X

వాస్తవ తనిఖీ: నెట్‌ఫ్లిక్స్ పేరిట వైరల్ అవుతున్న ఇ-మెయిల్‌ను నమ్మకండి

  • By Vishvas News
  • Updated: October 14, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్‌) : విశ్వాస్ న్యూస్ వాట్సాప్ చాట్ బాట్‌లో ఫ్యాక్ట్ చెక్ కోసం ఒక సందేశాన్ని అందుకుంది, ఇందులో ఇమెయిల్ యొక్క స్క్రీన్ షాట్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ నుండి ఈ ఇ-మెయిల్ పంపించినట్లు అభ్యర్థించారు. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు ఈ లింక్‌పై క్లిక్ చేసి చెల్లింపు వివరాలను అప్‌డేట్‌ చేయాలని కోరింది.

వైరల్ ఇ-మెయిల్ వాస్తవానికి ఫిషింగ్ స్కామ్ అని విశ్వాస్ న్యూస్ కనుగొంది.

వైరల్‌ పోస్ట్‌లో ఏముంది?
విశ్వాస్‌ న్యూస్ చాట్‌బాట్‌లో కనిపించే ఈ స్క్రీన్‌షాట్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇ-మెయిల్ చేయబడిందని పేర్కొన్నారు. దీనికి ఆంగ్లంలో రైటప్‌ రాశారు. ‘మీ ప్రస్తుత బిల్లింగ్‌ ఇన్ఫర్మేషన్‌తో సమస్య ఉంది. మేము దీన్ని మళ్ళీ చూడటానికి ప్రయత్నిస్తాము, దయచేసి మీ చెల్లింపు వివరాలను అప్డేట్‌ చేయండి.’ అని ఆ వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

దర్యాప్తు :
ఈ మెస్సేజ్‌ 2017 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నట్లు విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ 2018 డిసెంబర్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన విడుదల చేసిన నివేదిక పేరు – ‘నెట్‌ఫ్లిక్స్ ఫిషింగ్ స్కామ్: డోంట్ టేక్ ది బెట్‌’.

ఇది ఇలా పేర్కొంది: “స్కామర్లు తరచుగా తెలిసిన కంపెనీ పేర్లను ఉపయోగిస్తారు లేదా మీకు తెలిసిన వ్యక్తిగా నటిస్తారు. నెట్‌ఫ్లిక్స్ ఉన్న వాస్తవ ప్రపంచ ఉదాహరణ ఇక్కడ ఉంది. ఒహియోలోని పోలీసులు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించిన ఫిషింగ్ ఇమెయిల్ యొక్క స్క్రీన్ షాట్‌ను పంచుకున్నారు.

స్కామర్లు ఇలాంటి ప్రసిద్ధ సంస్థల పేర్లు లేదా తెలిసిన కంపెనీల పేర్లను ఉపయోగించుకొని మోసం చేస్తారని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ సందర్భంలో నెట్‌ఫ్లిక్స్ పేరు ఉపయోగించారు. ఒహియో పోలీసులు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించిన ఫిషింగ్ ఇమెయిల్ యొక్క స్క్రీన్ షాట్‌ను షేర్‌ చేశారు. ‘మీ ప్రస్తుత బిల్లింగ్ సమాచారంతో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. అందుకే మీ అకౌంట్‌ నలిపివేశాం, మీ చెల్లింపు వివరాలు అప్‌డేట్‌ చేయడానికి ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి’ అని ఆ స్క్రీన్‌షాట్‌లో కూడా పేర్కొన్నార.

వాస్తవ తనిఖీ కోసం విశ్వాస్ న్యూస్ అందుకున్న స్క్రీన్ షాట్‌నే ఈ నివేదికలో కూడా ఉపయోగించారు.

నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌లో మేము మరింత శోధించాము మరియు ‘Phishing or suspicious emails or texts claiming to be from Netflix’ అనే నివేదిక నుంచి మరింత సమాచారాన్ని కనుగొన్నాము:

‘మీ నెట్‌ఫ్లిక్స్ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ లేదా చెల్లింపు పద్ధతిని అప్‌డేట్‌ చేయాలని అభ్యర్థిస్తూ మీకు ఇమెయిల్ లేదా టెక్స్ట్ మెస్సేజ్‌ (SMS) వచ్చిందా? అలా అయితే, అది బహుశా మా నుండి రాలేదు.’ అని ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆ రిపోర్ట్‌లో ఇంకా ఇలా పేర్కొన్నారు. : ‘లింక్‌లలో దేనినైనా క్లిక్ చేయవద్దు లేదంటే ఏదైనా అటాచ్‌మెంట్‌ను phishing@netflix.com కు ఇ-మెయిల్‌ ద్వారా పంపించండి’.

విశ్వాస్ న్యూస్ నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌లో చాట్ సపోర్ట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులను సంప్రదించింది. నెట్‌ఫ్లిక్స్ కస్టమర్ కేర్ సపోర్ట్ నుండి సంధ్య మాతో మాట్లాడారు. వైరల్ అయిన ఇమెయిల్ వాస్తవం కాదని చెప్పారు. ఇది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ప్రారంభించిన ఫిషింగ్ స్కామ్ అని తెలిపారు.

‘support@snaprides.co.za’ అనే ఇ-మెయిల్‌ నుంచి మెయిల్‌ వచ్చింది. ఈ వివరాలు తెలుసుకున్న సంధ్య దీనిపై వ్యాఖ్యానిస్తూ ఇది ఒక స్కామ్ అని, దానిపై మేము చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

निष्कर्ष: నెట్‌ఫ్లిక్స్‌లో చెల్లింపు వివరాలను అప్‌డేట్‌ చేయాలంటూ వచ్చిన వైరల్‌ మెస్సేజ్‌ ఇ-మెయిల్‌ ద్వారా చేస్తున్న ఒక స్కామ్.. ఇది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడింది.

  • Claim Review : నెట్‌ఫ్లిక్స్‌లో మీ అకౌంట్‌తో సమస్య ఉంది. మెయిల్‌లో ఇచ్చిన లింక్ ఓపెన్‌ చేసి మీ చెల్లింపు వివరాలు అప్‌డేట్‌ చేసుకోండి.
  • Claimed By : Whatsapp users
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later