X

వాస్తవ తనిఖీ: ఈ చెయ్యి ఆకారంలోని చెట్టు UK లోని వేల్స్‌లో ఉంది. కాశ్మీర్‌లో కాదు.

వైరల్‌ ఫోటోలో ఉన్న చేతి ఆకారంలోని చెట్టు UK లోని వేల్స్‌లో ఉంది. కాశ్మీర్‌లో కాదు.

  • By Vishvas News
  • Updated: October 12, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్‌) : ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇందులో చెట్టు కాండాన్ని చెయ్యి ఆకారంలో చెక్కారు. ఈ చెట్టు కాశ్మీర్‌లోని డోగ్రిపోరాలో ఉన్నట్లు పేర్కొన్నారు.

వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేదని విశ్వాస్ న్యూస్ కనుగొంది. ఈ ఫోటో నిజమైనదే కానీ, చెయ్యి ఆకారంలో చెక్కబడిన కాండం ఉన్న ఈ చెట్టు కాశ్మీర్‌లో లేదు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్‌లో ఉంది.

వైరల్ అవుతున్నది ఏంటి ?
ఈ పోస్ట్‌ను ‘Kashmir News’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో, చేతి ఆకారంలో ఉన్న ఒక చెట్టు కనిపిస్తుంది. ఈ పోస్ట్‌తో పాటు ఆంగ్లంలో రైటప్‌ ఇచ్చారు. ‘ఈ చెక్కిన చెట్టు ఉత్తర కాశ్మీర్‌లోని డోగ్రిపోరా’.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు

దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయంతో వైరల్ అవుతున్న ఈ ఫోటోను శోధించింది, 9GAG వెబ్‌సైట్‌లోని ఒక కథనంలో ఈ ఫోటోను మేము కనుగొన్నాము. ఇంగ్లీష్‌లో రాసిన ఈ కథనానికి హెడ్‌లైన్‌ చూస్తే, ‘సైమన్ ఒరురాక్ చేత చెక్కబడిన ది జెయింట్ హ్యాండ్ ఆఫ్ వైరన్వే – 50 అడుగులు లేదా దాదాపు 15.5 మీటర్లు’

కీలక పదాల సహాయంతో గూగుల్‌ ప్లాట్‌ఫామ్‌పై శోధించినప్పుడు, బిబిసిలో ఈ చెట్టు గురించిన ఒక కథనాన్ని కూడా మేము కనుగొన్నాము, దీనిలో వైరల్ చిత్రం ఉపయోగించారు. ఈ కథనం ప్రకారం, ఈ ఫోటో UK లోని ఎత్తైన చెట్టు యొక్క అవశేషాలను చూపిస్తుంది. తుఫాను సమయంలో ఈ చెట్టు విరిగింది, మిగిలిన కాండాన్ని పెద్ద చేతి ఆకారంలో చెక్కారు. ఈ చెట్టును రాక్స్‌హామ్‌కు చెందిన 33 ఏళ్ల ఆర్టిస్ట్ సైమన్ ఒరురాక్ చెక్కారు.

మేము ఈ చెట్టు గురించి మరింత శోధించినప్పుడు, ఆర్టిస్ట్ సైమన్ ఒరురాక్ వెబ్‌సైట్‌లో దానికి సంబంధించిన ఫోటోలను కనుగొన్నాము.

ఆర్టిస్ట్ సైమన్ ఒరురాక్‌ను మేము ఇమెయిల్ ద్వారా సంప్రదించాము, చెట్టుకు చెయ్యి మాదిరిగా కళాకృతి ఇచ్చినట్లు సైమన్‌ చెప్పారు. ఆ చెట్టు UK లోని వేల్స్‌లో ఉందని ఆయన ధృవీకరించాడు.

ఈ పోస్ట్‌ను “Kashmir News” అనే ఫేస్‌బుక్‌లో పేజీ షేర్ చేశారు. మేము ఈ పేజీని స్కాన్ చేసినప్పుడు, ఈ పేజీకి 57,331 మంది ఫాలోవర్లు ఉన్నారని గుర్తించడం జరిగింది.

निष्कर्ष: వైరల్‌ ఫోటోలో ఉన్న చేతి ఆకారంలోని చెట్టు UK లోని వేల్స్‌లో ఉంది. కాశ్మీర్‌లో కాదు.

  • Claim Review : చెయ్యి ఆకారంలో చెక్కిన చెట్టు కాశ్మీర్‌లో ఉంది.
  • Claimed By : FB page: Kashmir News
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later