
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : ప్రతి పౌరుడికి ప్రభుత్వం రూ.7,500 ఉచిత సహాయ నిధిని అందిస్తోందని పేర్కొంటున్న ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫండ్ పొందటానికి వివరాలు నమోదు చేయాల్సిన లింక్‌ను కూడా ఆ పోస్ట్‌కు జతచేశారు.
విశ్వాస్ వాట్సప్ చాట్‌బాట్ (+91 95992 99372) లో వాస్తవ తనిఖీ కోసం మేము ఈ వైరల్ దావాను అందుకున్నాము.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. వైరల్ దావాలో ఉన్నట్లుగా ప్రతి పౌరుడికి ప్రభుత్వం రూ. 7,500 ఇవ్వడం లేదు.
వైరల్ అవుతున్నది ఏంటి :
‘సలీమ్ అల్దా మొహమ్మద్ సలీమ్’ అనే ఫేస్బుక్ యూజర్.. వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనే పేజీలో ఈ వైరల్ పోస్టును షేర్ చేశాడు. ‘ప్రభుత్వం చివరకు ఆమోదించింది, మరియు ప్రతి పౌరుడికి ఉచితంగా రూ .7,500 రిలీఫ్ ఫండ్‌ను ఇవ్వడం ప్రారంభించింది. నేను ఇప్పుడే అందుకున్నాను. మీరు కూడా కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఆడబ్బులు ఎలా పొందవచ్చో తెలుసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరు. ఇది పరిమిత సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి త్వరపడండి https://funds4covid-19.com/.’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
వైరల్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ చేసిన వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
ఈ దావా గురించిన ప్రామాణికమైన వార్తా కథనాల కోసం మేము ఇంటర్నెట్లో శోధించాము. అయితే, ప్రభుత్వ ఆర్డర్ కాపీ గానీ, లేదా మీడియా కథనాలను గానీ కనుగొనలేకపోయాము. అయితే, ఏప్రిల్‌లో ప్రచురించిన కొన్ని మీడియా వార్తలను మేము కనుగొన్నాము, దాని ప్రకారం అన్ని జన్‌ధన్ ఖాతాలకు రూ .7,500 బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
మేఘాలయ పోలీసు వెబ్సైట్లో https://megpolice.gov.in/rumours-circulated-social-media-fg-has-finally-approved-and-have-started-giving-out-free-rs-7500 దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కనిపించింది. ఈ పుకారును నమ్మవద్దని మేఘాలయ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.
మేము వైరల్ పోస్ట్‌తో పాటు షేర్ చేసిన https://funds4covid-19.com/ లింక్‌పై క్లిక్ చేసాము. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాము. రూ. 7,500 పొందడానికి 7 వాట్సాప్ గ్రూపులలో ఈ సందేశాన్ని షేర్ చేయాలని ఆ లింక్‌లో కోరారు. అయితే.. చాలామంది ఇది నకిలీ అంటూ చేసిన కామెంట్లను మేము గమనించడం జరిగింది.
మేము ఈ సందేశాన్ని వాళ్లు చెప్పినట్టు 7 వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశాము. ఆ తర్వాత ఒక కొత్త డైలాగ్బాక్స్ ఓపెన్ అయ్యింది. దానిలో iqbroker.com అనే వెబ్సైట్ గురించిన సమాచారం వచ్చింది. అంటే.. ఈ లింక్ ఈ వెబ్సైట్ ప్రమోషన్ కోసమే సర్క్యులేట్ చేస్తున్నారని, రూ.7,500 పొందడం కోసం కాదని మేము నిర్ధారించగలిగాము.
దావాలోని లింక్ యొక్క ప్రామాణికతను గుర్తించడానికి who.is డొమైన్లో ఈ వెబ్‌సైట్‌ను శోధించడం జరిగింది. ఈ వెబ్‌పేజీ 13 ఆగస్టు 2020వ తేదీన ప్రారంభించారని మేము కనుగొన్నాము. అయితే, డొమైన్‌కు సంబంధించిన ఇతర సమాచారం ఏదీ లేదు.
విశ్వాస్ న్యూస్ ఈ లింక్‌ను సైబర్ నిపుణుడు ఆయుష్ భరద్వాజ్‌కు విశ్లేషణ కోసం పంపడం జరిగింది. ఈ లింక్ వాళ్లకు సంబంధించిన ఓ వెబ్‌సైట్‌ను ప్రోత్సహించడానికి మరియు క్లిక్‌ల సంఖ్యను పెంచడానికి ఒక మార్గం మాత్రమే అని భరద్వాజ్ మాకు చెప్పారు. ఈ లింక్ ఏ ప్రభుత్వ వెబ్‌సైట్‌కు లింక్ చేయబడలేదని, దీనిపై వివరాలు నమోదు చేయడం ద్వారా ఎవరికీ ప్రభుత్వం నుండి డబ్బు రాదని భరద్వాజ్ స్పష్టం చేశారు.
ఈ వైరల్ పోస్ట్‌ను షేర్ చేసిన అనేక పేజీలలో ఎఫ్బి పేజీ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఒకటి. ఈ పేజీని సోషల్ స్కానింగ్ చేయగా.. దీనికి 4,46,035 మంది ఫాలోవర్లు ఉన్నారని గుర్తించడం జరిగింది.
निष्कर्ष: ఈ వైరల్ దావా నకిలీ. ప్రతి పౌరుడికి లాక్డౌన్ రిలీఫ్ ఫండ్‌గా ప్రభుత్వం రూ .7,500 ఇవ్వడం లేదు.
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.