వాస్తవ తనిఖీ : వరద, బురదకు సంబంధించిన ఈ ఫోటోలు తెలంగాణకు చెందినవి కావు. వైరల్ పోస్ట్ అబద్ధం.
తెలంగాణలో వరదల కారణంగా కార్లు, ఆటోలు కొట్టుకుపోయాయని, బురదలో వాహనాలు కూరుకుపోయాయని సోషల్ మీడియాలో తిరుగుతున్న వైరల్ పోస్టులు అబద్ధమని విశ్వాస్‌న్యూస్ దర్యాప్తులో తేలింది. ఆ ఫోటోలు రాజస్తాన్‌లోని జైపూర్‌లో వర్షాలు, వరదలకు సంబంధించినవి.
- By Vishvas News
- Updated: August 20, 2020

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : తెలంగాణ వ్యాప్తంగా వాట్సప్ గ్రూపుల్లో కొన్ని ఫోటోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూడగానే బాధ కలిగించేలా ఉన్నాయి. కొన్నికార్లు, ఆటోలు వరదలకు కొట్టుకొచ్చి కుప్పలుగా పడి ఉన్నాయి. అలాగే.. వాహనాలు బురదలో సగానికిపైగా కూరుకుపోయాయి. ఇవి తెలంగాణలో దృశ్యాలంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఈ వాదన అబద్ధమని విశ్వాస్‌న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. వాస్తవానికి ఇవి రాజస్తాన్‌లో వరద తాకిడి దృశ్యాలు.
వైరల్ అవుతున్నది ఏంటి ?
‘ఈ ఫోటోలు తెలంగాణలో భారీ వర్షాలు, వరదల తీవ్రతకు నిదర్శనం. వర్షాలు కురిసిన సమయంలో వరదలో ఇలా కార్లు, ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. వర్షం తగ్గిన తర్వాత ఇలా బురదలో కూరుకుపోయాయి.’ అంటూ వాట్సప్‌లో వైరల్ అవుతున్నాయి.
దర్యాప్తు :
ఈ ఫోటోలు నిజంగానే తెలంగాణలో తీసినవేనా ? అన్న విషయం తెలుసుకునేందుకు విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా.. వాట్సప్‌లో వైరల్ అవుతోన్న ఫోటోలను ఒక్కొక్కటిగా తనిఖీ చేశాము. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆధారంగా ఆ ఫోటోలు ఎక్కడివో తెలుసుకున్నాం.
మొదటి ఫోటో :

వరద నీటికి కొట్టుకు వచ్చిన వాహనాల ఫోటోకు సంబంధించి మొదటగా విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. ఆ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా.. చాలా రిజల్ట్స్ వచ్చాయి. chave weather – daily videos అనే ఓ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోను కనుగొనడం జరిగింది. అది రాజస్తాన్ వరదలకు సంబంధించిన వీడియో. వైరల్ అవుతున్న ఫోటో ఆ వీడియోలో ఒకచోట కనిపించింది, ఆ వీడియో లింక్ ఇక్కడ చూడొచ్చు.

అలాగే రెండో ఫోటోను విశ్వాస్‌న్యూస్ ప్రత్యేకంగా శోధించింది.
రెండవ ఫోటో :

బురదలో ఆటోలు పూర్తిగా కూరుకుపోయిన ఫోటో రెండవది. కేవలం ఆటో పైభాగం మాత్రమే కనిపిస్తోంది. ఆ ఫోటోను కూడా గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా శోధించాము. ఈ ఫోటో కూడా పై వీడియో లింక్‌లో కనిపించింది.

ఏబీపీ లైవ్ వెబ్సైట్ గ్యాలరీలో కూడా ఈ ఫోటో కనిపించింది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఆ వెబ్‌పేజీని చూడవచ్చు. ‘రాజస్తాన్‌లోని జైపూర్‌లో భారీ వర్షాల కారణంగా విధ్వంకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాహనాలు బురదలో కూరుకుపోయాయి’ అని ఆ ఫోటో ఫీచర్లో పేర్కొన్నారు.
ఈ వైరల్ అవుతున్న ఫోటోలు ఆగస్టు 14వ తేదీన జైపూర్‌లో భారీ వర్షాలు కురిసిన తరువాత తీసినవి అని నయీదునియా జైపూర్ సీనియర్ కరస్పాండెంట్ మనీష్ గోదా మాకు ధృవీకరించారు.
తెలంగాణకు చెందిన ఓ న్యూస్ వెబ్‌పోర్టల్‌లో ఒక ఫోటోను వాడుకున్నారు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయనే వార్తకు ఈ ఫోటోను చేర్చారు. ఆ వెబ్‌పోర్టల్‌కు సంబంధించిన లింక్ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. తర్వాత ఆ లింకులోనుంచి ఈ ఫోటోను తొలగించారు.

निष्कर्ष: తెలంగాణలో వరదల కారణంగా కార్లు, ఆటోలు కొట్టుకుపోయాయని, బురదలో వాహనాలు కూరుకుపోయాయని సోషల్ మీడియాలో తిరుగుతున్న వైరల్ పోస్టులు అబద్ధమని విశ్వాస్‌న్యూస్ దర్యాప్తులో తేలింది. ఆ ఫోటోలు రాజస్తాన్‌లోని జైపూర్‌లో వర్షాలు, వరదలకు సంబంధించినవి.
- Claim Review : ఈ ఫోటోలు తెలంగాణలో భారీ వర్షాలు, వరదల తీవ్రతకు నిదర్శనం.
- Claimed By : వాట్సప్ యూజర్
- Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
-
Whatsapp 9205270923
-
Telegram 9205270923
-
Email-Id contact@vishvasnews.com