X

వాస్తవ తనిఖీ: ఊర్మిళ మతోండ్కర్ మోహన్ భగవత్ మేనకోడలు కాదు, వైరల్ క్లెయిం తప్పుదోవపట్టించేది

విశ్వాస్ న్యూస్ విచారణ చేసినప్పుడు, ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని మేము కనుగొన్నాము. ఊర్మిళ భర్త పేరు మొహ్‎సిన్ అక్తర్ అనేది వాస్తవమే కాని ఊర్మిళ మోహన్ భగవత్ బంధువు అనేది పూర్తిగా అసత్యము

  • By Vishvas News
  • Updated: August 15, 2021

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): నటి ఊర్మిల మతోండ్కర్ మరియు ఆమె భర్త మొహ్‎సిన్ అక్తర్ గురించిన ఒక నకిలీ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము ముఖ్యులు అయిన మోహన్ భగవత్ మేనకోడలే ఊర్మిళ అని ప్రజలు అంటున్నారు. విశ్వాస్ న్యూస్ విచారణ చేసినప్పుడు, ఈ పోస్ట్ తప్పుదోవ పట్టించేది అని కనుగొనింది. ఊర్మిళ భర్త పేరు మొహ్‎సిన్ అక్తర్ అనేది వాస్తవమే కాని ఊర్మిళ మోహన్ భగవత్ బంధువు అనేది పూర్తిగా అసత్యము.

క్లెయిం

ఫేస్‎బుక్ యూజర్ సోను బుద్ధ్ జులై 25, 2021 నాడు ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు మరియు ఈ విధంగా వ్రాశారు, “మోహన్ భగవత్ గారు..మీ మేనకోడలు ఒక ముస్లింను పెళ్ళి చేసుకున్నప్పుడు హిందూమతం ఎందుకు ప్రమాదంలో పడలేదు..?”

ఫేస్‎బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

విచారణ

చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి శోధించడము ద్వారా విశ్వాస్ న్యూస్ తన విచారణను ముందుగా ప్రారంభించింది. ఈ వైరల్ చిత్రము మే 25, 2016న ఇండియన్ ఎక్స్‎ప్రెస్ వెబ్సైట్ లో ప్రచురించబడింది అని మేము కనుగొన్నాము. దాని గురించి ఇక్కడ చదవవచ్చు.

అలాగే, మార్చ్ 6, 2016 నాడు Jagran.com పై ప్రచురించబడిన వార్తలు బాలివుడ్ నటీమణి ఊర్మిళ మతోండ్కర్ కాశ్మీర్ వ్యాపారవేత్త మరియు వృత్తిరీత్యా మాడల్ అయిన మొహ్‎సిన్ అక్తర్ మీర్ ను పెళ్ళి చేసుకుందని వెల్లడించాయి. పూర్తి వార్తలను ఇక్కడ చదవండి.

విశ్వాస్ న్యూస్ నేరుగా ఊర్మిళ మతోండ్కర్ ను సంప్రదించింది. ఆమె మాతో ఇలా అన్నారు, “నాకు, మోహన్ భగవత్ గారికి ఏ విధమైన బంధుత్వము లేదు. నా భర్త ఒక ముస్లిం మరియు నేను ఒక హిందువు”

అలాగే విశ్వాస్ న్యూస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని కూడా సంప్రదించింది. ఊర్మిళ మతోండ్కర్ మోహన్ భగవత్ గారి మేనకోడలు కాదు అని సంఘము యొక్క కో-ప్రమోషనల్ చీఫ్ నరేంద్ర కుమార్ మాతో చెప్పారు.

వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ సోను బుద్ధ్ యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేశాము. ఈ యూజర్ ఈ ఖాతాను సెప్టెంబర్ 2013లో ప్రారంభించారు అని మేము కనుగొన్నాము.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ విచారణ చేసినప్పుడు, ఈ పోస్ట్ తప్పుదోవపట్టించేది అని మేము కనుగొన్నాము. ఊర్మిళ భర్త పేరు మొహ్‎సిన్ అక్తర్ అనేది వాస్తవమే కాని ఊర్మిళ మోహన్ భగవత్ బంధువు అనేది పూర్తిగా అసత్యము

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later