X

వాస్తవ తనిఖీ: ఆర్బీఐ 100 రూపాయలు, 10 రూపాయలు మరియు 5 రూపాయల పాత నోట్లను తిరిగి తీసుకోవడము లేదు, ఈ వైరల్ పోస్ట్ వాస్తవం కాదు.

ముగింపు: ఆర్బీఐ 100 రూపాయలు, 10 రూపాయలు మరియు 5 రూపాయల పాత నోట్ల సర్క్యులేషన్ ను నిలిపివేయడము లేదు. వైరల్ పోస్ట్ నకిలీది.

  • By Vishvas News
  • Updated: February 25, 2021

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది, దీని ప్రకారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్చ్ తరువాత 100 రూపాయలు, 10 రూపాయలు మరియు 5 రూపాయల పాత నోట్లను మార్కెట్ నుండి వెనక్కు తీసుకోవడం ప్రారంభిస్తుంది.

విశ్వాస్ న్యూస్ వారు చేసిన తనిఖీలలో వైరల్ అయిన పోస్ట్ అవాస్తవమైనది అని తెలిసింది. ఆర్బీఐ ప్రస్తుతానికి ఇలాంటి నిర్ణయము ఏదీ తీసుకోలేదు.

వైరల్ పోస్ట్ లో ఏముంది?

5 రూపాయలు, 100 రూపాయలు మరియు 10 రూపాయల పాత నోట్లను భాగస్వామ్యం చేస్తూ ఫేస్బుక్ యూజర్ Khidmati Safar చేసిన పోస్ట్ లో ఆంగ్లములో వ్రాసారు. దీని తెలుగు అనువాదం: మార్చ్ తరువాత 100 రూపాయలు, 10 రూపాయలు మరియు 5 రూపాయల పాత నోట్ల సర్క్యులేషన్ నిలిచిపోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది.

వైరల్ పోస్ట్ యొక్క ఆర్చిడ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు ప్రారంభించి ముందుగా ఇంటర్నెట్ పై కీ వర్డ్స్ సహాయముతో దీని గురించి శోధించింది. మాకు కొన్ని మీడియా రిపోర్ట్స్ లభించాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం మంగళూరులో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క సమావేశములో పాల్గొన్న ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బీ. మహేష్ గారు రాబోయే మార్చ్ ఏప్రిల్ నుండి ఆర̷్బీఐ 100 రూపాయల పాత నోట్ల సర్క్యులేషన్ ను నిలిపివేయాలని ఆలోచిస్తోందని చెప్పారు.

దీని తరువాతనే సోషన్ మీడియాలో ఇటువంటి పోస్ట్ ను వైరల్ అయ్యాయి.

2018వ సంవత్సరములో ఆర్బీఐ పర్పుల్ రంగులో ఉండే 100 రూపాయల నోటును ప్రవేశపెడుతూ, ఇప్పటికే మార్కెట్లో సర్క్యులేషన్ లో ఉన్న పాత 100 రూపాయల నోట్లు కూడా చట్టబద్ధంగా ఉంటాయని తెలిపింది. ఆర్బీఐ యొక్క ప్రకటనను మీరు ఇక్కడ చూడవచ్చు.

మరింత సమాచారము కొరకు మేము ఆర్బీఐ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క చీఫ్ జనరల్ మేనేజర్, యోగేష్ దయాళ్ గారి పీ.ఏ. తో మాట్లాడాము. వైరల్ పోస్ట్ నకిలీది అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆర̷్బీఐ ఇలాంటి మార్గదర్శకాలు ఏవీ ఇవ్వలేదు. ఈ విషయం గురించి ట్వీట్ చేస్తూ ఆర̷్బీఐ ఈ విధంగా స్పష్టీకరించింది, ప్రస్తుతానికి ఆర్బీఐ 100 రూపాయలు, 10 రూపాయలు మరియు 5 రూపాయల పాత నోట్లను వెనక్కు తీసుకోవడం లేదు. వైరల్ పోస్ట్ అవాస్తవమైనది.

ఆర్బీఐ యొక్క ట్వీట్ ను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇప్పుడు ఫేస్బుక్ పై ఇటువంటి పోస్ట్ ను పోస్ట్ చేసిన యూజర్ Khidmati Safar గురించి తెలుసుకోవాలి. మేము యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేసినప్పుడు ఈ వార్త పోస్ట్ చేసినప్పటికి యూజర్ కు 46815 ఫాలోయర్స్ ఉన్నారు అని తెలుసుకున్నాము.

निष्कर्ष: ముగింపు: ఆర్బీఐ 100 రూపాయలు, 10 రూపాయలు మరియు 5 రూపాయల పాత నోట్ల సర్క్యులేషన్ ను నిలిపివేయడము లేదు. వైరల్ పోస్ట్ నకిలీది.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later