X

వాస్తవ తనిఖీ : ఫేస్ ఎడిటింగ్ యాప్ ద్వారా సృష్టించిన షారుఖ్ ఖాన్ ఫోటో, కాశ్మీరీ యువకుడి పేరిట వైరల్

షారూఖ్ ఖాన్ తన కాశ్మీరీ రూపాన్ని షేర్‌ చేసుకుంటున్న ఫోటో వాస్తవానికి షారుఖ్ ఖాన్ యొక్క అసలు ఫోటో అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది, ఇది ఫేస్ ఎడిటింగ్ యాప్‌ సహాయంతో ఎడిట్‌ చేయబడింది.

  • By Vishvas News
  • Updated: December 28, 2020

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక ఫోటోకు, అచ్చం బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ను పోలిన కాశ్మీర్‌ బాలుడు. అని రైటప్‌ ఇచ్చారు. వాస్తవానికి వైరల్ ఫోటో షారూఖ్ ఖాన్‌కే చెందినదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది, అయితే ఇది ఫేస్ యాప్ ద్వారా ఎడిట్‌ చేయబడింది.

వైరల్ పోస్ట్‌లో ఏముంది?
ట్విట్టర్ యూజర్ ఎస్ఆర్‌కె ఫ్యాన్ ఒక ఫోటో షేర్ చేశారు, “లేదు .. లేదు .. లేదు .. అతను షారుఖ్ ఖాన్ కాదు. అతను కాశ్మీర్‌కు చెందిన బాలుడు, అతను షారూఖ్‌ ఖాన్‌ లాగా కనిపిస్తాడు. ఆర్యన్ & అబ్రామ్ లుక్ కూడా పోలి ఉండదు’. అని రైటప్‌ ఇచ్చారు.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
మా దర్యాప్తును ప్రారంభించిన సమయంలో, షారుఖ్ ఖాన్‌కు జమ్మూ కాశ్మీర్‌తో ఏమైనా సంబంధం ఉందా అని గూగుల్ ఓపెన్ సెర్చ్ ద్వారా తెలుసుకోవడానికి మేము మొదట ప్రయత్నించాము. దీంతో, 2017 లో హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక కథనం కనిపించింది, ఇది శ్రీనగర్‌లో షారుఖ్ ఖాన్ ప్రమేయం గురించి ప్రస్తావిస్తుంది. ఆ కథనాన్ని పరిశీలిస్తే.. శ్రీనగర్‌కు చెందిన హైదర్ మక్బూల్ అనే వ్యక్తి షారుఖ్ ఖాన్ మాదిరిగానే ఉన్నారు. అతని కేశాలంకరణ మరియు రూపం నటుడు షారుఖ్ ఖాన్ లాగా ఉంటుంది. అయితే, మక్బూల్ చిత్రం వైరల్ అయిన ఫోటోకు భిన్నంగా కనిపించింది.

పరిశోధనలో మాకు ఇంకా చాలావార్తల లింకులు దొరికాయి, అయితే, వాటిలో ఏవీ వైరల్ అవుతున్న ఫోటో మాదిరిగా కనిపించలేదు. మీరు ఆ వార్తలను ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.

మేము వివరణాత్మక శోధన చేసిన సమయంలో, Getty Imagesలో షారూఖ్ ఖాన్ ఫోటోను మేము కనుగొన్నాము, ఇది వైరల్ ఫోటోను పోలినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటో మే 23, 2002వ తేదీన 55 వ కేన్స్ ఫెస్టివల్ సందర్భంగా తీశారు.

రెండు ఫోటోలను పరిశీలిస్తే ఒకే మాదికి ఫోటో అని స్పష్టంగా తెలుస్తుంది.

ఫేస్ యాప్ ద్వారా షారుఖ్ ఖాన్ చిత్రాన్ని ఎడిట్‌ చేసినట్లు మేము కనుగొన్నాము. మేము ఫేస్ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసి, అందులో షారూఖ్ ఖాన్ యొక్క నిజమైన చిత్రాన్ని అప్‌లోడ్ చేసి ఎడ్జ్ ఫిల్టర్‌ను ఎంచుకున్నాము. ఇందులో, సరిగ్గా వైరల్‌ అవుతున్న అదే ఫోటోను సృష్టించడం చూశాము, ఇది ఇప్పుడు నకిలీ దావాలతో వైరల్ అవుతోంది.

తదుపరి దశ దర్యాప్తులో, మేము మా తోటి దైనిక్ జాగరణ్‌ జమ్మూ కాశ్మీర్ సీనియర్ రిపోర్టర్ రాహుల్ శర్మతో మాట్లాడి అతనికి ఈ వైరల్ ఫోటోను షేర్‌ చేశాము, దానికి ఆయన విశ్వాస్ న్యూస్‌తో మాట్లాడుతూ, “ఈ ఫోటో గత కొన్ని రోజులుగా ఇదే వాదనతో వైరల్ అవుతోంది, కానీ ఈ ఫోటో ఎడిట్ చేయబడింది.” అని స్పష్టం చేశారు.

నకిలీ దావాతో పోస్ట్‌ను షేర్‌ చేసిన ట్విట్టర్ యూజర్ ఎస్‌ఆర్‌కె ఫ్యాన్‌ను సోషల్ స్కానింగ్ చేయడం జరిగింది. 2,335 మంది ఈ హ్యాండిల్‌ను ఫాలో అవుతున్నారని మేము కనుగొన్నాము. ఇది కాకుండా, షారుఖ్ ఖాన్‌కు సంబంధించిన పోస్టులనే ఈ హ్యాండిల్‌లో షేర్‌ చేస్తున్నారు.

निष्कर्ष: షారూఖ్ ఖాన్ తన కాశ్మీరీ రూపాన్ని షేర్‌ చేసుకుంటున్న ఫోటో వాస్తవానికి షారుఖ్ ఖాన్ యొక్క అసలు ఫోటో అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది, ఇది ఫేస్ ఎడిటింగ్ యాప్‌ సహాయంతో ఎడిట్‌ చేయబడింది.

  • Claim Review : అతను కాశ్మీర్‌కు చెందిన బాలుడు, అతను SRK లాగా కనిపిస్తాడు.
  • Claimed By : SRK FAN
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion
ఇంకా చదవండి

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later