
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ముఖేష్ అంబానీ పేరిట ఉన్న నకిలీ ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లర్లకు పాల్పడిన వాళ్ల ఆస్తులను అటాచ్ చేయడంతో పాటు, పదేళ్లపాటు వారికి ఓటు హక్కును రద్దు చేయాలని ముఖేష్ అంబానీ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని ట్వీట్లో రైటప్ ఇచ్చారు. ఫేస్బుక్ నుండి ట్విట్టర్ దాకా యూజర్లు ఇది నిజమే అనుకొని.. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ నకిలీదని తేలింది. ముఖేష్ అంబానీ మరియు అతని కుటుంబసభ్యులెవరూ సోషల్ మీడియాలో లేరు. ముఖేష్ పేరిట అవుతున్న వైరల్ ట్వీట్ నకిలీ.
వైరల్ అవుతున్నది ఏంటి ?
ఫేస్బుక్ యూజర్ తేజ్ బహదూర్ సింగ్ ఆగస్టు 17వ తేదీన నకిలీ ట్వీట్ యొక్క స్క్రీన్‌షాట్‌ను అప్లోడ్ చేసి ఇలా రాశారు : ‘సరైన విషయం ఏమిటంటే, అల్లర్ల వల్ల జరిగిన నష్టాన్ని ఆ అల్లర్లకు పాల్పడిన వాళ్ల నుంచే వసూలు చేయాలి, మరియు వారి ఓటు హక్కును 10 సంవత్సరాలు నిలిపివేయాలి.’
ఈ పోస్ట్‌లో ముఖేష్ అంబానీ పేరిట నకిలీ ట్వీట్ ఉంది. దానిపై ఇలా రాశారు: ‘అల్లర్లకు పాల్పడిన వాళ్ల ఆస్తులను అటాచ్ చేయడంతో పాటు 10 సంవత్సరాల ఓటింగ్ హక్కులను కూడా నిలిపివేయాలని నేను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. తద్వారా ఓటు హక్కును ఎవరూ దుర్వినియోగం చేయలేరు’.
వైరల్ పోస్ట్ యొక్క లింక్ ఇక్కడ చూడండి.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడండి.
దర్యాప్తు :
వైరల్పోస్ట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్‌ను విశ్వాస్ న్యూస్ మొదట దర్యాప్తు చేసింది, ఈ పేరుతోనే పోస్ట్ వైరల్ అవుతోంది. @Thejioindia అనే ఈ ట్విట్టర్ హ్యాండిల్ జూలై 2020లో క్రియేట్ చేశారు. ఇది ముఖేష్ అంబానీ పేరు మీద నకిలీ ట్విట్టర్ హ్యాండిల్. ఈ ట్విట్టర్ అకౌంట్‌కు 17 వేలకు పైగా ఫాలో అవుతున్నారు.
ఈ హ్యాండిల్లో, ఇలాంటి ట్వీట్లు చాలా ఉన్నాయి. వాటిని చదువుతుంటే నకిలీవిగా అనిపిస్తున్నాయ. ఆ పోస్టులు గమనిస్తే హిందీలో చాలా తప్పులు ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది వెరిఫైడ్ అకౌంట్ కాదు. లేకపోతే నీలిరంగు టిక్ అకౌంట్ ముందు కనిపిస్తుంది.
దర్యాప్తు తదుపరి దశలో, మేము రిలయన్స్ కంపెనీ అధికారులను సంప్రదించాము. ముఖేష్ అంబానీ మరియు అతని కుటుంబ సభ్యులెవరూ సోషల్ మీడియాలో లేరని కంపెనీ ప్రతినిధి మాకు చెప్పారు. ఆయన పేరు మీద సృష్టించిన ఖాతాలన్నీ నకిలీవి.
ఈ నకిలీ పోస్ట్‌ను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ అకౌంట్‌ను సోషల్ స్కానింగ్ చేయడానికి అటువైపు మలుపు తిరిగింది. తేజ్‌బహదూర్ సింగ్ అనే ఈ ఖాతాను 22 మంది ఫాలో అవుతున్నారు మరియు ఖాతాలో రాసిన పరిచయం ప్రకారం, ఈయూజర్ వారణాసికి చెందిన వ్యక్తి.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీ అని బట్టబయలయ్యింది. ముఖేష్ అంబానీకి ఆయన పేరు మీద సోషల్ మీడియా అకౌంట్ లేదు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.