Fact Check: పాకిస్తాన్ లో అన్న తన తోబుట్టువైన చెల్లిని పెళ్ళి చేసుకున్నాడు అని క్లెయిమ్ చేసే పోస్ట్ నకిలీది
పెళ్ళైన ఒక జంట ఫోటో ఒకటి, కరాచి, పాకిస్తాన్ లో ఒక అన్న తన తోబుట్టువైన చెల్లిని పెళ్ళి చేసుకున్నాడు అని క్లెయిమ్ చేస్తూ, సోషల్ మీడియాపై విస్తృతంగా తిరుగుతోంది.
- By: Umam Noor
- Published: Jan 30, 2025 at 05:27 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): పెళ్ళైన ఒక జంట ఫోటో ఒకటి, కరాచి, పాకిస్తాన్ లో ఒక అన్న తన తోబుట్టువైన చెల్లిని పెళ్ళి చేసుకున్నాడు అని క్లెయిమ్ చేస్తూ, సోషల్ మీడియాపై విస్తృతంగా తిరుగుతోంది. పాకిస్తాన్ యొక్క ఏఆర్వై న్యూస్ ఛానల్ ఈ వార్తను రిపోర్ట్ చేసిందని వైరల్ పోస్ట్ ఆరోపిస్తోంది.
అయతే, ఈ క్లెయిమ్ పూర్తిగా అసత్యమని విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తు ధృవీకరించింది. ఈ ఫోటో టెక్సస్, యూఎస్ఏ లో జరిగిన ఒక వివాహము నుండి తీసుకోబడింది. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆ జంటకు కుటుంబ సంబంధం ఏది లేదు మరియు వారిద్దరు తోబుట్టువులనే క్లెయిమ్ నిరాధారమైనది. అంతేకాకుండా, ఏఆర్వై న్యూస్ ఇలాంటి కథనం ఏది రిపోర్ట్ చేయలేదు.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ యూజర్ ‘దీపక్ సి జరివాలా’ ఈ శీర్షికతో వైరల్ చిత్రాన్ని షేర్ చేశారు, “కరాచి, పాకిస్తాన్ లో, మా వర్గములో ఏదైనా అనుమతించబడుతుంది అని పేర్కొంటూ, ఒక అన్న తన సొంత తోబుట్టువును పెళ్ళిచేసుకొని అందరిని ఆశ్చర్యపరచారు: ఏఆర్వై.”
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
ఈ క్లెయిమ్ యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, ఆరోపించబడిన సంఘటన ఎక్కడైనా పేర్కొనబడిందా అని తెలుసుకొనుటకు మేము ఏఆర్వై న్యూస్ వెబ్సైట్ మరియు అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ను సెర్చ్ చేయడముతో ప్రారంభించాము. అయితే, మా సెర్చ్ లో ఎలాంటి ఫలితాలు లభించలేదు – ఏఆర్వై న్యూస్ ఇటువంటి కథనం ఏదీ ప్రచురించలేదు లేదా ప్రసారం చేయలేదు.
తరువాత, మేము వైరల్ ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయటానికి గూగుల్ లెన్స్ ఉపయోగించాము. ఇది మమ్మల్ని ‘బ్రైడ్ ఆఫ్ నార్త్ టెక్సస్’ వెబ్సైట్, పై ఒక వ్యాసానికి దారి చూపించింది. ఇందులో టెక్సస్ లో జరిగిన సంప్రదాయిక పాకిస్తాని ముస్లిం వివాహము యొక్క వివరాలు పేర్కొనబడ్డాయి. లైలా మరియు ఆలీగా గుర్తించబడిన ఫోటోలో ఉన్న జంట, పరస్పర స్నేహితుల ద్వారా కలుసుకున్నారు.
ఈ వ్యాసం , వివాహ చిత్రాల కొరకు ‘తారా ఆర్సెవెన్ ఫోటోగ్రఫీ’ ను ప్రశంసిస్తుంది. తారా ఆర్సెవెన్ ఫోటోగ్రఫీ కొరకు ఆన్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు ఇది మాకు ఫేస్బుక్ పేజ్ మరియు ఇన్స్టాగ్రాం అకౌంట్ దారి చూపింది.
ఇదే చిత్రాలు మార్చ్ 27, 2021 నాడు మూడు సంబంధిత ఇన్స్టాగ్రాం పోస్ట్స్ తో కలిపి ఫేస్బుక్ పేజ్ పై పోస్ట్ చేయబడ్డాయి. అదనంగా, తారా ఆర్సెవెన్ యొక్క బ్లాగ్ లో జంట మరియు వారి కుటుంబాల చిత్రాలను చూపిస్తూ వివాహము గురించిన వ్యాసం ఉంది.
తదుపరి ధృవీకరణ కొరకు, మేము ఈమెయిల్ ద్వారా తారా ఆర్సెవెన్ ను సంప్రదించాము మరియు వైరల్ పోస్ట్ ను షేర్ చేశాము. స్పందనగా మాకు ఈ సమాచారం అందింది, “ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్ళు కాదు. ఈ క్లెయిమ్ పూర్తిగా కల్పితము.”
మేము ఏఆర్వై న్యూస్ యొక్క దర్యాప్తు విభాగాధిపతి నదీం అష్రఫ్ భాట్ ను కూడా సంప్రదించాము. వైరల్ పోస్ట్ ను సమీక్షించిన తరువాత, ఆయన ఇలా పేర్కొన్నారు, “ఏఆర్వై ఇలాంటి నిరాధారమైన పోస్ట్ లేదా వార్త ఏది పోస్ట్ చేయలేదు. ఇది పూర్తిగా నకిలీది.”
చివరిగా, నకిలీ పోస్ట్ ను షేర్ చేసిన వ్యక్తి ‘దీపక్ సి జరివాలా’ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ను సమీక్షించాము. ఈ అకౌంట్ నుండి నిర్దిష్ట భావజాల పక్షపాతముతో తరచూ పోస్ట్స్ షేర్ చేసిందని వెల్లడి అయింది.
ముగింపు: విశ్వాస్ న్యూస్ జరిపిన దర్యాప్తులో వైరల్ ఫోటోలో ఉన్న జంట, కరాచి, పాకిస్తాన్ లో వివాహం చేసుకున్న తోబుట్టువులు కాదు అని తేలింది. ఈ చిత్రము టెక్సస్, యూఎస్ఏ లో నిర్వహించబడిన సంప్రదాయిక పాకిస్తాని వివాహము నుండి తీసుకోబడింది మరియు ఈ జంటకు ఎలాంటి కుటుంబ సంబంధం లేదు. అంతేకాకుండా, ఏఆర్వై న్యూస్ ఇలాంటి కథనం ఏది రిపోర్ట్ చేయలేదు. ఈ వైరల్ క్లెయిమ్ పూర్తిగా నకిలీది మరియు తప్పుదోవపట్టించుటకు ఉద్దేశించబడింది.
- Claim Review : కరాచిలో, ఒక అన్న తన సొంత చెల్లెలిని వివాహం చేసుకున్నాడు.
- Claimed By : ఫేస్బుక్ యూజర్ ‘దీపక్ సి జరివాలా’
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.











