X

వాస్తవ తనిఖీ: తన తండ్రి అంత్యక్రియలలో అఖిలేష్ యాదవ్ బూట్లు ధరించినట్లు ఉన్న వైరల్ ఫోటో తప్పుదోవపట్టించేది

  • By Vishvas News
  • Updated: October 28, 2022

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సమాజ్‎వాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ అక్టోబరు 10, 2022 నాడు మరణించారు, మరియు అక్టోబరు11 ఆయన అంత్యక్రియలు ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఇప్పుడు, అఖిలేష్ యాదవ్ హిందూ ఆచారాలు మరియు సంప్రదాయాలకు వ్యతిరేకంగా చితికి నిప్పు పెట్టే సమయములో బూట్లు ధరించారు అని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. సమాజ్‎వాది పార్టి జాతీయ నాయకుడు పవిత్ర దారాన్ని (జంధ్యము) తన కోటుపైన మరియు తన తలపై టోపీని ధరించారని కూడా ఈ పోస్ట్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

అయితే, మొత్తం కార్యక్రమములో ఆయన నల్లని సాక్స్ ధరించినట్లుగా కనిపిస్తూ ఉండడముతో విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్స్ తప్పుదోవపట్టించేవి అని కనుగొనింది. అంత్యక్రియల సమయములో అఖిలేష్ తన టోపీని ధరించినప్పటికీ, అతని నల్లని సాక్స్ చూసి భూట్లు అని తప్పుగా భావించారు.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ అనిల్ భాస్కర్ ఇలా పేర్కొనబడిన ఒక పోస్ట్ ను షేర్ చేశారు: తన తండ్రి అంత్యక్రియల సమయములో తన బూట్లు తీయని, లేదా తన కోటు తీయని లేదా తన టోపీని కూడా తీయకుండా తన జాకెట్ పై ఒక దారాన్ని వేసుకొని ఒక పెద్ద నాయకుడు అయిన ఇలాంటి కొడుకును శత్రువుకు కూడా భగవంతుడు ఇవ్వకూడదు. ఇతను ఒక ఆశలేని కుమారుడు, శత్రువుకు కూడా భగవంతుడు ఇలాంటి కొడుకును ఇవ్వకూడదు. మిత్రులారా, తన కడుపున పుట్టిన కొడుకు అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించనప్పుడు ఎంఎల్‎ఏ, ఎంపి, మంత్రి లేదా ముఖ్యమంత్రి అయి కోట్లు సంపాదించి ఉపయోగం ఏమిటి?”

ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు:

గూగుల్ రివర్స్ సెర్చ్ ఇమేజ్ ద్వారా విశ్వాస్ న్యూస్ The QuintAmarujala మరియు ABP యొక్క వివిధ లింక్స్ కు చేరుకుంది. ఈ లింక్స్ అన్నిటిలో ములాయం సింగ్ యాదవ్ కు తమ నివాళులు అర్పించేందుకు వెళ్ళిన ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. అయితే, అక్కడ అఖిలేష్ యొక్క పాదాలు కనిపించలేదు. జూమ్ ఇన్ చేసిన తరువాత, మాకు బూట్లు కనిపించలేదు కాని సాక్స్ మాదిరిగా కనిపించే ఒక నల్లని బట్టతో కవర్ చేయబడిన పాదము గమనించబడింది.

అమరుజాల

ది క్వింట్

ఏబిపి

తరువాత, మేము అఖిలేష్ యాదవ్ అంత్యక్రియలను నల్లని సాక్స్ తో నిర్వహించే చిత్రాలను షేర్ చేసిన సమాజ్‎వాది పార్టీ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కూడా స్కాన్ చేశాము.

విశ్వాస్ న్యూస్ సంప్రదించినప్పుడు, సమాజ్‎వాది పార్టి యొక్క మహారాష్ట్ర రాష్ట్ర శాఖ యొక్క ప్రెసిడెంట్, అబు అసీం అజ్మి ఇలా అన్నారు, “కార్యక్రమము జరిగినప్పుడు నేణు అఖిలేష్ గారి వెంట ఉన్నాను. ఆయన బూట్లు ధరించలేదు, నల్లని సాక్స్ ధరించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లెయిమ్ నకిలీది.”

ఆయన మాకు ఒక చిత్రాన్ని కూడా షేర్ చేశారు, ఇందులో అంత్యక్రియలు నిర్వహిస్తున్న అఖిలేష్ యాదవ్ వెంట ఉన్న అతనిని చూడవచ్చు.

ఈ విధంగా, తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించే సమయములో అఖిలేష్ యాదవ్ బూట్లు ధరించడం గురించి ఉన్న వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని స్పష్టం అవుతోంది.

సోషల్ స్కానింగ్ చేసినప్పుడు, వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ హరిద్వార్ కు చెందిన వారని, ఆయనకు ఫేస్‎బుక్ పై 221 ఫాలోయర్స్ ఉన్నారు అని మేము కనుగొన్నాము.

ముగింపు: తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించే సమయములో అఖిలేష్ యాదవ్ బూట్లు ధరించారు అని క్లెయిమ్ చేసే సోషల్ మీడియా పోస్ట్ తప్పుదోవపట్టించేది; ఆయన కార్యక్రమము సమయములో నల్లని సాక్స్ ధరించారు బూట్లు కాదు. అంత్యక్రియల సమయములో అఖిలేష్ పార్టీ టోపి ధరించినప్పటికీ, అతని నల్లని సాక్స్ బూట్లుగా పొరపాటుబడ్డారు.

  • Claim Review : తన తండ్రి అంత్యక్రియల సమయములో అఖిలేష్ యాదవ్ బూట్లు ధరించారు
  • Claimed By : ఎఫ్‎బి యూజర్ అనిల్ భాస్కర్
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later