూటకపు వెబ్సైట్లకు దారి మళ్లించబడుతున్నాయని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు కనుగొనడం జరిగింది. సైబర్ భద్రతా నిపుణులు ఈ వైరల్ దావాను ఖండించారు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.