X
X

Fact Check: దిల్జిత్ దోసాంజ్ యొక్క పాత వీడియో ‘సర్దార్ జి 3’ వివాదానికి తన ప్రతిస్పందన అని తప్పుదోవపట్టించే విధంగా షేర్ చేయబడుతోంది

ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. దిల్జిత్ వీడియో 2021లో అతను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నుండి తీసుకోబడింది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). దిల్జిత్ దోసాంజ్ చిత్రము ‘సర్దార్ జి 3’ లో పాకిస్తాని నటి హానియా ఆమీర్ నటించడము చుట్టూ పెరుగుతున్న వివాదము నేపథ్యములో, సోషల్ మీడియాపై ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ క్లిప్ లో, తనకు బాలీవుడ్ లో పని లభిస్తుందా లేదా అనేది తాను పట్టించుకోనని మరియు బాలీవుడ్ లో పనిచేయడంలో తనకు ఆసక్తి లేదని దిల్జిత్ చెప్పడం వినవచ్చు.  ఇది ఇటీవలి సర్దార్ జి 3 వివాదముపై అతని స్పందన అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. దిల్జిత్ వీడియో 2021లో అతను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నుండి తీసుకోబడింది.

ఏది వైరల్ అవుతోంది?

ఫేస్‎బుక్ యూజర్ ట్రోల్ ఇండియన్ పాలిటిక్స్ ఈ వైరల్ వీడియోను జూన్ 26, 2025 నాడు ఈ విధమైన క్లెయిమ్ తో షేర్ చేశారు, “బాలీవుడ్ అసోసియేషన్స్ దిల్జిత్ దోసాంజ్ పై బ్యాన్ విధిస్తామని బెదిరించారు. దీనికి స్పందనగా, తాను బాలీవుడ్ గురించి పట్టించుకోనని దిల్జిత్ అన్నారు. బాలివుడ్ లో పనిచేయడములో ఆసక్తి లేదు – పరిశ్రమ ఒత్తిడి వలన తాను నిరుత్సాహపడనని మరియు తాను సరైనది అని భావించిన దానిని చేస్తానని అని స్పష్టం చేశారు.”

పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

వైరల్ వీడియోను ధృవీకరించుటకు, మేము వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ పై సెర్చ్ చేశాము. ఈ వీడియో మాకు ఫిల్మ్ కంపానియన్ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్ పై సెప్టెంబర్ 20, 2021 నాడు అప్లోడ్ చేయబడినదిగా లభించింది. ఈ వీడియోలో, వైరల్ అయిన భాగము ప్రారంభములో టీజర్ లో మరియు పూర్తి ఇంటర్వ్యూ యొక్క 25-నిమిషాల మార్క్ వద్ద కనిపించింది. ఈ వీడియోలో, దిల్జిత్ చిత్రాల షూటింగ్ సమయములో అతని వైఖరి గురించిన ప్రశ్నకు సమాధానంగా స్పందించారు, మరే ఇతర వివాదానికి కాదు.

కీవర్డ్స్ తో సెర్చ్ చేసినప్పుడు, మాకు  ఫిల్మ్‎ఫేర్ వెబ్సైట్ పై సెప్టెంబర్ 20, 2021 నాడు ప్రచురించబడిన అతని ఇంటర్వ్యూ గురించి ఒక వార్తా నివేదిక మాకు కనిపించింది.

ఈ అంశముపై మరింత సమాచారము కొరకు మేము దైనిక్ జాగరణ్ కొరకు మనోరంజక విభాగాన్ని కవర్ చేసే విలేఖరి స్మిత శ్రీవాత్సవను కలిసాము. ఆమె ఈ క్లిప్ 2021లో అనుపమ చోప్రతో దిల్జిత్ ఇంటర్వ్యూ నుండి తీసుకోబడినది అని మాకు చెప్పారు.

సర్దార్ జి 3’ వివాదము ఏమిటి?

‘సర్జార్ జి 3’ లో దిల్జిత్ దోసాంజీ ప్రక్కన పాకిస్తాని నటి హానియా ఆమీర్ నటించడం గురించి భారతదేశములో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. ఇది ప్రధాన వివాదానికి కారణం అయింది. ఇటీవల బిబిసి కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్జిత్, ఈ చిత్రము సరిహద్దు వాతావరణము స్థిరంగా ఉన్నప్పుడు ఫిబ్రవరి 2025లో చిత్రీకరించబడిందని స్పష్టం చేశారు.

https://youtu.be/ccFM156whLY

చివరిగా, మేము ఒక అసత్యపు క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన ఫేస్‎బుక్ పేజ్ ట్రోల్ ఇండియన్ పాలిటిక్స్ యొక్క అకౌంట్ ను స్కాన్ చేశాము. ఈ పేజ్ కు సుమారు 3 లక్షలమంది యూజర్లు ఉన్నారని మేము కనుగొన్నాము.

ముగింపు: దిల్జిత్ దోసాంజ్ యొక్క వైరల్ వీడియో ‘సర్దార్ జి 3’ వివాదానికి ఇటీవలి ప్రతిస్పందన అని ఆరోపిస్తూ చేయబడిన వైరల్ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వీడియో 2021లో జరిగిన ఒక ఇంటర్య్వూ నుండి తీసుకోబడింది.

  • Claim Review : సర్దార్ జి 3 వివాదానికి స్పందనగా, దిల్జిత్ తాను బాలీవుడ్ గురించి పట్టించుకోనని, బాలీవుడ్ లో పనిచేయడములో తనకు ఆసక్తి లేదని అన్నారు.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ట్రోల్ ఇండియన్ పాలిటిక్స్
  • Fact Check : False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later