X

వాస్తవ తనిఖీ: సింగర్ ప్రదీప్ మౌర్య ఒసామా బిన్ లాడెన్ కుమార్తెను వివాహం చేసుకోలేదు, వైరల్ దావా అబద్ధం

  • By Vishvas News
  • Updated: October 8, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : భోజ్‌పురి నటుడు, గాయకుడు ప్రదీప్ మౌర్య ఒసామా బిన్ లాడెన్ కుమార్తె జోయాను వివాహం చేసుకున్నట్లు ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని వెల్లడయ్యింది. క్లిప్పింగ్‌లో ఉన్న మహిళ సిరా యూసుఫ్, పాకిస్తాన్ నటి. అంతేకాకుండా బిన్‌లాడెన్‌ కుటుంబం గురించి పరిశోధిస్తే ‘జోయా’ అనే కుమార్తె గురించిన బహిరంగ రికార్డుల వివరాలేవీ మాకు దొరకలేదు.

దావా :
ఫేస్‌బుక్ యూజర్ హిందూ మహేంద్ర గోసావి ‘మోడీ ఫర్ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ ఆన్ రామ్ జన్మభూమి’ అనే పబ్లిక్‌ గ్రూపులో ఒక వార్తా క్లిప్పింగ్ పోస్ట్ చేశాడు, ‘ఒసామా బిన్ లాడెన్ కుమార్తె #హిందూ_ధర్మంలోకి మారిపోయింది. ఆమె ఆర్య సమాజ్‌లో ఒక హిందూ అబ్బాయిని వివాహం చేసుకుంది’.

వైరల్ పోస్ట్ ఇక్కడ చూడవచ్చు.

వైరల్‌ పోస్ట్‌కు సంబంధించిన ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
ఒసామా బిన్ లాడెన్ కుమార్తె పేరు జోయా అని తెలుసుకోవడానికి మేము ఇంటర్నెట్‌లో శోధించాము. ఈ క్రమంలో మేము సిఎన్ఎన్ వెబ్‌సైట్‌లో లాడెన్ కుటుంబం గురించిన సమాచారాన్ని కనుగొన్నాము. అయితే, ఆ కథనంలో జోయా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, అంటే.. ఈ పేరు కల్పితమని మాకు స్పష్టమయ్యింది.

దర్యాప్తు తరువాతి దశలో భాగంగా, ప్రదీప్ మౌర్య అనే కీవర్డ్‌ని టైప్ చేసి గూగుల్‌లో శోధించాము. అతని వీడియోలు చాలా యూట్యూబ్‌ ఛానెళ్లలో కనిపించాయి. అయితే, గోరఖ్‌పూర్ ఫిల్మ్ సిటీ అనే యూట్యూబ్ ఛానెల్‌లో మాత్రం అతని వీడియోలు అధికంగా కనిపించాయి.

మౌర్య ఆ ఛానెల్‌ యజమాని అని తెలుసుకున్న మేము… ఆ ఛానెల్‌లో అందించిన కాంటాక్ట్‌ డిటైల్స్‌ ద్వారా అతనితో కనెక్ట్ అయ్యాం. 2018 లో తాను వివాహం చేసుకున్నానని, వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు జోయా ఎవరో తనకు తెలియదని మౌర్య విశ్వాస్‌ న్యూస్‌తో చెప్పారు.

ఆ తర్వాత.. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి వార్తాపత్రిక క్లిప్పింగ్‌లో ప్రచురించిన ఫోటో కోసం శోధించడం జరిగింది. ఆక్రమంలో మేము ఉర్దూ పాయింట్ అనే వెబ్‌సైట్‌లో ఆ మహిళ ఫోటో కనుగొన్నాము. ఈ చిత్రంలో ఉన్న మహిళ పాకిస్తాన్ నటి సైరా యూసుఫ్ అని ధృవీకరణ అయ్యింది.

అదేవిధంగా, మేము ఆ పురుషుడి ఫోటో కోసం కూడా శోధించడం జరిగింది. ఆ శోధనలో ఫోటోను ప్రదీప్ మౌర్య ఫేస్‌బుక్‌ పేజీలో కనుగొన్నాము.

1 మార్చి 2014 న అప్‌లోడ్ చేసిన ఫిల్మ్ సిటీ గోరఖ్‌పూర్ అనే బ్లాగులో కూడా ఈ ఫోటో కనిపించింది.

ఈ దర్యాప్తులో వైరల్‌ అవుతున్న వార్తాపత్రిక క్లిప్పింగ్‌లోని ఫోటో ఎడిటింగ్‌ చేసినట్లు మేము నిర్ధారించడం జరిగింది.

వైరల్ దావాను పోస్ట్ చేసిన ఫేస్‌బుక్‌ యూజర్ మహేంద్ర గోసావి అకౌంట్‌ను సోషల్ స్కానింగ్‌ చేయడంతో, ఆ అకౌంట్‌ నిర్వహిస్తున్న గోసావి గుజరాత్‌లోని సూరత్‌కు చెందినవాడని తెలుసుకున్నాము.

निष्कर्ष: వైరల్ పోస్ట్ నకిలీ. తన గురించి సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్న పోస్టులు, జరుగుతున్న ప్రచారాన్ని ప్రదీప్ మౌర్య ఖండించారు.

  • Claim Review : భారతీయ సింగర్ ప్రదీప్ మౌర్య ఒసామా బిన్ లాడెన్ కుమార్తె జోయాను వివాహం చేసుకున్నారు.
  • Claimed By : ఫేస్‌బుక్‌ యూజర్ మహేంద్ర గోసావి
  • Fact Check : False
False
    Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

సంబంధిత వ్యాసాలు

Post saved! You can read it later