X

తక్షణ వాస్తవ తనిఖీ: చైనాలో 20 వేల మంది కరోనా రోగులను చంపడానికి కోర్టు అనుమతి కోరారన్న ఈ పోస్ట్ అబద్ధం

  • By Vishvas News
  • Updated: October 14, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మళ్ళీ వైరల్ అవుతోంది. 20,000 మంది కరోనా సోకిన రోగులను చంపడానికి చైనా.. కోర్టు అనుమతి కోరినట్లు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వాదనపై విశ్వాస్ న్యూస్ ఇప్పటికే దర్యాప్తు చేసింది. మా దర్యాప్తులో ఈ వాదన పూర్తిగా నకిలీదని కనుగొనబడింది.

వైరల్‌ అవుతున్నది ఏంటి?
విశ్వాస్ న్యూస్ తన ఫ్యాక్ట్ చెకింగ్ వాట్సాప్ చాట్‌బాట్ (+91 95992 99372) లో ఫ్యాక్ట్ చెక్ కోసం ఈ వైరల్ దావాను అందుకుంది. ఒక వార్తా కథనం యొక్క స్క్రీన్ షాట్ మాదిరిగా కనిపించే ఒక పోస్ట్‌లో, “వైరస్ వ్యాప్తిని నివారించడానికి 20,000 మందికి పైగా కరోనా రోగులను చంపేందుకు చైనా.. కోర్టు అనుమతి కోరింది.”

దర్యాప్తు :
సిటీ న్యూస్ అనే వెబ్‌సైట్ నుంచి ఈ వైరల్‌ పోస్ట్‌ తీసుకున్నట్లు దర్యాప్తులో విశ్వాస్ న్యూస్ కనుగొంది. ఈ కథనం అంతా వ్యాకరణ తప్పిదాలతో ఉంది. ఈ వెబ్‌సైట్ గతంలో జంక్ న్యూస్‌ను ప్రచురించింది.

ఈ వైరల్ దావాను సింగపూర్ ప్రభుత్వం నకిలీ అని పేర్కొంది. అలాంటి నిర్ణయం తీసుకోవలసి వస్తే, అది ‘ది సుప్రీం పీపుల్స్ కోర్ట్ ఆఫ్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. అయితే, అలాంటిదేమీ అక్కడ ప్రస్తావించబడలేదని విశ్వాస్‌న్యూస్‌ తెలుసుకుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెబ్‌సైట్‌లో కూడా ఇటువంటి నివేదిక గురించి ప్రస్తావించలేదు.

ఈ వైరల్ దావాను విశ్వాస్‌ న్యూస్ ఇప్పటికే దర్యాప్తు చేసింది. ఆ వాస్తవ తనిఖీకి సంబంధించిన స్టోరీ క్రింద చూడవచ్చు:

చైనాలోని బీజింగ్‌కు చెందిన గ్లోబల్ టైమ్స్ ఫారిన్‌ ఎడిటర్‌ షమీమ్‌ జాకీరా విశ్వాస్ న్యూస్‌తో మాట్లాడుతూ ‘ఈ వార్త ఆన్‌లైన్‌లో తిరుగుతోంది. ఇది పూర్తిగా నకిలీ. పరిస్థితి భయంకరంగా ఉన్నప్పటికీ, జీవితం సాధారణ స్థితికి చేరుకుంటుంది. నేను చెప్పేదేమిటంటే, ప్రభుత్వం వ్యాప్తిని అరికట్టడానికి అన్ని ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. ప్రజలు ఇలాంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేయకూడదు.’ అని చెప్పారు.

निष्कर्ष: చైనాలో 20 వేలకు పైగా కరోనా రోగులను చంపడానికి కోర్టు అనుమతి కోరినట్లు పేర్కొంటూ వైరల్‌ అవుతున్న పోస్ట్ అబద్ధం.

  • Claim Review : 20,000 మంది కరోనా సోకిన రోగులను చంపడానికి చైనా.. కోర్టు నుండి అనుమతి కోరింది.
  • Claimed By : వాట్సాప్ యూజర్
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later