
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అందులోనూ ప్రత్యేకంగా పంజాబ్, హర్యానాల్లో నిరసనలు ఉధృతరూపం దాల్చాయి.
ఈ నేపథ్యంలోనే ఓ ఫోటో సోషల్మ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ జవాను ఒక వృద్ధుడివైపు తుపాకీ గురిపెట్టిన ఫోటో అది. ఇటీవల వ్యవసాయ సంస్కరణ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో ఈ దృశ్యం చోటు చేసుకుందని వైరల్ పోస్టులో పేర్కొన్నారు. అయితే.. విశ్వాస్ న్యూస్ వాస్తవ తనిఖీలో ఈ ఫోటో మీరట్‌లోని ఖేరాలో తీసిన పాత ఫోటో అని, 2013లో ఈ ఫోటో తీసినట్లు గుర్తించడం జరిగింది.
దావా:
ఎండి షమీమ్ అష్రాఫ్ అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో సెప్టెంబర్ 21వ తేదీన ఈపోస్ట్ షేర్ చేశారు. ‘పంజాబ్, హర్యానా సహా ఇతర రాష్ట్రాలలో #కిసాన్ ఆందోళన్ కొనసాగుతోంది. యూనిఫామ్ వేసుకున్న పోలీసును చూడండి, వృద్ధుడైన రైతు పట్ల అతని వైఖరి.. రైతుల యొక్క స్ఫూర్తిని రెట్టింపు చేస్తుంది. పోలీస్ యూనిఫామ్ ఇలా అయిపోయింది, యూపీలోని జామియా, జెఎన్యూలో సీఏఏ నిరసనల్లో దారుణాలు చూశాం. దేశాన్ని నాగపూర్ నడిపిస్తోంది. ప్రభుత్వం కాదు.” అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్‌ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు:
వ్యవసాయ సంస్కరణల బిల్లులను రాజ్యసభ ఆమోదించిన తరువాత, ముఖ్యంగా హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో రైతుల నుండి దేశం నిరసనలను చవిచూసింది. అప్పటి నుండి ఈ ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై విస్తృతంగా షేర్ చేయబడుతోంది, ఇటీవలి రైతుల నిరసనల్లో ఈ ఫోటో తీసినట్లు కామెంట్ జోడిస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ మొదటగా ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది.
‘బింగ్’ సెర్చింజన్ ఉపయోగించి.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం జరిగింది.
‘ద పయనీర్‘ వెబ్సైట్లో విశ్వాస్ న్యూస్ ఈ చిత్రాన్ని కనుగొంది. ‘సోమ్‌పై ఎన్ఎస్ఏ చెంపదెబ్బకు నిరసనగా మీరట్ విస్ఫోటనం చెందుతుంది’ అనే హెడ్‌లైన్‌తో కూడిన కథనంలో ఈ చిత్రాన్ని ఉపయోగించారు. 30 సెప్టెంబర్, 2013 న లక్నో డేట్లైన్ నుండి ఈ వార్త ఫైల్ చేశారు.
‘ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెబ్సైట్లో కూడా విశ్వాస్ న్యూస్ ఇదే ఫోటోను కనుగొంది. ‘నిషేధిత మహాపాంచాయతీలో పోలీసులతో జరిగిన ఘర్షణలతో మీరట్‌లో విస్ఫోటనం, ఆరుగురికి గాయాలు’అనే వార్తా కథనాన్ని 30 సెప్టెంబర్ 2013 న ఫైల్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఫోటో ఈ కథనంలో ఉంది. ‘ఖేరాలో ఆదివారం జరిగిన ఘర్షణల సమయంలో ఒక భద్రతా అధికారి ఒక గ్రామస్తుడికి గురిపెట్టాడు. – పిటిఐ’ ఇది పిటిఐ ఫోటో అని ప్రస్తావించారు.
ఖేరా (ఖేడా) గ్రామ ప్రధాన్ ఓమ్బీర్ సింగ్, విశ్వాస్ న్యూస్‌తో మాట్లాడుతూ, ‘ఇది పంచాయతీ సందర్భంగా క్లిక్ మనిపించిన చిత్రం మరియు ఖేరా గ్రామంలో కావల్ కాండ్ తర్వాత 2013 సంవత్సరంలో తీసిన ఫోటో ఇది. సహారాన్పూర్ ప్రజలు కూడా పంచాయతీని సందర్శించారు. పంచాయతీ నిర్వహించడానికి పోలీసులు అనుమతించలేదు, అందువల్ల రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది.’ అని చెప్పారు.
దైనిక్ జాగరణ్ మీరట్ చీఫ్ రిపోర్టర్, రవి ప్రకాష్ తివారీ విశ్వాస్ న్యూస్‌తో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటో వాస్తవానికి 2013 లో, మీరట్‌లోని సదర్ తహశీల్‌కు చెందిన ఖేరా గ్రామంలో తీసినదని అన్నారు. గ్రామ ప్రజలు పంచాయతీ నిర్వహించాలని కోరుకున్నారు, కానీ వారికి అధికారులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ వారు ఇప్పటికీ పంచాయతీలు నిర్వహిస్తుంటారు. ఈ పరిణామమే అప్పుడు పోలీసులతో ఘర్షణకు దారితీసిందని అని చెప్పారు.
దైనిక్ జాగరణ్ లక్నో ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ అశుతోష్ శుక్లా కూడా ఈ ఫోటోను 29 సెప్టెంబర్ 2013 న తీశారని, 30 సెప్టెంబర్ 2013 న ప్రచురించారని ధృవీకరించారు. ఈ ఫోటోను పిటిఐ వార్తా సంస్థ విడుదల చేసింది. 30 సెప్టెంబర్ 2013 న ఈ ఉద్రిక్త వార్తలను ప్రచురించిన దైనిక్ జాగరణ్ యొక్క ఎడిషన్ పేజీని కూడా ఆయన షేర్ చేసుకున్నారు.
విశ్వాస్ న్యూస్.. తప్పుడు దావాతో ఈ ఫోటోను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ యొక్క సామాజిక నేపథ్య తనిఖీ చేసింది. ఈ యూజర్ ఎండి షమీమ్ అష్రాఫ్ డిసెంబర్ 2014 న ట్విట్టర్లో తన ఖాతాప్రారంభించాడు. 73 మందిని ఆయన ఫాలో అవుతున్నాడు. ఈ అకౌంట్‌కు 11 మంది ఫాలోవర్లు ఉన్నారు. తాను ఒక సామాజిక కార్యకర్తనంటూ తన బయోలో పేర్కొన్నాడు.
निष्कर्ष: ఇటీవలి రైతుల నిరసనల్లో తీసినట్లుగా షేర్ చేసుకుంటున్న ఫోటో పాతది, మరియు మీరట్‌లోని ఖేరాలో 2013 సంవత్సరంలో తీసింది.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.